పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీఝాశీ లక్ష్మీబాయి

127

ఇ ట్లొకశత్రునిఁ బరిమార్చునంతలో రెండవశత్రుఁ డుత్పన్నమాయెను. ఝాఁశీకి సమీపమునందున్న ఓరచాసంస్థానపు దివాను, నధేఖా యనువాఁడు విశేషసైన్యముతోడ దాడివెడలి రాణిగారి కిట్లు వర్తమాన మంపెను. "మీకిదివఱకాంగ్లేయ ప్రభువు లిచ్చుజీతము మే మిచ్చెదముగాన రాజ్యమును మా స్వాధీనము చేయుఁడు" ఈవార్త విని రాణిగారి ప్రధాన సామంతు లందఱును భయభీతులయి మనకు ఫించెను నిచ్చిన యెడల సంగ్రామముతోఁ బనిలేదనియు వారితో యుద్ధము చేసి గెలుచుట సాధ్యము కాదనియుఁ జెప్పిరి. కాని యసామాన్యశౌర్యముగల రాణిగారు వారిమాటలను వినక యాశత్రువున కిట్లు వర్తమానమంపెను. "ఆంగ్లేయులు సార్వభౌములు. వారు నిగ్రహానుగ్రహములకు సమర్థులు. వారితో సమానులు కానెంచి యాజీత మిచ్చెదననెదవు. కాన నీవంటి వారింక పదుగురు వచ్చినను స్త్రీనగు నేను వారినందఱిని పౌరుషహీనులఁ జేయఁజాలుదు ననఁగా నిన్ను లెక్కింపనేల" ఇట్టివార్త నధేఖాకుఁ దెలిసినవెంటనే పట్టరానిరోష ముప్పతిల్ల నతివేగముగా వాఁడు ఝాఁశీని సమీపించెను. లక్ష్మీబాయిగారును నట్లు వర్తమానమంపి సంగ్రామమునకు సిద్ధముగానుండెను. అపు డామె తాను పురుషవేషముతో సేనాపతిత్వము వహించి ఘోరయుద్ధముచేసి నధేఖాను నోడించి వానియొద్దనుండి లక్షలకొలఁది ధనఁముగొని వానితో సంధి చేసెను.

మహారాణి లక్ష్మీబాయిగారి పరిపాలన మల్పకాలమె యైనను ప్రజలకు మిగుల సుఖకరముగా నుండెనఁట. కాన