హరి నీవె సర్వాత్మకుడవు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
హరి నీవే (రాగం: దర్బారీకానడ) (తాళం : ఆది)

హరి నీవె సర్వాత్మకుడవు
యిరవగు భావననీయగదె

చూడకమానవు చూచేటి కన్నులు
ఏడనీవైన యితరములు
నీడలనింతా నీరూపములని
ఈడువడని తెలివీయగదె

పారక మానదు పాపపు మనసిది
ఈరసములతో నెందైనా
నీరజాక్షయిది నీమయమేయని
ఈరీతుల తలపీయగదె

కలుగక మానవు కాయపు సుఖములు
ఇలలోపల గలవెన్నైనా
అలరిన శ్రీవేంకటాధిప నీకే
యిలనర్పితమను ఇహమీయగదె


hari neeve (Raagam: ) (Taalam: )

hari neeve sarvaatmakuDavu
yiravagu bhaavananeeyagade

chooDakamaanavu choochaeTi kannulu
aeDanaevainayitaramulu
neeDalaniMtaaneeroopamulani
eeDuvadani teliveeyagade

paaraka maanadu paapapu manasidi
eerasamulatO eMtainaa
neerajaakshayidi neemayamaeyani
eereetulatalapeeyagade

kalugaka maanavu kaayapu sukhamulu
ilalOpala galavennainaa
alarini SreevaeMkaTadhipa neekae
yilanarpitamanu ihameeyagade

బయటి లింకులు[మార్చు]

HariNeeveSarwatmakudavu

Hari-Neeve---BKP


అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |