పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

అబలాసచ్చరిత్ర రత్నమాల.

కొనిన యుచ్ఛిష్టము లయిన పోక చెక్కలు సమాప్తము లయ్యెను. కానభర్తయెంగిలి లేదని యామె యెనిమిదిదివసంబు లుపవాసంబు చేసెను. కాని నేను ఉపోష్యము చేసితినని యెవరికిని నామగువ తెలుపక యింటిపనినంతను జేయుచుండెను. ఇట్లు చేయఁగా నెనిమిదవదినమున నామె యాఁకలిచేఁ బీడింపఁబడి వంటఁ జేయుచు నచటనే మూర్ఛిల్లెను. ఇంతలో నామె సహోదరి యామెను గనుఁగొన నేతెంచి యదియంతయుఁ గని దాని కారణము నెఱింగి తత్క్షణమే తానామెభర్తకడ కేఁగి యుచ్ఛిష్టము తెచ్చి పదునేనుదినముల తదనంతర మామెకు భోజనము చేయించెను! దీనివలన స్త్రీలు తమభర్తృప్రేమకొఱ కెట్టికష్టముల నైనను నధిక సంతోషముతో సహింతురని స్పష్టమగుచున్నది. వారికిఁ గలభర్తృప్రేమ మిగుల శ్లాఘ్యమయినది. స్త్రీలుస్వాభావముచేతనే పతులయెడ ప్రేమఁ గలిగి యుందురు.

జోగమాంబ యిట్టిభక్తిఁ గలిగి పతిసేవఁ జేయుచున్నను ఆమెభర్త యగురామయ్యగా రామెను మిగుల నిష్ఠురదృష్టిచేఁ జూచుచుండెననియెదరు! ఆమెను నిష్కారణముగాఁ గొట్టియుఁ దిట్టియు ననేకవిధముల బాధ పఱచెను! కానియా సాధ్వీమణి యెప్పుడును భర్తయెడలఁ గలభక్తిని కొంచెమయినను విడువక యాబాధలను మిగుల నోపికతో సహింపుచు నెవరికిఁ జెప్పక యధిక పతిభక్తితో వర్తించెను.

జోగమాంబ పతిభక్తియందేగాక యనేకసద్గుణములలో సహితము ప్రఖ్యాతయయ్యెను. ఆమె బావగార్ల బిడ్డలతన