పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

అబలాసచ్చరిత్ర రత్నమాల.

లేనందున దానిని నిశ్చయింప లేకుండిరి. పన్నాదాయి యచటనుండివెడలి రాజకుమారునిదాఁచిన స్థలమున కరిగియాబాలుఁడు ప్రౌఢుఁడగువఱకు నాతనిని పోషించెను. ఈసంగతియంతయు రజపూతులకుఁ దెలియఁగావారు ఉదయసింహుఁడుపెరిగినపిదప బనబీరుని దేశము వెడలగొట్టి ఉదయసింహునినే రాజునుగాస్వీకరించిరి. ఇట్లురాజభక్తిగల యువతివలన సంగ్రామసింహునివంశము నిలిచెను. అనేకప్రజలను గాపాడు ప్రభువుబతికెను. కాననట్టి యువతికీర్తి భరతఖండమునం దంతటను నిండియుండుట వింతగాదు. ఉదయ సింహుఁడు పన్నాను తల్లినిగా భావించి పూజింపుచుండెను.