పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మావతి.

229

వంతుఁడయినను, రూపహీనుఁడయినను, వివేకియయినను, అవివేకియయినను, రోగియయినను, నిరోగుఁడయినను, మఱి యెట్టివాఁ డయినను, చేపట్టిన పెనిమిటివిషయమున లేశమయిన పొర పొచ్చములులేక మిక్కిలి మచ్చికగలిగి యనువర్తింప వలసినది భార్యకు ముఖ్యధర్మము. భర్త తన కేమిచ్చినను మిక్కిలి సంతోషపడవలెనుగాని చాలదని యెప్పుడును దు:ఖపడఁగూడదు. పతి తెచ్చియిచ్చిన వస్తువులను పదిలముగా దాచి యుంచి మరల నాతఁడడిగినప్పుడు నిష్కపటముగా నిచ్చి వేయవలెను. బతిభిక్ష మెప్పుడును దప్పక పెట్టుచుండవలెను. దేవ పితృపూజకాలములయందుఁ దనపతికి ననవరతము శుభములు గలుగునట్టుగాఁ ప్రార్థింపవలెను. పతియనుమతిలేక దేవతలనుగాని పితరులనుగాని యతిధులనుగాని పూజింపరాదు. పూజించినచో నది సద్గతినొందనేరదు. ఈవిషయమున పార్వతీదేవిచెప్పిన యితిహాసము చెప్పెదను. పూర్వ మొకబ్రాహ్మణున కిద్దఱుముద్దియలు గలరు. వారిలో నొక్కతె తనపెనిమిటి యనుమతిప్రకార మడఁకువగలిగి నడచుకొనుచుండెను. మఱియొక్కతె స్వతంత్రతను వహించి తనయిష్టప్రకారము పితృదేవతాతిథి పూజలను జేయుచుండెను. కొంతకాలమునకు పిమ్మట విధివశమున వారు మువ్వురును నొక్కపర్యాయమే మృతినొందిరి. అప్పుడు పతికి హితముగా నడుచుకొన్న సతి పతిపోయిన సుగతికిఁ బోయెను. పతిసమ్మతికి విరోధముగా నడచుకొన్న రెండవ పడఁతిని యముఁడు పోఁగూడ దని యాటంక పఱచినందున వెనుకనే నిలిచి కన్నుల నీరు పెట్టుకొని యేడువ మొదలు పెట్టెను. అది చూచి యతఁడు దయార్ద్రహృదయుఁ డయి యా