పుట:2015.328620.Musalamma-Maranam.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

ముసలమ్మ మరణము

మనములఁ బొంగిన దుఃఖము
కనుల వెడలె ననఁగ నశ్రుకణము లొలుకఁగాన్‌. 32

క. మన మొండు తలఁప దైవం
బున కామోదంబు లేక పోయెనుగద! బా
విని ద్రవ్వఁ బోవ లేచెం
బెను భూతం బనెడు మాట విశదం బయ్యెన్‌. 33

క. సుదతీమణి, కడుమెత్తని
హృదయంబును గలది, పసిది, యేమియెఱుఁగ, దా
పదలం బడ దెన్నండును,
హృదయేశుని విడిచిపోవ నెట్లోపునొకో. 34

వ. అనుచు వగచు జనంబులతోఁ గొందఱు గద్గద కంఠంబున నిట్లనిరి. 35

క. హృదయముల వగలు నెగయఁగ
నిది యేమిటి? వెఱ్ఱికూఁత లేలాకూయన్‌?
మది నుబ్బి నీరి కుఱకక
పదివేల విధాలఁజెప్ప బాల నిలుచునే! 36

చ. గుడిసెల మూఁటిఁ బీఁకికొని కొండొక చోటికిఁబోదమన్న “నీ
యెడ విడనాడమీకుఁదగునే” యని పల్కదెయాపె? యయ్యయో
చెడెఁజెడెఁ గార్య; మూరఁగలచెల్వము మాసెను; ముల్లుదీసి కొ
ఱ్ఱడిచెను గాదె దేవి? యిఁక నయ్యెడు శోకము చెప్పఁదీరునే! 37

సీ. లేఁగ మై నాకుచు లీలమై మెడ మలం
                  చిన గోవుఁబిండెడు వనరుహాక్షి
బొండుమల్లెలతోఁటఁ బువ్వులు గోయుచు
                  వనలక్ష్మి యననొప్పు వనజగంధి