పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనలక్ష్మి.

273

కొని సముద్రములోఁ బోవుచుండిరి. పడవలో మిగిలిన వారందఱును మునిఁగిపోయిరి. ఈదంపతులు సముద్రములోఁ బడిపోవునపుడు వారినోళ్ళలోనికి నీరు పోవుచుండెను. అప్పుడు నదిలో సహితము దిగక యొడ్డుననుండి స్నానము చేయు నాగిరిజాశంకరుని భయమునకు మితము లేదయ్యెను. కాని యట్టిసంకటసమయమునను ధైర్యమును విడువక ధనలక్ష్మి తనభర్తకు ధైర్యము చెప్పుచు నతని పిఱికితనముఁ బోఁగొట్టుచు నీత నేర్చినదిగాన కొంతదూర మీఁదుచు నాకట్టె యాధారమువలనఁ బోవుచుండెను. అంతలో వారిసమీపమున 'హరిశంకరుఁ' డను నొకచిన్న వాఁడు మునిఁగి నీళ్ళపైకిఁ దేలి వారినిఁ బట్టుకొనియెను. అప్పు డాకట్టె ముగ్గురిని తేల్చఁజాలక ముంచున ట్లుగుపడఁగా దానిని గనిపెట్టి ధనలక్ష్మి యుపకార బుద్ధి గలదయి తనభర్తకును నాహరిశంకరునకును నాకట్టెను పట్టుకొనిపోవు విధము చెప్పి తా నొకత చచ్చి యిరువురు బ్రాహ్మణులు బ్రతుకుట శ్రేష్ఠమని తలఁచి యాకట్టె వారికి నిచ్చి తా నీదుకొని పోవఁదొడఁగెను. ఆహా! ఈమె పరోపకార బుద్ధిని వేనోళ్ళఁ బొగడినను నత్యుక్తి యగునా? ఈమె కట్టె విడిచి కొంచెముదూరము వచ్చిన వెంటనే యొకగొప్ప యల వచ్చి యామెను ముంచెను. ఆమె నీళ్ళలో మునుఁగుట నెఱిఁగినదిగాన నప్పుడు మునిఁగియుండు పరమేశ్వరుని దయవలన మరలఁ బైకి రాఁగలిగెను. ధనలక్ష్మి నీటిలోనుండి బైటికి వచ్చునప్పటి కామెపతి యామెకు దృగ్గోచరుఁడు గాఁడయ్యె. అంత నామె తనపతిని రక్షించుమని పరమేశ్వరుని ననేకవిధములఁ బ్రార్థించి కనులు విప్పునప్పటి కామెకు సమీపముననే