Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/మన కవసరమగు చరిత్రలు

వికీసోర్స్ నుండి



మన కవసరమరగు చరిత్రలు

సృష్టి యంతయు చరిత్రాత్మకమే. దాని నిజమైన చరిత్ర ఆ సృష్టికర్తకే యెరుక. సృష్టిలో మానవుడొక్కడే చరిత్ర వ్రాయగలవాడు. కాని వానికి తన చరిత్రయే తెలియదు. మానవ చరిత్ర మనకు 6000 సంవత్సరములకంటె ఎక్కువగా తెలియదు. అంతకు పూర్వముదంతయు ఊహలతో నిండినది. చరిత్రను సైన్సుతో లంకె పెట్టి ఈ కాలమందనేక పరిశోధనలు చేస్తున్నారు. తత్ఫలితముగా మన కనేకాద్భుత విషయాలు తెలియవస్తూ యున్నవి.

చరిత్ర యొక్క నిరూపణమును నిరుక్తమును ఉద్దేశమును గూర్చి పలువురు పలు విధములగు అభిప్రాయములను 2500 సంవత్సరాల నుండి యిస్తూ వచ్చినారు. ప్రాచీన గ్రీకు వేదాంతియగు డయొనీషియస్‌ “నిరూపణములతో బోధించు తత్త్వశాస్త్రము చరిత్ర” అని చెప్పెను! ఒక శతాబ్దమునకు పూర్వమందుండిన డాక్టర్‌ ఆర్నాల్డు ఇట్లనెను. “సభ్య మానవుని ఆంతరంగిక జీవితమును సన్నిహితముగా స్పృశించి వాని సాంఘిక రాజకీయ సాంప్రదాయక నిర్మాణముల నిమ్నోన్నతముల నిరూపించుటే దాని ముఖ్యోద్దేశము".

నాగరిక మానవ చరిత్రయే సరియగు చరిత్ర యను భావము పూర్వ కాలముదై పోయినది. ఆటవికుల చరిత్రయే యీనాడు మానవుని అతి ప్రాచీన చరిత్ర కుపకరిస్తున్నది.

మన పూర్వులలో చరిత్రలు

ఇతరుల సంగతికంటే ముందుగా మన సంగతినే తెలుసుకొందము. హిందువులు చరిత్రలు వ్రాయు నలవాటు లేనివారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అనియు,

