సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/మామిడిపండు
మామిడిపండు
“మామిడి పండును గురించి కూడ చెప్పవలసినది వినవలసినది ఏమైన కలదా?” అని పలువురనుకొనవచ్చును. అవును, దానిని గురించి చాలా తెలుసుకొను విషయములు కలవు. దాని పుట్టుపూర్వోత్తరములు, దాని చరిత్ర, దాని జాతి విభేదాలు, దాని వ్యాప్తి, మున్నగు విషయములు తెలుసుకొన దగినవై యున్నవి.
మొట్టమొదట గమనింపదగిన దేమన - మామిడిపండు ఫలజాతిలో చక్రవర్తియన్న విషయము. అంత తీపి, అంత సౌలభ్యము మరే పండుకును కానరావు.
సంస్కృతములో మామిడిపండుకు చాలా పేర్లున్నవి. అమరసింహుడిచ్చిన పేరులేవనగా - ఆమ్రము, చూతము, రసాలము, సహకారము. ఈ నాలుగే సంస్కృతమున నుండు పేరులు. హిందీ, ఉర్దూ భాషలలో అబ్రశబ్ద తద్భవమగు ఆమ్ అను పదమొక్కటే ప్రచారమందున్నది. దక్షిణదేశ ముఖ్యభాషలగు తమిళ కర్ణాటాంధ్ర భాషలలో మాంగాయి యనియు, మావికాయ మాగాయ యనియు మామిడి యనియు పిలువబడును. ఫ్రెంచి, పోర్చుగీసు, ఇంగ్లీషువారు దక్షిణములోని రేవులలో నిల్చిపోయినప్పుడు మన మాగాయనే తమ భాషలోనికి తీసికొనిరి. పోర్చుగీసువారు మాంగే అనిరి. ఇంగ్లీషు వారు మాంగో అనిరి. కారణమేమనగా మామిడి యూరపు దేశాలలో నెందును పెరుగదు. అదే విధంగా ఈరాన్, అరేబియా, ఈజిప్టు దేశాలలోను ఈ పండు లేదు. అందుచేత వారును ఈ పండుకు కొత్త పేర్లు పెట్టిరి. అరబ్బులు అంబజ్ అనిరి. అది ఆమ్రశబ్దపు అపభ్రంశమే. ఈజిప్టువారు దానిని మంజా అనిరి. అది మాంగాయ నుండి యేర్పడినది.
ఒక్కొక్క దేశములో ఒక్కొక్క పండు ఆదిలో ప్రఖ్యాతి వహించి యుండెను. ఒక దేశమువారు మరొక దేశమునకు వ్యాపారార్థము వెళ్ళినప్పుడు విశిష్ట ఫలములను ఇవికాక మరికొన్ని పేరులు గమనింపదగినవి. లంగడా, మాల్దా, సరౌలీ, సఫిదా, కీషభోగ్, ఫిజ్రీ, ఖజ్రీ, బేనిషాన్, మల్లోబ, తోతాపరి, నీలం, అనునవి కొన్ని అందు హైదరాబదులో బేనిషాన్, మల్గోబా, తోతాపరీ, నీలం, ఎక్కువగా నున్నవి. అందు మొదటి రెండు శ్రేష్ఠమైనవి. తోతాపరీ చిలుక ముక్కువలె నుండుటచేత ఆ పేరు వచ్చినది. దీనిలోను, నీలంలోను పండు పక్వముకాగా పండు నుండి పురుగు వెలువడును. మామిడి పండ్ల కాలము ముగిసిన తర్వాత వర్షకాలములో తోతాపరీ, నీలం అమ్మకమగును. బొంబాయివారు ఆల్ఫన్ శ్రేష్ఠమైన దందురు.
ఒక రకపు మామిడి సంవత్సరమునకు రెండు మారులు కాయును. దానిని బారామసీ యందురు. దాని విశిష్టత రెండు మారులు కాయుటలోనే కాని తీపిలో లేదు.
హిందూస్థానములో బొంబాయి, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశము, కర్ణాటకము, ఆంధ్రము మైసూరు ప్రాంతాలలో మామిడిపండ్లు సమృద్ధిగా లభించును. బీదరు జిల్లాలోని కోహీరు చాలా ప్రసిద్ధికన్నది. అదే మామిడికి మొదట పుట్టినిల్లు అని ఒకరన్నారు. బహుకాలమునుండి రాయచూరు జిల్లాలోని ఆలంపూరు, కర్నూలు జిల్లాలోని బనగనపల్లి మామిడిపండ్లకు బహు ప్రసిద్ధికన్న స్థలములు.
