పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

అబలాసచ్చరిత్ర రత్నమాల.

అటుపిమ్మట గోపాలరా వామెకు విద్యవలని లాభముల నెఱిఁగింపఁగా నామెమిగుల శ్రద్ధతో ప్రతిదినముతప్పక పాఠములు చదువుచుండెను. ఆమె చుఱుకుఁదనమును జూచినకొలఁదిని గోపాలరావునకు మఱింత యుత్సాహము కలిగియాతఁ డామె తో ననేకసంగతులను ముచ్చటింపుచుండెను. అందువలననే ఆనందీబాయికి త్వరగా విద్యాసక్తిగలిగెను. పెండ్లియైనపిదప రెండుసంవత్సరములలో ఆనందీబాయికి మహారాష్ట్రభాష చక్కఁగాఁ జదువుటకును, వ్రాయుటకును వచ్చెను. అంతలో నామెకాభాషయందలి వ్యాకరణము, భూగోళము ప్రకృతిశాస్త్రము, గణితశాస్త్రము మొదలయినవి గోపాలరావుగారు చక్కఁగా నేర్పిరి. అల్లీ బాగునందుండుకాలమున ఆనందీబాయి ఋతుమతియైనందున భార్యా భర్తల నొకటి చేసిరి. వెంటనే ఆనందీబాయి గర్భవతియైనందున నామె కళ్యాణమునకుఁ బోయెను. అచట నామెకు కొమారుడు కలిగి పదియవదిన సంబుననే చనిపోయెను. కాన ఆనందీబాయికిఁ జిన్నతనముననె పుత్రదు:ఖము కలిగెను. అందువలనఁ గొన్ని దినములవఱకును ఆమె విద్యాభ్యాసమునకు భంగము గలిగెను. కాని యటుపిమ్మట మరల నామె చదువు చక్కఁగా సాగుచుండెను. కొన్నిదినములలో నామెకుఁ దన మనోగతము బాగుగావ్రాసి తెలుపునంతటి ప్రజ్ఞ గలిగెను. అల్లీబాగులోని లోకు లానందీబాయికి వచ్చిన విద్యనుగని యోర్వలేక గోపాలరావు ననేకకష్టముల పెట్టుచుండిరి ! కాన నచటనుండుట కిష్టములేక, కోలాపురమునందు స్త్రీవిద్య కనుకూలురగువా రున్నందున బహుప్రయత్నముతో