పుట:2015.328620.Musalamma-Maranam.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముసలమ్మ మరణము

క. శ్రీలాలిత వసుధా నా
రీ లలిత లలాట తిలక రీతిని ధన ధా
న్యాలిఁ బొలుచు నొక పల్లియ
చాలంగా బుక్కరాయసంద్రం బనఁగన్‌. 17

సీ. చెఱకుఁ దోఁటలఁ జొచ్చి కొఱికి పాడొనరించి
                 దొరలట్లఁ బోవు పందుల గణంబు,
నెండ్రకాయల కొఱ కేతెంచి గుంటిపై
                 మెక్కి కూసెడు గుంట నక్క గములు,
బడుగు బక్కలు గాక కడుపారఁ దిని పంది
                గున్నలతో రాయు గొఱియ పిండుఁ,
బొలముల లేఁ బచ్చికల మేసి చియ్యచే
               నిగనిగ లాడు గో నికరములునుఁ,

తే. గలకలారావములు మీఱఁ గలిసి జొన్న
చేలపైవ్రాలు గువ్వల చెలువుఁ, గలిగి
పైరు పచ్చల నొప్పు నా పల్లె, చెఱువు
నిండి నీరంబు లొసఁగుచు నుండ నెపుడు. 18

వ. ఆ యూరి చేరువ 19

మ. చలదుత్తుంగ మహోగ్రభంగపటలీ సంఘట్టనారావ, ము
జ్జ్వల కూలాగ్రనటత్తరంగవ, మంచన్మధ్యభాగ్భూమి భృ
త్కులసంపాతి మహోర్మికానికర నిర్ఘోషంబునుం, గూడఁగా
నలరున్‌ ఘోరసరస్సు దిగ్విదళన వ్యాపార పారీణమై 20