హైదరాబాదు ముషీరాబాదీ అనునవియు ప్రసిద్ధి కల్గినవి. అల్ఫన్ ఫఖ్రుస్సమర్ అన్నవి కూడా వ్యాప్తికన్నవి. హైదరాబాదులో ఇద్దరు నవాబులు 70 ఏండ్ల క్రిందట వారి మామిడి తోటలలోనే మునిగి తేలి వాటిలో శోధనలు చేసి వృద్ధికి తెచ్చిరి. వారిద్దరు ముసల్మానులు. ఒకరు నవాబ్ ముఖర్రబ్‌జంగ్ అనువారు. రెండవవారు ఆజమలీఖాన్ అనువారు. మొదటివారి తోటలలో సర్దార్ బాగ్, ఖుదాదాద్‌బాగ్ అను హైదరాబాదు నగరములోని తోటలు ప్రసిద్ధికన్నవి. అజమలీ కనిపెట్టినదేమో ఆజమస్సమర్ అన్నది. ఆ చెట్టు ఖుదాదాద్‌బాగ్‌లో సమృద్ధి. కాని ఆ పండ్లను నవాబెవ్వరికి ఇయ్యక కాపు పట్టగానే చెట్లపై అరబ్బుల పహిరా నెక్కించెడివాడు. ఆ పండ్ల రుచి అట్టిది.
ఆజమలీ తోటపండ్లను విక్టోరియారాణికి, ఏడవ ఎడ్వర్డు రాజుకు, ఆప్గనిస్థాన్ అమీరగు అబ్దుల్ రహమానుకు పంపుచుండిరి. అంతేకాదు. అజమల గొప్ప ఆమ్రఫలదాత. తను మెచ్చిన ఒక స్నేహితుని కొకనాడు 18 గంపలలో పండ్లను పంపెనట. మరియు మసక అను హిందూ వైద్యులు బగ్దాదులో మామిడి పండును గురించి దాని లాభములను గురించి ప్రచారము చేసిరి.
ఇండియాలో ముసల్మానులు స్థిరపడిన తర్వాత వారి కన్నిటికంటె మామిడి పండు మజా దొరికెను. వారు దానిని ప్రేమించిన వారైరి. వారు వాటి అంట్లలో పరిశ్రమ పరిశోధనలు చేసి మేలైన రకముల నుత్పత్తి చేసిరి. విరివిగా తోటలను పెంచిరి. మహమ్మద్ బీన్ తుగ్లఖ్‌ను చరిత్రకారులు పిచ్చి రాజనిరి. అతనికి పట్టిన పిచ్చులలో మామిడి పిచ్చికూడా యొకటి. అమీర్ ఖుస్రూ అను సుప్రసిద్ధ విద్వాంసుడు మామిడిపండ్లు పండ్లలోనెల్ల శ్రేష్ఠమైనవని వ్రాసెను. బాబరు చక్రవర్తికి మనదేశం సరిపోలేదు. తన డైరీలో ఇట్లు వ్రాసి యుండెను. “ఈ దేశము అసహ్యమైనది. ఈ దేశం మనుష్యు లసహ్యమైనవారు. వారి మొగాలు మరీ అసహ్యమైనవి.” అంతా అసహ్యం అసహ్యం అని తిరస్కరించిన బాబరు మామిడిపండు పేరు చెప్పితే నోరు చప్పరించేవాడు. అక్బరు చక్రవర్తి చాలా ఆమ్ర వనములు వేయించెను. అందు దర్భంగా తోటలో ఒక లక్షకు మించిన మామిడి వనములను పెంచెను.
పోర్చుగీసువారు, ఫ్రెంచివారు కూడా మామిడి అంట్లలో పరిశ్రమ చేసి కొత్త రకముల పండ్ల నుత్పత్తి చేసిరి. ఇప్పుడు గోవాలో పెయరీ అను మామిడి వారి అంట్ల నుండి ఏర్పడినవే. ఫ్రెంచివారి యంట్లనుండి అల్ఫన్సో ఏర్పడెను. తమ రాజుపేరు వాటికిచ్చిరని యందురు. దానిని జన సామాన్యము అల్ఫన్ అందురు. అవి బొంబాయిలో అందును ముఖ్యముగా రత్నగిరి జిల్లాలోను విశేష వ్యాప్తి కలవి.
