పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాబాయి

69

లుగుమార్గము కాన రాకుండెను. చితూరుకొఱ కాశూరు లెంతశౌర్యము గనఁబఱచినను అదియంతయు నిష్ఫలమై ఉదయసింహునకుఁ బరాభవము కలిగెను. అక్బరుబాదుషా తత్క్షణమే యాపిఱికిరాజును బట్టిచెఱలో నుంచెను. అందుపైఁ జేయునది లేక రజపూతవీరులు గ్రామమునకుఁ దిరిగిపోయిరి. వారిలో కొందఱు తమయిండ్ల కరుగఁగా వారిస్త్రీలు పరాభవము నొందివచ్చినభర్తలను, పుత్రులను సోదరులను లోపలికి రాకుండ తలుపులు మూసి వారిని తిరస్కరింపుచు నిట్లనిరి. "రజపూత కులమునందు మీ రేల జన్మించితిరి? సిగ్గులేక మీ మొగములు మరల మాకుఁ జూపకుఁడు. సంగ్రామమరణముగాని, జయముగాని దొరకిననే మీకు కీర్తియు, యసమును కలుగును."

ఉదయసింహుని తురుష్కులు చెఱఁబెట్టిరని తెలియఁగా రాజభవనమునం దంతట నెటుచూచినను దు:ఖమయముగానే యుండెను. అప్పుడు రజపూతు వీరులందఱు సభచేసి "ఉదయసింహమహారాజుగారి నెటుల విడిపించనగు? శత్రువుల నోడించుటయెట్లు" అని చింతింపసాగిరి. ఇటుల వా రనేక తీరుల విచారించి, తోఁచక చింతాక్రాంతులై కొంతవడి యూఱకుండిరి. ఆసమయమునం దాపట్టణమంతయు మిగుల నుదాసీనముగానుండెను. కాని మరల క్షణకాలములో నొక యువతి వారి నానందసాగరమునం దోలలాడించెను. ఆస్త్రీ ఉదయసింహునిపత్ని యగువిరాబాయియే! నాభర్తను మ్లేచ్ఛులు కైదుచేసిరి. రజపూతు లోడిపోయిరి, చితూరిఁక తురకల యధీనమగును. మనమందఱమా నీచుల స్వాధీనమగుదుమ"ను నట్టివిచారము లనేకము లామె మనంబున నుద్భవింపసాగెను.