పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

18

అబలాసచ్చరిత్ర రత్నమాల.

               క. సఖులును దానును విమల
                   ప్రఖరమహాక్షాత్రతేజబలయుతలై సత్
                   శిఖులను బోలి వెలింగిరి
                   యఖిలజనంబులును జూడ నాసమయమునన్.

రాణియు నామెతోడ నున్న ప్రతిదాసియు, నొక్కక్కమడకత్తి నదివఱకే తమయొద్ద దాఁచియుంచుకొని నందునఁ బ్రతిపక్షులను గనినతోడనే వారంద ఱాకత్తులను దీసి పోరాడసాగిరి. కాని యుద్ధకళానిపుణులయిన యవనవీరులతో స్త్రీ లెట్లు దీర్ఘ కాలము పోట్లాడఁ గలరు? రాణిగా రీసంగతి తెలిసియే శత్రువులతోఁ దనవల్లనైనంత పోరాడుచు యుద్ధముఁ జూడ నచ్చట మూఁకలుగట్టి నిలుచున్న ప్రజలవంకఁ జూచి యిట్లనియె : _

              క. హిందువు లెవ్వరు లేరా
                  యిందు స్వధర్మాభిమాన మెఱిఁగినవారల్
                  హిందూభగినీజనులకుఁ
                  గుందక సాయంబుఁ జేయఁ గోరుమహాత్ముల్.

              గీ. ఇట్టివారలు గల రేని యాక్షణంబె
                  వచ్చి సాయంబు చేయుఁడు వనితలకును
                  రాకపోయిన శపథంబు మీకుఁ గలదు
                  మమ్మురక్షించు సర్వభారమ్ముమీది.

ఇట్లత్యంతమర్మ భేదకము లగువాక్యములు రాణిగారి వాక్కునుండి రాఁగా విని, అభయచందు నిర్భయచందులను బిరుదులు గల యన్నదమ్ము లిద్దఱును కొంతసేనతోడ వచ్చి