పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

అబలాసచ్చరిత్ర రత్నమాల.

రుఁడగు శివాజీకొఱకు రెండవరాజ్యము స్థాపింపవలసిన దయ్యెను. ఆరాజ్యము నేటివఱకును నడుచుచున్నది.

కోలాపురమున తారాబాయి శివాజీకి రాజ్యముకట్టి రామచంద్రపంతు సంక్రాజీ నారాయణులను మంత్రులు తన పక్షము నవలంబించి తనకు సహాయులయియుండ రాజ్యము నేలసాగెను. కోలాపురమునకు సమీపమునందుండిన రాయగడ కిల్లా మహారాష్ట్రరాజ్యమునకు మూలస్థానమైనందున దానిని గెలువవలయునని శాహు ప్రయత్నింపు చుండెను. ఈ సమయమునం దనఁగా క్రీ. శ. 1712 వ సంవత్సరమునందు మశూచికా జాడ్యమువలన తారాబాయి కొమారుఁ డగు శివాజీ మృతుఁడయ్యెను. ఈ దు:ఖములో నామె యుండఁగా తారాబాయిని రాజ్యమునుండి తీసి యామె సవతి కొమారుఁడగు సంభాజీకి రాజ్యము నిచ్చి రామచంద్రపంతు తానే రాజ్యము నడుపుచుండెను. ఆసమయమున తారాబాయి గర్భిణితో నుండిన తనకోడలిని శత్రుభయముచేత నజ్ఞాతవాసములో నుంచెను. అక్కడనే యామె ప్రసవమై మగశిశువును గనెను. ఆశిశువుగూడ నజ్ఞాతవాసములోనే బెరుగుచుండెను.

క్రీ. శ. 1740 వ సంవత్సరప్రాంతమున శాహు విది కరిగెను. అతనికిఁ బుత్రసంతానము లేనందున నజ్ఞాతవాసములో నుండిన తారాబాయి మనుమఁడగు రామరాజును సాతారాకు రాజునుజేసి తారాబాయి యతని పేరిట తాను రాజ్యము నేలసాగెను. కాని యారాజ్యమునకు వంశపరంపరాగత మంత్రియగు బాలాజీ బాజీరావ్ పేష్వా ప్రబలుఁ