పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

అబలాసచ్చరిత్ర రత్నమాల.

నింట కూరగాయ ముచ్చటలుతప్ప మఱియేమియు లేనందున వీధియే యెప్పుడును సుఖకరముగా నుండుటయు, అనేక విద్వాంసులతో ననేకప్రసంగములు చేసి యింటికిఁ బోఁగానే తా మొకక్రొత్తసృష్టిలోఁ బ్రవేశించితిమని తోఁచుటయు, సభలయందు పందొమ్మిదవశతాబ్దమువలెఁ దోఁచినను నింటఁ బదునాల్గవశతాబ్దమువలెఁ గానుపించుటయు సర్వ సాధారణమే గదా! ఇందుకుఁ గారణము స్త్రీవిద్యాభావమే యని చెప్పవలసియున్నది. కాన నిట్టివిద్వాంసులకు ఆవడాబాయికిఁగలిగిన యిచ్ఛఁజూచి సానందాశ్చర్యము గలుగక మానదు. స్త్రీలకు విద్య గఱపినయెడల నెట్టిమంచియూహలు గల్గునో ఈయావడాబాయి వ్యాసమువలననే స్పష్టమగుచున్నది. కాన స్త్రీవిద్య వలన నష్టము కలుగునని భయపడుటకు నెంతమాత్రము కారణము లేదు.

స్త్రీవిద్య శత్రువుల కనఁగా స్త్రీలకు బొత్తుగా విద్యనేర్పఁగూడదను వారికి పూనానగరమునందలి హయిస్కూ లోకగర్భశత్రువుగాఁ గానఁబడుచుండును. అచట విద్య నేర్చుకొను బాలికలను దూషించుటయే వారికి సత్కాలక్షేపముగాఁదోఁచుచుండెను. కాన నచట విద్యనభ్యసించువారిలోనెల్ల నాకాలమునం దగ్రగణ్యురాలుగా నుండిన ఆవడాబాయిని వారు బహుబాధలఁ బెట్టసాగిరి. వారామెను వీధులలో నెగతాళి చేసియు, తిట్టియు ననేకవిధముల నవమానపఱుపఁ జూచిరి. ఇంతటితోఁ దృప్తిచెందియుండక అనేక బీభత్సవచనములతో నాకాశరామన్న పేరుపెట్టి యనేకమైన యుత్తరములు నామెపేర వ్రాయుచుండిరి. వారామెను కనపడినచోటఁ గొట్టి చం