సర్వాం క్షణక్షణిక మేవ అను జైన బౌద్ధ నినాదాలను హిందువులు స్వీకరించి, చు

ఆంగ్ల చరిత్రకారులు

మనకు ఇంగ్లీషు జాతితో లంకె కుదిరిన తర్వాత నష్టాలున్నూ లాభాలున్నూ ఇంచుమించు సమభాగాలుగా సంక్రమించినవి. లాభాలలో చారిత్రక దృష్టి గాఢమై ఆధునికమై విజ్ఞానప్రదమైన దొకటి. ముసల్మాను ప్రభువుల మూలాన నాశనమై దగ్ధమై దిబ్బలై పూడిపోయిన మన కళలను ఇంగ్లీషువారు పైకి దీసిరి. మన వేదాలను, స్మృతులను, పురాణాలను, కావ్యాలను, ఇంగ్లీషులో చక్కని చారిత్రక పీఠికలతో ముద్రించిరి. ఈ కార్యమందు ఇంగ్లీషువారు మాత్రమే తోడ్పడినారనుట కాదు. ఫ్రెంచి, జర్మన్‌, రష్యన్‌, అమెరికన్‌ వంటి జాతుల వారున్నూ గొప్ప పరిశోధనలు చేసిరి. మనకు వారి పరిశ్రమ యంతయు ఇంగ్లీషు భాష నుండియే లభ్యమైనందున ఆంగ్ల భాషోపకారమును మనము విస్మరింపజాలము. చరిత్రకుపయోగకరమగు శాసనములను; తాళపత్రాది గ్రంథములను, ప్రాచీన శిల్పములను ఉద్ధరించి రక్షించి పరిశోధించి మనకందించిన కీర్తి ఇంగ్లీషు వారికి చెందును. అయితే ఒక దిక్కు ఇట్టి ప్రయత్నాలు జరిగినను మరొక దిక్కు ఇంగ్లీషు ప్రభుత్వము పరిపాలక దృష్టితో తమ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చి భారతీయుల కొంచెపుదనమును చూపించి చరిత్రలు వ్రాసి విద్యార్థులచే చదివించిరి. కొందరు మిషనరీలు మత దృష్టితో గ్రంథాలు వ్రాసి మనల నవమానించిరి. మరికొందరు తెలిసియో తెలియకయో మన పూర్వ చరిత్రకు ప్రాధాన్యమియ్యకపోయిరి. మన కళాశాలలో గ్రీసు, రోము చరిత్రలు చదివించిరి. కాని, మనకు సంబంధించిన ఈజిప్టు, చీనా, ఆసియా, ఖాల్డియా, పర్షియా, బర్మా, మలయా, ఇండోనేషియా, ఇండోచీనా చరిత్రలో నేవియు చెప్పింపలేదు. ఇంగ్లీషువారు వ్రాసిన చరిత్రలలోను వారి విజ్ఞానకోశాలలలోను మనలోని గొప్పవారిని గురించి ముచ్చట్లు కానరావు. లోకోత్తర చిత్రలేఖనములలో అజంతా పేరే లేదు. లోకోత్తర శిలా శిల్పములలో మన ఎల్లోరాను స్మరించుట అరుదు. యూక్లిడ్‌ సూత్రాలనే పేర్కొందురు కాని మన శుల్బ సూత్రాల నడుగరు. మన వరాహమిహిరుడు, లీలావతీకర్తయగు భాస్కరాచార్యుడు వారికి కానరాలేదు. బీజ గణితమును మనము కనిపెట్టితే 'ఆల్‌జీబ్రా'ను అరబ్బులే కనిపెట్టిరని ప్రచారము చేసిరి. 300 ఏండ్ల క్రిందట

వెనిసులో గ్యాలిలయో అను మహామేధావి పుట్టి సూర్యుని చుట్టే భూమి గిర్రున

ఇతర ప్రాచీన చారిత్రక దేశాలు

పూర్వకాలములో అసీరియా (అషుర) దేశము చాలా గొప్ప సభ్యతగలది. అచ్చటివారు పచ్చియిటికలపై వ్రాసి వాటిని కాల్చి గ్రంథములుగా వాడుకొనిరి. హట్టి, ఖస్సీ, జాతులవారును ప్రాచీన నాగరిక జాతులవారు. బాబిలోనియాయు అట్టిదే. ఫినీషియా జాతివారు మధ్యధరా సముద్రమందును, హిందూ మహాసాగర దేశాలయందును విరివిగా వ్యాపారమును చేసినవారు. వ్యాపారముతో పాటు వివిధ దేశ సంస్కృతుల వ్యాపింపజేసినవారు. ఈజిప్టు (మిశ్ర) దేశముయొక్క చరిత్ర 6000 ఏండ్లనుండి లభిస్తున్నది. ఫినీషియనుల ద్వారా హిందూదేశమునకు ఈజిప్టువారి ఆచారములు విశ్వాసములు శిల్పములు కొన్ని దిగుమతి యయ్యెనని కొందరి పాశ్చాత్య పరిశోధకుల అభిప్రాయము. ఫ్రిజియా దేశమువారు 2500 ఏండ్ల క్రిందట తాము భృగుజాతి వారమని చెప్పుకొనిరి. మన పౌరాణిక భార్గవులు ప్రిజియావారా లేక మనవారే అచ్చటికి వలసపోయి, రాజ్యస్థాపకులైన వారా? పరిశోధనీయమగు విషయము. గ్రీకు దేశము (యవన) క్రీస్తు శకానికి బహుపూర్వమే 500 ఏండ్లపాటు సర్వకళలందు పురోగామియై ప్రపంచానికి అందు ముఖ్యముగా యూరోపు ఖండానికి జ్ఞానభిక్ష పెట్టెను. తర్వాత రోము సామ్రాజ్యము 500 ఏండ్లపాటు జగజ్జేగేయమానముగా వెలిగెను. యూరోపు ఖండ జనులందరును యవన రోమక మానసపుత్రులు. ఈరానువారు మన రక్తసంబంధులై ఉండిరి. నిజముగా ఈరానే ఆర్యుల ఆదిదేశము. నేటి అబుర్‌ బాయబౌ జరథుస్యుని కాలమందు “ఆర్యబీజ” నామముతో ప్రసిద్ధిగాంచెను. “ఈరాన్‌లోని భాగమునే ప్రాచీనమందు “ఆర్యాణము” అనిరి. వారిలోను చరిత్రలు బాగా వెలసియుండెను. అరబ్బులు ఇస్లాం మతాన్ని పుచ్చుకొన్న ఆదికాలములో మతోద్రేకముతో యూరోపు ఆఫ్రికా ఏషియా ఖండాలలోని భాగాలను జయించిరి. వారు కొంత నాశనము చేస్తూ పోయినను వారు గొప్ప నాగరికత కలిగియుండిన జాతి యనియు వారే వైద్యాన్ని అంకబీజ రేఖాది గణితములను వృద్ధి చేసిరనియు ఇట్టివెన్నో వారి సృష్టియే యనియు 19వ శతాబ్ద్యంతమువరకు తెల్లవారు ప్రచారముచేసి తుదకు ఈ శతాబ్దములో అరబ్బులు వ్యాపారస్థులే యనియు తమ సరకులతోపాటు హిందువుల సంస్కృతిని తీసుకొనిపోయి యూరోపులో దిగుమతి చేసినవారే యనియు ఆ పాశ్చాత్యులే గుర్తించిరి. ఎటైన అరబ్బులు కూడా మంచి చరిత్రకారులేయని పేరు

