పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జసరేశ్వరి.

201

జసరేశ్వరికి భర్తచేయు దురాలోచన తెలిసి తన్నివారణార్థమై యామెయాతని కనేక హితబోధ లొనర్చియు, వేఁడుకొనియుఁ జూచెను. కాని యందువలన ఫలమెంత మాత్రమును గలుగుజాడ కానరాదయ్యెను. జసరేశ్వరియందును కెంతయు జింతింపక పతిచేత నట్టిదుష్కార్యము కాకుండ నొక యుపాయముఁ యోచించెను.

బంగాళాదేశమునందు బహుదినములనుండి నడుచుచుండిన యొక యాచారము కలదు. అది యిప్పటికిని ఆదేశమునం దచ్చటచ్చట నడుచుచున్నదఁట. అది యేదనగా నొకస్త్రీ తనకార్యము నొకశూరపురుషునిచేఁ జేయించఁగోరినప్పు డామె తనచేతి కంకణము నొకదానిని శూరులసభకుబంపును. దానిం గొని చని యొకదాసి యీశూరులమధ్యం బడవేయును. తదనంతర మచటి శూరులలో నొకఁ డాకంకణమునుతీసికొని కంకణమంపిన స్త్రీ యెట్టిదుర్ఘటమైన కార్యము నిర్వహింప నంపినను నిర్వహించెదనని ప్రతినచేయును. జసరేశ్వరి దీనినంతను విచారించి తన నాయుపాయముచేయ నెంచెను. తదనంతర మొకదినము రాణిగారి యాజ్ఞవలన నామె కంకణమును దాసికొనివచ్చి ప్రతాపాదిత్యుని కొలువుకూటమునం బడవేసెను. దాని గని సభికులందఱు మిగుల వింతపడి రాజువంకఁ జూచుచుండిరి. ప్రతాపాదిత్యుఁడు తిరస్కారముగా దానికయి చూడకుండెను. తుద కాసభయందలి శూరుఁడొకఁడు లేచి మెల్లఁగా ముందడుగిడెను. ఆలేచినవాఁడు రాణిగారి సహోదరుఁడును, ప్రతాపాదిత్యుని సేనానియునై యుండెను. ఆతఁ డట్లు లేచి కంకణమునెత్తి రాజువంకఁ దిరిగి యిట్లని వక్కా