పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ఇట్లీశూరవనిత మొదట తనకొమారుని పేరిటను, పిదప మనుమని పేరిటను రాజ్యంబు జేసి ఔరంగజేబువంటి సార్వభౌమునితోడను, పేష్వాలవంటి మహాబలవంతులతోడను సమానముగాఁ బోరాడి స్వాభిమానమునకయి ప్రసిద్ధివడసి యెనుబదియాఱు సంవత్సరములవఱకుఁ బ్రతికి క్రీ. శ. 1761 వ సంవత్సరమునందు మృతిఁజెందెను.