సూచిక చర్చ:DivyaDesaPrakasika.djvu

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

తమిళ అక్షరాలు?[మార్చు]

YesY సహాయం అందించబడింది

user:శ్రీరామమూర్తి గారికి, పుట:DivyaDesaPrakasika.djvu/159 మరియు అలా కొన్ని చోట్ల తమిళ అక్షరాలు ఎందుకువున్నాయి. అవి అచ్చుదోషాలా?. ఆ అక్షరములను తెలుగు లిపిలో రాయవచ్చా?అటువంటి జాబితా చేస్తే యంత్రం ద్వారా మార్చి, తెలుగు చదువరులకు అనుకూలంగా చేయొచ్చు. --అర్జున (చర్చ) 05:13, 26 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

108 ఆళ్వారులు తమిళదేశంలో సుప్రసిద్ధులు. వీరిని గురించిన పుస్తకం ప్రమాణికమైనది. నాదగ్గర హార్డ్ కాపీవున్నది. అదే DLI లో దొరకడంతో భక్తి సాహిత్యం గనుక అంత కాపీహక్కుల సమస్యలు తలెత్తవని భావించి తెలుగు వికిసొర్స్ లో చేర్చాను. కానీ ఈ దివ్యదేశాలను గురించిన పాశురాలలో కొన్ని అక్షరాలను రచయితే తమిళంలోనే కనిపిస్తున్నాయి. నాకు తమిళం రాదు కాబట్టి సుజాత మరియు రామమూర్తి గార్ల సహాయం కోరాను. ఆ తమిళ అక్షరాల్ని తెలుగులో ఎలా వ్రాయాలో కూడా సమస్యగానే అనిపించింది. రచయిత కూడా అదే కారణంగానే తమిళ అక్షరాల్ని వదలివేసివుండవచ్చును. కాబట్టి నా అవగాహన ప్రకారం ముద్రించబడిన పుస్తకంలో తమిళ అక్షరాల్ని మన వికీ పుస్తకంలో కూడా తమిళ అక్షరాలుగానే వుంచితే సరిపోతుంది.--Rajasekhar1961 (చర్చ) 12:04, 26 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
తిరువాయిమొళి అని నా అవగాహన. పలు తెలుగు పుస్తకాల్లో కూడా ఈ అక్షరాన్ని తమిళంలోనే ఉంచేసెయ్యడం పలుచోట్ల చదివాను. ఈ అలావాటు ప్రాచుర్యంలో ఉన్నదే. మూలపాఠ్యంలో మార్పు చేయడకుండా, వీలైతే నోట్ చేర్చవచ్చేమో చూడండి.(సంపాదకత్వ సంప్రదాయం నోట్ చేర్చేందుకు అనుమతిస్తుంది కానీ పాఠ్యాన్ని సవరించడం సాహసమే). --పవన్ సంతోష్ (చర్చ) 04:30, 3 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్ల వికీలో కనిమొళి వ్యాసం పేరు చూడండి. zhi అని ఆంగ్లంలో రాస్తారు కానీ మన తెలుగు ళ కారానికి కొద్ది దగ్గరగా ఉంటుంది. ఐనా పూర్తగా మన ళకారం కాదు. నిజానికి తెలుగులో కానీ, ఆంగ్లంలో కానీ ఆ శబ్దానికి సరైన లిపి చిహ్నం లేదనేది నేను చదివిన విషయం. కనుకనే ఈ లిపి సమస్యలు. --పవన్ సంతోష్ (చర్చ) 04:36, 3 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, మీ స్పందనకు ధన్యవాదాలు. నోట్ చేర్చడం మంచిదే.అయితే తమిళభాషపై పట్టుగలవారు స్పందించినతరువాత అలా చేయడం బాగుంటుంది.--అర్జున (చర్చ) 06:31, 6 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]