పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాందబీబీ.

263

దొకఁ డకస్మాత్తుగా నతనిఁ బంపెను. తదనంతరమునం దాతని తమ్మునికొడుకగు రెండవయిబ్రాహీం ఆదిల్‌షహా సింహాసనారూఢుఁ డయ్యెను. ఆయన 9 సంవత్సరముల బాలుఁ డగుటవలన నాతని పెత్తండ్రి భార్యయగు చాందబీబీయే కమీల్‌ఖానను మంత్రి సహాయమువలన రాజ్యము నేలుచుండెను. కొన్నిదినములయిన వెనుక కమీల్‌ఖానునకు రాజ్య కాంక్ష మిక్కుటమయ్యెను. దానింగని చాందబీబీ కీశ్వరఖానను సరదారుని సహాయముచే వానిఁ జంపి కీశ్వరఖానునకు దివాన్ గిరి నిచ్చెను. కాని కొంతకాలమునకు వాఁడును కృతఘ్నుఁడయి రాణిమీఁదఁ గొన్ని దోషముల నారోపించి యామెను సాతార కిల్లాలో కైదుచేసియుంచెను. చాందబీబీని కైదుచేసిన పిదప కీశ్వర్‌ఖాను రాజ్యమునం దంతటను విశేషసంక్షోభము చేయ సాగెను. దాని నెవరును మాన్పలేక యుండఁగా యెకసాల్‌ఖానను సిద్దీసరదారుఁ డొకఁడు వాని నచటినుండి వెడలఁగోట్టి చాందబీబీని విడిపించి తెచ్చెను. తదనంతర మామె యెకసాల్‌ఖానును వజీరుగా నేర్పఱచి రాజ్యము నేలుచుండెను. అప్పుడాతఁడు పాతనౌకరుల నందఱిని తీసి క్రొత్తవారిని నియమించెను. అక్కాలమునందు విజాపురమునందలి జనులు మంత్రిత్వము ఉన్‌ఉల్ ముల్కసిద్దీ కియ్యవలెనని కొందఱును, అబ్దుల్ హసనను దక్షణీతురక కియ్యవలెనని మరి కొందఱును ఇట్లు రెండు పక్షములుగా నుండిరి.

ఇట్లు రాజ్యంబులోనంత:కలహంబులుజరుగుచుండఁగా మూర్తిజా, నిజామ్‌షహా కులీకుతుబ్‌షహా వీరిద్దఱును అహమ్మదనగరముపైకి దండువెడలి దానిని సమీపించిరి. అప్పుడ