మామిడి పండ్లలో 500 రకముల పండ్లున్నవి. అందు 122 రకములు హైద్రాబాదు రాజ్యములో లభించును. మంచి జాతి పండ్లకు పేరులు కలవు. ఆ పేరులను బట్టి కూడా కొంత వాటి చరిత్ర తెలుసుకొనగలుగుచున్నాము. “సూరెబెహిప్త్” అని ఫార్సీ వారనిరి. అనగా స్వర్గములోని ఫలమని యర్థము. మనవారు అమరుల ఫలమన్న దానికిని దీనికిని దగ్గరి పోలిక కానవస్తున్నది. తైమూరీ అను ఫలము తైమూర్ లంగ్‌కు పసందైనదిగా కానవస్తున్నది. జహంగీరు అనుననది జహంగీరు చక్రవర్తి ఎక్కువగా పసందు చేసినాడని సూచించును. రాయలసీమ “రెడ్డి పసంద్” అన్నది కలదు. మరియు “నవాబ్ పసంద్” అనునదియు కలదు. బనగాన్ పల్లె నవాబో, హైద్రాబాదు నవాబో, ఏ నవాబు దానిని పసందు చేసెనో యేమో? దిల్ పసంద్ అన్నది ప్రతివాని మనసుకు మెచ్చువచ్చినదన్నమాట. లభిస్తున్నవి. మామిడిపండ్లలో ఏ,బి అను విటమినులున్న వనియు అంచేత అవి చాలా బలకరమైనవనియు వైద్యుల యభిప్రాయము.
పూర్వమొకమారు పర్ష్యానుండి యొక సర్దారు హిందూస్థానమునకు వచ్చి మామిడిపండ్ల రుచిచూసి తనదేశము పోయెను. ఈరానీ పాదుషా ఏమి విశేషాలని యడుగగా మామిడి రుచిని వర్ణించెను. ఆ రుచి యెట్లుందనగా తేనె తెప్పించి ఒకని పెద్ద గడ్డమునకు పూసి దానిని నాకిన కొంత కొంత మామిడి రుచి యర్థమగునని తెలిపెనట.
ఈజిప్టులో మామిడిని అమ్మన్‌రా అనియు నందురు. రా యన ఆ దేశభాషలో రవి యని యర్థము. రా దేవునికి ఆసిరాస్ అను దేవాధిదేవునికి తగువు కలిగెనట. తుదకు వారికి సమాధానమును మరొక దేవత కుదిరించెనట. అప్పుడు దేవాధి దేవుని సంతోషపెట్టుటకు రా దేభుడు హిందూస్థానమునుండి మామిడిపండు కొనిపోయి సమర్పించుకొనెనట. అప్పటినుండి దానిని అమ్మన్‌రా అనిరి. యథార్థ మేమన సంస్కృత ఆమ్ర శబ్దమే ఈజిప్టు వారినోట నలిగి అమ్మన్‌రా అయ్యెను.
మామిడిపండును గురించి ఫలశాస్త్ర చర్చ, వృక్షశాస్త్ర చర్చ, వైద్య చర్చ ఇంకా చాలా కలదు. ఇప్పటికిది చాలును.
పై విషయాలను విన్న తర్వాత మన మామిడిపండు ఫలచక్రవర్తి అనుట కెవ్వరైన సందేహింతురా? సందేహించినవారు మామిడి పండు రుచి యెరుగరన్నమాట.
◇ ◇ ◇
పండ్లు అన్నియు సువాసన కలవి. ఆ వాసనలు భిన్న భిన్నముగా నుండును. సువాసన కలిగి సులభముగా లభించునవి కావున హిందువులు పండుగ దినాలలో శుభ కార్యాలలో మామిడాకులతో ఇండ్ల నలంకరించుకొందురు.
మామిడిలో రెండు ముఖ్యమగు జాతులు కలవు. ఒకటి పీచు కలిగి రసముకలది. రెండవది పీచులేక కండ కలిగినట్టిది. రసముపండ్లు కూడా కొన్ని చాలా రుచి కలవి.
మామిడిని అనేక విధములుగా ఆహారముగా నుపయోగింతురు. కాయలను ఊరగాయలుగా వాడుదురు. మరియు పప్పులో చారులో నుడికించి వాడుదురు. కూరలలో వేసి ఉడికింతురు. వరుగుచేసి అవి లభించని కాలములలో పై విధముగా వాడుకొందురు. పక్వమైన పీచులేని వాటిని మురబ్బా జెల్లీగా చేయుదురు. ఔషధముగా వాడుదురు. మామిడి చెక్క రసమును వంధ్యలకు త్రాపుదురు. శ్రీకరణి అనుపేర మామిడి పండు రసముతో కలిపి సిద్ధముచేయు దానిని శ్రీకరణి యందురు. రసాలు దధ్నం అని రత్నావళియను సంస్కృత నాటకములో వర్ణించినారు. మనదేశములో మామిడిపండ్లు ఎక్కువైనపుడు సగము వరకు మురిగిపోవును. బీదవారు వాటిని తిని రోగముల పాలగుదురు. ఎక్కువగా నుండిన ఫలములను మురబ్బాలుగా చేసిన దేశసంపద వృద్ధియగును. ప్రభుత్వము వారీవిధానము విరివిగా ప్రచారము చేయవలెను.
