పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

అబలాసచ్చరిత్ర రత్నమాల.

నుండి వెడలి ఉజ్జయినిలో నాంగ్లేయుల యాశ్రమమునం దుండ వలసినదాయెను.

ఈమె యుజ్జయనిలో నుండినకాలమునందు నచట ననేక గృహములను గట్టించెను. క్షిప్రానదీతీరమున నొకఘట్టము కట్టించి యచట గంగయొక్క మూర్తిని స్థాపించెను. రఖమాబాయిగా రచట నొక యన్న సత్రమును సహితము స్థాపించిరి. ఇది యంతయుఁగాక యామె గ్రామమునందలి బీదసాదల నరయుచు వారికి సహాయము చేయుచుండెను.

1843 వ సంవత్సరమున హరిరావ్ మహారాజుగారు స్వర్గస్థు లయిరి. తదుపరి ఖండేరావుగారు సింహాసనారూఢులయిరి. అప్పుడు హరిరావు కాలమునందు జప్తు చేయఁబడిన రఖమాబాయిగారి యగ్రహారము వారికి మరల నియ్యఁబడెను. కాన నామె మరల నిందూరునకు వచ్చెను.

రఖమాబాయి తనద్రవ్యమును హోళకరుకు బదులిచ్చెను. అది నేఁటివఱకుఁ దీర్పఁబడుచున్నది. ఇదిగాక యామె రాజపుతానాయందలి మధ్యహిందూస్థానమునందలి సంస్థానికుల కనేకుల కనేకలక్షధనము వడ్డీకి నిచ్చి వారి నందఱినిఁ దనకు ఋణులను జేసి వారిచే మిగుల గౌరవింపఁబడుచుండెను. ఇప్పటికిని నామె వంశీకులను సంస్థానికు లందఱు తమతో సమానముగా మన్నింతురు.

1844 వ సంవత్సరమున క్రొత్తగా సింహాసనారూఢుఁడయిన ఖండేరావు మృతినొందెను. అప్పుడు రాజ్యమునకు వారసులు లేక యున్నందున నచటివారి కందఱకును మిగుల విచారముగా నుండెను. ఆసమయమునందు రఖమాబాయియు,