పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

అబలాసచ్చరిత్ర రత్నమాల.

కాదు. కాన నిందునుగుఱించి యామెను నిందించుటకు వీలులేదు. రాణిగారు తనయధికారమును సంపాదించుకొనుటకయి సైన్యములను పోగుచేసి నేపాళదేశము సరిహద్దు సమీపమునకు వచ్చెను. ప్రజలంద ఱీమె కేయనుకూలు రయినందున నప్పుడు రాజ్యము చేయుచుండిన రెండవరాణికి మిగుల చింతకలిగెను.

1802 వ సంవత్సరము నవంబరునెలలో మహారాణి త్రిపురసుందరి, పొలిమేరదాఁటి నేపాళదేశములోనికిఁ జొరఁబడెను. కాని త్రోవలోనే యామె సైన్యమును రెండవరాణి యొక్క సైన్యము కొల్లఁగొట్టెను. కాని యీపరాభవమువలన ధైర్యమువిడువక మహారాణి మరల సైన్యమును జతపఱుచుకొని 1803 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో నేపాళమునకు వచ్చెను. చిన్న రాణిగారి సైన్యములు వచ్చి యామెను నెదిరించెను; కాని యీమె సైన్యములచే నవి యోడింపఁబడి మహారాణి మహావైభవముతో ఖటమండూ యను నిజరాజధానిఁ బ్రవేశించెను. అచ్చటనున్న చిన్నరాణి బాలరాజును వెంటఁ దీసికొని పాఱిపోయెను. కాని మహారాణిగా రారాజపుత్రుని మరలఁ దెప్పించిరాజ్యముపైఁ గూర్చుండఁ బెట్టి తాను పాలన కర్త్రిగానుండెను. మహారాణిగారు న్యాయప్రవర్తన గలదియై నందున నోడిపోయిన చిన్నరాణి నేమి, యామె పక్షమువారి నేమి, యెంతమాత్రమును బాధపెట్టక వారి యపరాధముల నన్నిఁటిని క్షమించెను. ఆహా! ఈమె క్షమాగుణం బందఱికిని ననుకరణీయముగదా? రక్తపాతము లేక ప్రభుత్వములలో నిట్టిమార్పులు గలిగిన యుదాహరణ మిది యొక్కటియేయని చెప్పెదరు. ఈమెయచ్చటనున్న యింగ్లీషువారి రాయబారితో