హైదరాబాదు రాజ్యములో 1948 లో 18 లక్షల మణుగుల మామిడి పండ్లు తినియుందురని ప్రభుత్వమువారు లెక్కవేసి యుండిరి. ప్రతి సంవత్సరము 50 వేల మణుగుల వరకు బయటినుండి దిగుమతి చేసుకొందురు. హైదరాబాదు రాజ్యములో 23910 ఎకరాలలో మామిడి తోటలున్నవి. అందు 17 లక్షలు విత్తనం చెట్లున్నాయి. 90000 అంటుమామిడి యనియు అంచనా వేసినారు. అన్ని జిల్లాలపైకి జెరంగాబాద్‌లో ఎక్కువ పండ్లును, నల్లగొండలో అన్నిటికన్న తక్కువ పండ్లును “హిందువుల దేశంలో ఉన్ని చెట్లు కాస్తవట ఆ చెట్లలో పెద్దపెద్ద పిందెలు పుట్టుతావట. ఆ పిందెలలో నుండి చిన్న చిన్న తెల్లని మేకపిల్లలు పుట్టి, పెరిగి ఊడి పడతావట. ఆ మేకల ఉన్నితో యీ నూలు బట్టలు నేస్తారట!!”
నూలు బట్టలు ప్రపంచములో కనిపెట్టింది మొట్టమొదటి వారు హిందువులని చెప్పితిని కదా! ఏ దుర్ముహూర్తాన వారిది కనిపెట్టినారోయేమో దాని మూలకంగా వారు బానిసలైపోయిరి. ఈ బట్టల వ్యాపారానికని విదేశాల నుండి అరబ్బులు, పోర్చుగీసువారు, పరాసులు, ఇంగ్లీషువారు, పారసీకులు ఎందరెందరో విదేశీయులీ దేశానికి వచ్చి, హిందువుల నానావిధాల బాధపెట్టి వారిని గులాములనుగా చేసుకొనిరి. పైగా పైగా యీ దేశములోనికి యేటేట విదేశాలనుండి 70-80 కోట్ల రూపాయల విలువకల బట్టలను విదేశాలవారు - ముఖ్యంగా ఇంగ్లీషువారు ఎగుమతి చేస్తూ దేశాన్ని దరిద్రంలో ముంచివేసినారు.
ఏనాడు నూలు బట్టల నాగరికత ప్రబలెనో ఆనాడే చాకలి జాతి ఒకటి యేర్చడెను. పూర్వకాలంలో అందరు బత్తలుగా తిరిగేవారు. ఆ దివ్యకాలంలో చాకలివాని పుట్టుపూర్వోత్తరాలే లేకుండ వుండెను. చాకలి జాతి ఏర్పడిన తర్వాత వారివల్ల ప్రపంచానికి చాలా నష్టం కలిగింది.
చాకలి జాతి చరిత్ర వ్రాయాలంటే అదొక పెద్ద గ్రంథమే అవుతుంది. నేనొకమారు చాకలి, మంగలి చరిత్ర వ్రాద్ధామా అని గొప్ప గొప్ప గ్రంథాలు పరిశోధించి నోట్సు వ్రాసి పెట్టుకొని వుంటిని, కాని కొంత కాలానికి అభిప్రాయం మార్చుకొని ఉపసంహరించుకొంటిని. నాది కొంచెం ఉల్టా ఖోప్రా అవడం చేత ఒకటనుకొని ఒకటి చేస్తుంటానులెండి!
ఒక్కొక్క దేశములో ఒక్కొక్క తరహాగా వుంటారు చాకలివాండ్లు. కాని మనదేశం చాకలి వాండ్లదే ప్రపంచములో పై చెయ్యి అని చెప్పాలె. ఎందుకంటే ఏ దేశములోనైనా (ఒక్క మనదేశం తప్పితే) బట్టలతో రాళ్ళను బగులగొట్టే శక్తిసామర్థ్యాలు కల చాకళ్ళను మీరు చూసినారా చెప్పండి మరి.
ఇంగ్లాండు దేశంలో దుడ్డు పొగరుచేత సన్‌లైటు సోపు - గిన్‌లైటు సోపు బట్టలకు వాడుతారు. మనదేశములో దుడ్డు దుగ్గాని ఖర్చులేకుండా బట్టలను తెల్లగా చేసే ఉపాయం పూర్వకాలంలోనే అనగా నారదమహర్షి కాలంలోనే కనిపెట్టినారు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse