పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

అబలాసచ్చరిత్ర రత్నమాల.

చేసిరి. కాని యారెండు తెగలవారిలో నెవ్వరును వెనుకఁ దీయరైరి. రజపూతు సరదార్ల నేకులు రణరంగమునందు హతులయిరి. రజపూతు లెంత దృఢనిశ్చయముతోఁ బోరినను తురక సైన్యములు బీరువోవ కుండుటయు, నానాటికి రజపూతు సైన్యములు పలుచపడుటయుఁ గని భీమసింహుఁడు మిగుల చింతాక్రాంతుఁ డయ్యెను. తుద కాతఁడు ప్రజాక్షయమున కోర్వఁజాలక డిల్లీశ్వరునితో సంధి సేయనెంచి యందు కయి కొందఱు మంత్రుల నంపెను. కాని యది పొసఁగినదికాదు. సంధి దెల్పవచ్చినవారితో అల్లాఉద్ధీను తనకుపద్మిని దొరకినంగానిరణ మాగదని స్పష్టముగాఁ దెలిపెను. ఈవార్త వినఁగానే శూరరజపూతు లందఱు పడగఁ ద్రొక్కిన సర్పములభంగి అదరిపడి తమయందఱి ప్రాణములు పోవువఱకును యుద్ధముఁ జేసెదమని విజృంభించిరి. అందుపై నా యిరువాగుసైన్యంబులుందలఁపడి యుద్ధము చేయుచుండిరి.

ఇట్లు పదునెనిమిది మాసములు యుద్ధము జరుగుచుండెను. కాని శూరులగు రజపూతులు బాదుషాసైనికులను బట్టణములోనికిఁ బోవనియ్యకుండిరి. అల్లా ఉద్దీను వారి నిశ్చయము గని రజపూతుల యుద్ధమునం దోడించి పద్మినిని బట్టు ప్రయత్నము మానుకొనవలసినవాఁ డాయెను. యుద్ధము మానుకొన్నను పద్మినియం దతనికిఁగల వ్యామోహ మతని నాపొలిమేర దాఁటి పోనియ్యకుండెను. అందువలన నతఁడు భీమసింహున కిట్లు వర్తమాన మంపెను. "నాకు పద్మిని దొరకునన్న యాస లేదు. కాని యామె రూప మొకసారియయినను మీరు నా కగుపఱచినయెడల నేను సైన్యసహితముగా డిల్లికి మరలి వె