పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టరు ఆనందీబాయి జోశి

95

గోపాలరావుగా రచటికి మార్చుకొనిరి. కోలాపురములో బాలికాపాఠశాల వీరింటికి దూరమగుటచే ఆనందీబాయిని నొక్క ర్తనంతదూరము కాలినడకతోఁ బంప వీలులేక యుండెను. పాఠశాలలో నుపాధ్యాయినిగా నుండిన మిస్ మాయసీ గారి యిల్లు వీరియింటికి సమీపమునందుండెను. ఆమె బహు మంచిదని విని గోపాలరావుగా రామెతోడ మాటాడ నరిగెను. ఆయన ప్రసంగవశమున "నాభార్యను మీబండిలోఁ గూర్చుండఁ బెట్టుకొని వెళ్లెదరా" యని యడుగఁగా నామె కొంత యోచించి మంచిదనియెను, అందుపై ఆనందీబాయి కొన్నిదినము లచటి పాఠశాల కరుగుచుండెను. కాని యటు పిమ్మట మాయసీ తనబండిలో స్థల మియ్యనందున నామె పాఠశాల కరుగుట మానుకొనవలసిన దాయెను.

కోలాపురమున నీదంపతులు పాద్రీల (క్రైస్తవధర్మగురువుల) యిండ్ల కరుగుచుండిరి. పాద్రీయాఁడువారు ఆనందీబాయికి నింగ్లీషు రెండు మూడుపుస్తకములవఱకును నేర్పిరి. ఆనందీబాయి యల్పవయస్కు రాలయినను వారు చేయుమతబోధనుగ్రహింపక కేవల నీతివాక్యములనే గ్రహింపుచుండెను. వీరి వలననే యీదంపతుల కమేరికాలోని సంగతులనేకములు తెలిసెను. కాన నమేరికాలోని కరిగి విద్యనభ్యసింపవలయునని ఆనందీబాయి కప్పటినుండి యిచ్చగలిగెను.

1879 వ సంవత్సరప్రారంభమున గోపాలరావుగారిని బొంబాయికి మార్చిరి. అచట నుండుకాలములో ఆనందీబాయి కొంతవఱ కింగ్లీషును సంస్కృతమును నేర్చుకొనెను. కాని యచటను లోకు లామె విద్యాభ్యాసమున కనేక విఘ్నములు