పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విమలదేవి.

(అచ్చ తెనుఁగు)

ఈమె మార్వాడలోని రూపనగరమునకు ఱేఁడుగా నుండిన అమరసింగుని కూఁతురు. అప్పుడు డిల్లీలో నుండిన రారాజుపేరు ఔరంగజేబు. రజపూతదొరలు కొందఱు ఔరంగజేబునకు జడిసి తమబిడ్డల నతనికిచ్చి యతని కనికరమునకుఁ దగినవారయిరి. విమలదేవి తండ్రియుఁ దనబెద్దకూఁతు నౌరంగజేబునకిచ్చి పెండ్లిచేసెను. రాచకన్నియల నిట్లు తురకల కిచ్చుటకు విమలదేవి యిచ్చ మెచ్చక, తనయుసురులువోయినను తురకను పెండ్లాడననియుఁ దల్లిదండ్రులు తనకు మంచి రాచకొమరునివెదకి కూర్చనియెడలఁ దనపాయమంతయుఁ గన్నియగనే గడపెద ననియుఁ దలఁచెను. ఇట్లుండ నౌరంగజేబున కిల్లాలగు కేసరిబాయను విమలయొక్క యక్క పుట్టునింటికి వచ్చెను. అప్పుడు విమలదేవి తల్లియగు కౌమారదేవి మొదలయినవా రంద ఱామె రారాజునకునింతి యగుటవలన నామెను మిగుల గారవించిరి. కాని విమలదేవిమాత్ర మామె మొగమునుజూడక యేకతమున నుండి ముక్కంటిని గొలుచుచుండెను. అప్పుడచటికి కేసరిబాయి చెలియలినిఁ జూడవచ్చి యామె గొలుచు బూచుల దొరను దూఱసాగెను. అప్పుడు విమలదేవి మిగుల కోపగించి తోఁబుట్టువునుజూచి "యచ్చపు రాచకులంబునఁ బుట్టి మిగుల పనికిమాలిన కులమువానిఁ జేప