పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీ త్రిపురసుందరి.

ఈమె నేపాలాధీశ్వరుఁడగు రాణాబహుదురుని పెద్దభార్య. ఈరాజు 1795 వ సంవత్సరమున సింహాసనారూఢుఁ డయ్యెను. ఈయనకు నిద్దఱుభార్య లుండిరి. వారిలోఁ బెద్దదియు, మహారాణి బిరుదుఁ జెందినదియునైన త్రిపురసుందరి గుల్మీరాజుబిడ్డ. ఈమె యత్యంత సద్గుణవతియు, నమితయౌదార్యవతియునై యుండెనని చరిత్రకారులు వ్రాసియున్నారు. కాని యీమెకు సంతానము లేనందువలన రా జీమెను నొల్లకయుండెను. అయినను నాసాధ్వి పతిభక్తిపరాయణయై యుండెను.

1800 వ సంవత్సరమునందు రాజుకు మతిభ్రమ కలిగి రాజ్యమంతయు రెండవ భార్యకుమారున కిచ్చి, రెండవభార్యను నాచిన్న వానికి, బాలనకర్త్రిగా నేర్పఱచి కాశీవాసముఁ జేయఁబోయెను. పతివ్రతాతిలకమగు త్రిపురసుందరియుఁ బతివెంట నతనిసేవకయి కాశికిఁబోయెను. కాని యారా జీమెను మిగుల బాధపెట్టి, యిల్లు వెడలఁగొట్టి మరల పాళమునకుఁ దిరిగి పోవలసినదానినిగాఁ జేసెను.

ఇటు నేపాళమునకు వచ్చునప్పుడు ఆమెకుఁ దనకు హక్కుగల బాలరాజుయొక్క పాలన కర్తృత్వము వహించవలయుననిన యిచ్ఛ కలిగెను. బాలరాజుకుఁ బాలనకర్త్రిగా నుండవలసిన హక్కు పట్టపురాణి (రాజుయొక్క పెద్దభార్య)ది కాని యితరులదికాదు. కాన తనకా యధికారము రావలయునని త్రిపురసుందరియిచ్ఛ న్యాయమయినదియేకాని యన్యాయమయినది