పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విమల.

217

మార్గమునఁ బోయినందున కర్ణునకుఁ జిక్కఁడయ్యె. కర్ణుఁడు అరణ్యమున నతనిని వెదకుచుఁబోయి విమలా రూపసుందరు లున్నస్థలమునకుఁబోయెను. అల్పులగు వీరభటులను విపుల సైన్యసహితుఁ డగు కర్ణుఁడు వధియించి విమలయొక్క రూపమునకు మోహితుఁడయి యామెను బలాత్కారముగా తన శిబిరములోనికిఁ గొనితెచ్చెను. అప్పు డామె రోదనమును విని కర్ణుఁడు దప్పక యతని సైనికుల కందఱకును నామెపై మిగుల దయగలిగను. కర్ణుఁడు బలాత్కారముచేయు ననుకొని యామె ప్రాణములను విడువ నిశ్చయించెను. కాని నీసమ్మతిలేనిది నిన్ను నేను బలాత్కారము చేయనని యతఁడు పల్కఁగా నామె ప్రాణత్యాగము చేసికొనుట మానెను. కర్ణుఁడామెను తనవైపునకుఁ ద్రిప్పుటకు నలుగురైదుగురు దాసీలను నియమించెను కాని వారామె దృఢనిశ్చయమును, పాతివ్రత్యమునందలి యభీష్టమును మరల్పలేక యుండిరి. అంతఁ గర్ణుఁ డచటనుండిన నీమె తనకు వశవర్తిని గాదని తన రాజ్యములోని దగుసోరట్ నగరమున కామెను తీసికొనిపోయెను. అచట నామె కనేకప్రకారముల బోధించినను ఆమె కర్ణునకు వశపడకుండెను. కాన కర్ణుఁడు సురపాలుఁడు చనిపోయెనని యామె భృత్యుని కొకనికి లంచమిచ్చి వానిచే నామెకుఁ జెప్పించెను. అట్లు చెప్పుటవలన నామె భర్తయాసను విడిచి తనకు వశపడునని కర్ణుఁడు తలఁచెను. కాని యట్లుగాక వెంటనే యామె సహగమనమునకుఁ బ్రయత్నముచేసెను. అప్పుడు కర్ణుఁ డామెనట్లుచేయవలదనియును, ధర్మశాస్త్ర ప్రకారముతనను వివాహము చేసికొనుమనియు ననేకవిధములఁ జెప్పి సహగమ