పుట:2015.328620.Musalamma-Maranam.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటికూర్పునకు

ముఖపత్త్రము

చెన్నపురి క్రైస్తవకళాశాలకుం జేరిన శ్రీమదాంధ్రభాషాభిరంజనీ సమాజమునఁ దత్పోషకులగు రాజశ్రీ, సమర్థి రంగయ్యసెట్టిగారిచే నూతనముగ స్థాపింపఁబడిన బహుమానకావ్య పద్ధతి ననుసరించి ఈ కావ్యము రచియించితిని. ఇయ్యది పారితోషికమునకుఁ దగినదని యామోదించినందులకు వారి కనేక వందనము లర్పించుచున్నాఁడను.

ఒకానొక త్రిలింగదేశీయునిచే వ్రాయఁబడి బ్రౌన్‌ దొరగారిచేఁ బ్రకటింపఁబడిన ‘అనంతపుర చరిత్రము’ అను గ్రంథమునుండి యిందలి కథం గైకొంటిని. అయినను గొన్నియెడల రసాధిక్యమునకై నూతనకల్పనలు చేసినాఁడ.

అనంతపురమునకు సమీపమున బుక్కరాయ సముద్రము నేఁటికి ఉన్నది. ఆ యూరి చెఱువుకట్టకు “ముసలమ్మకట్ట” యనియే పేరు. అచ్చట నేఁటేఁట జనులందఱుఁ బొంగళ్ళుపెట్టుచు ముసలమ్మను గ్రామదేవతగాఁ గొలుచుచున్నారు. ఆ పల్లెలో నీ విషయమైన శిలాశాసనమున్నదఁట. ఈ గ్రంథము రచియించుటకు బూర్వమే నాకీ సంగతులు తెలిసియుండిన నే నచ్చటికి బోయి సర్వమును జూచి తత్‌ ప్రదేశస్వభావవర్ణన మిక్కుటముగఁ జేసియుందును. అనంతపురములోఁ గొన్ని సంవత్సరములు నివసించిన నా మిత్రులగు నారాయణస్వామి నాయనిగారి యింట నే నీపుస్తకమును జదివినప్పుడు వారే తద్‌గ్రామ సంబంధ విషయములం జెప్ప నా కపరిమితాశ్చర్యమైనది.

ఈ చిన్నిపొత్తము ముఖ్యముగా స్త్రీలకొఱకుఁ జేయబడినది. వారి కుపయుక్తముగా నొప్పినయెడల నా ప్రయాస సఫలతనొందినట్టే.

ఈ కార్యమును నేఁ జదువగా విని కొన్ని తప్పుల సవరించినందులకు బ్రహ్మశ్రీ, కొక్కొండ వెంకటరత్నము పంతులుగారికిని, ముద్రాపణకార్యమును