పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టరు ఆనందీబాయి జోశి

109

డొప్పుకొనునట్టివారు కారని నిశ్చయముగా నేనుజెప్పఁగలను. మాపూర్వపురాజులలోనుగూడశిబి, మయూరధ్వజుఁడు మొదలగువారు పరోపకారార్థమయి ప్రాణత్యాగము చేయ వెఱవరయిరి. మనకు విఘ్నమే కలుగునో, యాపదలె సంభవించునొయని చేయవలసిన ధర్మమును జేయకపోవుట న్యాయము కాదు. మనము చేయవలసినంత ప్రయత్నము చేసి తీరవలయును. మనకటు పిమ్మట జయమయినను సరె, యపజయమయినను సరె. మనుజులను మూడుతరగతుల వారినిగా విభజించెను. అందు అధములుఁ విఘ్నములు గలుగు ననెడి భయమువలన నేపనినిగాని పూనుకొననివారు. మధ్యములు తామారంభించినపనికి నడుమ నంతరాయము సంభవించినతోడనే యాపనిని విసర్జించువారు. ఉత్తములు ప్రారంభించినదాని కెన్ని యడ్డములు వచ్చినను వాని నెల్లఁ బూనికతో నిదానించి విజయము గాంచువారు.

కష్టము లెంత యుత్కృష్టములుగా నుండునొ మనకు ధైర్యస్థైర్యము లంత యధికముగా నుండును. కాఁబట్టి మన మారంభించినదాని నెన్నఁడును మానఁజనదు. ఇఁక నావిన్నపము ముగిసింది. ఇంతసేపు ప్రసంగించుటవలన మిమ్ము విసికించితి నేమోయని భయపడుచున్నదానను. అందులకు నన్నుమీరు క్షమింతురు గావుత."

ఈ యుపన్యాస మిచ్చినపిదప ఆనందీబాయి యొక క్రైస్తవగురువుల కుటుంబముతో అమేరికా కరుగ నిశ్చయించెను. ఒకానొక హిందూబ్రాహ్మణస్త్రీ అమేరికా కరుగునని