పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృపాబాయి

               ఉ. హర్తకుఁ గాదుగోచర మహర్నిశమున్ సుఖపుష్టి సేయు స
                   త్కీర్తిఘటించు విద్యను దివ్యధనం బఖిలార్థికోటికిన్.

తమవిద్యవలనను సద్గుణములవలనను భరతఖండమును నలంకరించిన యాధునిక స్త్రీలలో కృపాబాయి యొకత యని గణింపఁబడుచున్నది. ఈమె యల్పవయస్సునందే పరలోకమున కేగినను తనకీర్తిని నాచంద్రార్కముగా భూమియం దుంచిపోయెను.

కృపాబాయి 1862 వ సంవత్సరమునం దహమదునగరమున జన్మించెను. ఈమె జనకునిపేరు హరిపంతులు; జనని పేరు రాధాబాయి. వీరు పూర్వము మహారాష్ట్రబ్రాహ్మణులుగా నుండి పిదప క్రైస్తవధర్మము స్వీకరించిరి. ఈమె చిన్నతనమునే తండ్రి పరలోకయాత్ర స్వీకరించెను. కాన కృపాబాయికి పితృసుఖ మేమియుఁ దెలియదు. అట్లయినను రాధాబాయి మిగుల దక్షతతోఁ దనసంతానముయొక్క విద్యాబుద్ధులకు లోపము జరుగకుండ చూచుచుండెను. ఆమె తాను విద్యావతి గాకున్నను సద్గుణవతిగాన విద్యావతు లయిన స్త్రీలచే విని నటుల కార్యదక్షురాలై తనబిడ్డలకు సదాసద్గుణములే యలవడునట్లు చేయుచుండెను. వారింట సదాశరీరసౌందర్యమున కనుగుణము లగుదుస్తులును ధరియించుటకంటెను శరీ