పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

అబలాసచ్చరిత్ర రత్నమాల.

నాశ్చర్యమునుబొంది యామెను తనసన్నిధికిఁ దెప్పించెను. ఆమె ముఖావలోకనము చేసినతోడనే శివాజీకి మిగుల పశ్చాత్తాపము కలిగెను. అందువలన నతఁ డామె కనేక సమాధాన వచనములనుఁ జెప్పి తాను గొనిన కోటను మరల నిచ్చెదననియె. కానిసావిత్రీబాయి యామాటలను చెవిని బెట్టక 'నాకివన్నియు నక్కఱలేదు. వంశమునం దెవ్వరును లేని యపకీర్తిని నేను శౌర్యహీనతవలనఁ దెచ్చితిని. కాన నాఖడ్గమును, నాశత్రువును నాకొప్పగింపుఁడు ఇదియే నాకోరిక. ఇట్లుచేయని యెడలఁ దమ రిప్పుడేనాశిరస్సునుఛేదించి పుణ్యము కట్టుకొనుఁడు' ఇదియేగదానిజమయిన శౌర్యలక్షణము. శివాజీయామె యడిగినవాని నియ్యఁజాలక యామె నామెయింటి కంపెను కాని యావీర వనిత తనకుఁ గలిగిన యపజయమునకు సహింపక దిగులొంది రెండు మూడుమాసములకే పరలోకమున కరిగెను.