పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

అబలాసచ్చరిత్ర రత్నమాల.

కూఁతులును, తిరువళ్ళేర్, అధికమాన్, కపిలర్, అను ముగ్గురు పుత్రులును గలిగిరి. వీరి నందఱిని పిరలీ యాజ్ఞవలన నాతని భార్య పుట్టిన చోటులనే విడిచిపోవు చుండెను. ఈపిల్లలందఱు వేరువేరు జాతులవారలకు దొరకి వారిచేఁ బెంచఁబడి మిగుల విద్వాంసులైరి. వా రందఱిలోనఁ బెద్దది అవ్వయర్. ఈమెను తలిదండ్రు లరణ్యమున విడిచిపోఁగా నొకవిద్వాంసుఁడు కొని పోయెను. ఆవిద్వాంసునిపే రెచటను గానరాదు. ఆయన యీమెకు విద్యాబుద్ధులు చెప్పి గొప్ప పండితను జేసెను. ద్రావిడమునం దీమె గొప్పకవయిత్రి. ఈమెకు నీతిశాస్త్రము, జ్యోతిశాస్త్రము, వైద్యశాస్త్రము, భూగోళశాస్త్రము, రసాయనవిద్య మొదలయిన విద్యలలో మిగుల ప్రవీణురా లయ్యెను. ఈమె ఆయావిషయములలో నొక్కొక్క గ్రంథము రచియించెను. ఆగ్రంధము లిప్పుడును ద్రావిడదేశమునందు పాఠశాలలో బాలురకు నేర్పుదురఁట. ఇందువలననే యాభాష యందలి యామె పాండిత్యము వెల్లడియగుచున్నది. ఈమె కల్పవిద్యాప్రభావమువలన 240 సంవత్సరములు జీవించెనని యొకవదంతి గలదు. ఈమె తనజన్మమంతయు కన్యాత్వమున నే గడపెను. ద్రవిడదేశమునం దీమెను మిగుల పూజ్యురాలినగా లోకులు మన్నింతురు.

రెండవదియగు ఆపగ్గా; - ఈమె అవ్వయర్ చెల్లెలు. ఈమెయు ద్రావిడజాతి కవయత్రి. ఈమె ఆర్కాట్ మండలములోని ఊటకాఁడు అనుగ్రామమునందు జన్మించెను. జననీ జనకు లామె నచటనే విడిచిపోయిరి. తదనంతర మీమె నొక రజక స్త్రీ పెంచెను. తదనంతర మీమెకు విద్యాబుద్ధు లెట్లు