పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

అబలాసచ్చరిత్ర రత్నమాల.

విజయము కలుగవలయునని పరమేశ్వరు ననేకవిధముల వేడుకొనుచుండిరి.

తుద కొకదినమున నాసైన్యములు రెండును నొండొంటిఁ దాఁక నాయుభయ సైన్యములలోని వీరులును దమతమ సంగ్రామకౌశలములు మీర ఘోరంబుగాఁ బోరఁ దొడంగిరి. వా రట్లు పోరుటచే నాకాశమంతయు ధూళిగ్రమ్మి సూర్యుని మఱుఁగు పఱచెను. అంతఁ గొంతవడికి నాధూళి యడఁగి రక్త నదులుఁ బాఱఁజొచ్చెను. పీనుఁగులపెంట లనేకములు పడెను. ఇట్టి రణరంగమునందు పృధివీరాజునకు నపజయము కలిగెను. కాని యాతనిసైనికులలోఁ శత్రునకుశరణు చొచ్చినవాఁడేని యుద్ధభూమినుండి పాఱిపోయినవాఁ డేని కానరాకుండెను. పృధివీరాజుకుగూడ నాయుద్ధమునందే మడిసెనని కొందఱు చెప్పెదరు. గోరీవిజయుఁడయి పృధివీరాజును చెఱఁబట్టి గ్రుడ్లు తీసి వేసి యాతనిపాదములకు మిక్కిలి బరువు లయినలోహపుబేడీలనువేసి కారాగృహమునందుంచెననియు, నీసంగతి యంతయు విని పృధివీరాజుమంత్రియు, నతనిచరిత్ర లేఖకుఁడును, మహాకవియునగు చాందభట్టు గోరీయాస్థానమున కరిగికొన్నిదినము లచటనుండి యాతనికృపకుఁ బాత్రుఁడై పృధివీరాజును చూచుట కనుజ్ఞవడసెననియు, అట్లు సెలవంది కారాగృహమున కరిగిపృధివీరాజును పలుకరింపఁగా నాతఁడు కన్నులు లేకున్నను మాటను గుర్తించి యాభట్టును కౌగిలించుకొనెననియు, అచట వారిరువురు నొకయుక్తివలన నాతురష్కునిఁ జంప నిశ్చయించుకొని రనియు, అందుపై చాందుభట్టు గోరీయొద్దికివెళ్లి ప్రసంగరీత్యా పృధివీరాజుయొక్క బాణనైపుణ్యమును వర్ణించుచు నాతఁ డిపు