పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

అబలాసచ్చరిత్ర రత్నమాల.

చాందబీబీ యాజ్ఞప్రకారము వారిరువురును వచ్చుచుండఁగా త్రోవలో శత్రువులు వారిని రానియ్యక నిలిపిరి. నేహంగఖాన్ మాత్రము శత్రుసైన్యము నుపాయముగాఁ జీల్చి రాజధానిం బ్రవేశించెను.

ఆదిల్‌షహ, కుతుబ్ షహాలు మురాదునిరాక విని ప్రధమమునందు నిజామ్‌శాహీని గెలిచి పిదప మన పైకివచ్చునని భయపడి విపులసైన్యములతో నిజామ్‌శాహీకిఁ దోడుగా వచ్చుచుండిరి. ఈ సంగతి విని మురాద్ వారు వచ్చినచో గెలుపొందుట కష్టమని తలఁచి గ్రామమును చుట్టుముట్టి బురుజులను పడఁగొట్ట యత్నింపుచుండెను. మరాద్ సైనికులు బురుజులను బైటినుండి త్రవ్విగూడుచేసి యాగూఁటిలో తుపాకిమందునుంచి దానికి నగ్నిని రవులుకొల్ప యత్నింపుచుండిరి. కాని చాతుర్యవతియగు చాందబీబీ లోపలినుండి బైటివఱకు రంధ్రములు పొడిపించి వారాగూటిలోనుంచు మందు నీవలికిఁ దీయింపుచుండెను. ఇంతలో వారొక బురుజునకు నిప్పంటించి నందున నా బురుజుతోఁ గూడ ననేక సైనికులు నాశమునొందిరి. అంత నాత్రోవను మొగలులు పట్టణములోనికిఁ జొర నుంకించఁగా నదివఱ కధిక శౌర్యముతో యుద్ధము చేయుచున్న నిజాము సైన్యములు ధైర్యమును విడిచి పాఱఁదొడఁగెను. అప్పుడు చాందబీబీ ధైర్య మవలంబించి, కవచమును ధరియించి మోముపై ముసుకువేసికొని చేత ఖడ్గమును ధరియించి "నాబొందిలో ప్రాణము లుండఁగా పట్టణము పగవారిచేఁ జిక్కనియ్యన"ని కూలిన బురుజు వైపునకుఁ బరుగెత్తెను. దానింగని సైనికు లధికశౌర్యసాహసములుగల