పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరసవాణి.

259

తమయుపచానము నిమిత్తమయి దాసులనుగా చేయుచున్నారు. పురుషులు స్త్రీలవిషయమునఁ జేసిన యిట్టియన్యాయము వలన స్త్రీలను మూఢురా డ్రనుగాఁ జేసి చెడఁగొట్టుటయేకాక తామును వారి తోడిపాటుగా మూఢశిరోమణులయి చెడిపోవుచున్నారు. అందుచేత పురుషులలోఁగూడ నిజమయిన యీశ్వరభక్తియు సద్వర్తనమును బోయి మూఢభక్తియు, నీతిరాహిత్యమును వర్ధిల్లుచున్నవి. దానినిఁబట్టి నిజమయిన సౌఖ్యమును సంతోషమును లేక యనేకులు భూతల స్వర్గముగా నుండవలసిన గృహము మహారణ్యమువలె నుగుచున్నది. ఏయింటఁ జూచినను నైక మత్యమునకు మాఱుగా కలహములును, మనస్తాపములును పెరుగుచున్నవి. ఈస్థితియంతయు పురుషుల లోపమువలనను స్వప్రయోజన పరత్వమువలనను గలుగుచున్నదె కాని స్త్రీలదోషమువలన నణుమాత్రమును గాదు. ఏకాలము నందును ఏదేశమునందును తమస్త్రీలను మంచిదశకు తీసికొనిరాక తాము బాగుపడిన పురుషులులేరు, తాము బాగుపడఁ దలఁచిన పక్షమున ముందుగా తమ స్త్రీలను బాగుచేయవలెను; స్త్రీల బాగే పురుషుల బాగు కాఁబట్టి పురుషులు తమయోగక్షేమాభివృద్ధి నిమిత్తమే మూఢు రాండ్రయినయిప్పటి స్త్రీలను తొంటి యుత్తమదశకు మరలఁ దీసికొనివచ్చుటకై ప్రయత్నింపవలెను. స్త్రీల యభివృద్ధి నిమిత్తమయి యక్కడక్కడ నుత్తమపురుషులు చేయు ప్రయత్నములకు మూఢతాపిశాచావేశముచేత స్త్రీలే ప్రతిబంధకారిణు లగుచున్నారు. ఇంటివద్ద స్త్రీల సహాయ మున్నంగాని కులాచార మతాచార విషయములయందు పూర్వాచారములకు విరుద్ధములైననూతన