పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణీసంయుక్త.

5

ప్రవేశించెను. తానెన్నఁడును సంగ్రామముఁ జూడనిదైనను ఆమె జంకక సమయసూచకత గలదియై తానును యుద్ధముచేసి తనభర్తప్రాణములఁ గాపాడెను.

సంయుక్తవచ్చినపిదప పృధివీరాజుబలములు మరల చేరుకొని జయచంద్రునిసేనల నోడించెను. తదనంతరము పృధివీరాజు భార్యాసహితుఁడయి ఢిల్లీనగరమున కరిగెను. ఈదంపతు లిరువురును గొంతకాలమువఱకు పరస్పరానురాగము కలవారయి ప్రజలను తమబిడ్డలవలెఁ బాలించుచుండిరి.

ఇచ్చట జయచంద్రుడు పృధివీరాజు తనసైన్యము నోడించి తనకూతుఁను గొనిపోవుటవలన సంతప్తహృదయుఁడయి పగ తీర్చుకొన సమయము వేచియుండెను. ఇట్లీ దేశపురాజులలో నన్యోన్య ద్వేషములుకలిగినసమయమున 'శాహబుద్దీన్ మహమ్మద్ గోరీ' యనుమహమ్మదీయుఁడు హిందూదేశముపై దండు వెడలెను. వాఁడిచ్చటికి వచ్చి దేశమంతను మిగుల నాశము చేయసాగెను. అనేక దేవాలయములఁ బడఁగొట్టియు జనులనన్యాయముగాఁ జంపియు స్త్రీలపాతివ్రత్యములఁ జెఱిచి వారిని తనదాసులను చేసికొనియు మహాక్రూరత్వమును జూపఁ దొడఁగెను. వానిపాదము సోఁకిన చోటెల్లను నాశ మొందుచుండెను. కాన నట్టివాని నోడించి పతివ్రతల పాతివ్రత్యమును, మఠమందిరములను గాపాడనెంచి పృధివీరాజు గోరీని శిక్షింపవెడలెను. అప్పుడు జయచంద్రుఁ డొకఁడు దక్క నితరరాజులంద ఱాతనికిఁ దోడుపడిరి. కోపమే ప్రధానముగాఁ గల జయచంద్రుఁడు దేశ క్షేమమును గోరి పృధివీరాజునకుఁ దోడుపడకున్నను దేశీయుల దురదృష్ట