పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైసలదేవి.

239

డుమైసలదేవియొక్క సద్గుణములంగనిమిగుల కనికరించిముంజలా యను నెపమున రాణినే యాతనికడకంపెను. రాజును వేషాంతరములో నున్నభార్యను భోగభామినిగా నెంచి నాఁ డామెతో మిక్కిలి సంతోషముగాఁ గాలము గడపెను. మైసలదేవియు నాతని యుంగరమును గుర్తుగాఁగొనెను. పరమేశ్వరుని యనుగ్రహమువలన నాటితో మైసలదేవి గర్భమును ధరియించెను. తదనంతరము కొన్ని కారణములచే వేశ్యాసంభొగము చేసినందునకయి రాజు మిగుల పశ్చాతాపము నొందెను. తద్దోషపరిహారార్థ మారాజు బ్రాహ్మణానుమతంబున నైదుతప్తప్రతిమల నాలింగనము చేసికొనుటకు సహితము సిద్ధమయ్యెను. కాని మంత్రి నిజముగా జరిగినసంగతిఁ దెలుపఁగా రాజుమనసు శాంతిఁబొందెను. అటుపిమ్మట రాణి ప్రసవమై కొమరునిఁ గనెను. ఈచిన్నవానిపేరు సిద్ధరాజ జయసింగని పెట్టిరి.

ఈచిన్నవాఁడు బాలుఁడయి యున్నసమయముననే కర్ణరాజు 1094 వ సంవత్సరము మృతినొందెను. పతిమరణము వలన మైసలదేవికిఁ గలిగిన దు:ఖమునకుఁ బారములేదు. కాని యట్టిసమయముననే యామె తనదు:ఖమును దిగమ్రింగి రాజ్యభారమును వహించి ప్రజలను సుఖపెట్టవలసిన దయ్యెను అదేలయన కర్ణరాజు ననంతరము బాలుఁడగు సిద్ధరాజ జయసింగునికిఁ బట్టము గట్టి యాతనిపేర కర్ణరాజునకు మాతులుఁడగు మదనపాలుఁ డనువాఁడు రాజ్యము నడుపుచుండెను. కాని యాతఁడు విచారశూన్యుఁ డయినందున ప్రజలకు న్యాయము దొరకకుండెను కాన సామంతుఁడను ప్రధానుఁ డొకఁడు బాలరాజును తనస్వాధీనము చేసికొని మిగులచాతుర్య