పొందిరి.

చరిత్రల దృక్పథము

ప్రపంచ చరిత్రలో సాధారణముగా యుద్ధాలే యెక్కువ ప్రాముఖ్యము వహించినవి. ఆది కాలములో హుణులు, ఆర్యులు, తార్తారులు, శకులు, మున్నగు వర్గాల వారు జనసంఖ్య హెచ్చుటచే నలుదిక్కుల వ్యాపించిరి. అట్టి వ్యాప్తిలో ఆదిమవాసులకును దాడి చేసిన వారికిని సంఘర్షణలు జరిగెను. తుదకుభయులును సమాధానపడి మరికొంత కాలానికి దాడి వచ్చిన గుంపులతో యుద్ధములు సాగించిరి. ఆర్యులు హిందూస్థానములో బహు ప్రాచీన కాలమందు ప్రవేశించిరనవచ్చును. వారు వచ్చిన తర్వాత వారికిని ఇతరులకును అనేక శతాబ్దముల వరకు సంఘర్షణలు జరిగినట్లున్నది. అందుచేతనే వేదాలలో విశేషముగా శత్రువులను నాశనము చేయుటకై ఇంద్రాదిదేవతలను ప్రార్థించిరి. వారికి అసురులతో, దస్యులతో, దానవులతో, శకులతో, యక్షులతో, రాక్షసులతో యుద్దాలు జరిగెను. అసురులు అషుర్‌ (అసీరియా) దేశము వారైనను లేక అహుర పూజకులయిన ఈరానీ వారైనను అయి యుందురు. పూర్వము ఈరాను కుత్తరమందు దహ్యదేశముండెను. అచ్చటి వారినే దహ్యులనిరి. ప్రాచీనమందే దస్యజాతి ఈరాను జాతిలో లీనమై తన ప్రత్యేకత కోల్పోయెను. యక్షులు ఆక్సస్‌ ప్రాంతీయులో, లేక యచీ అను జాతివారో అయి యుందురు. అరక్షస్‌ నదీ ప్రాంతము వారే రాక్షసులై యుందురు. డాన్‌ నదీ ప్రాంతీయులు దానవులు. దైత్యక నది కాస్పియన్‌ (క్షీరవాన్‌ క్షీర) సముద్రములోనికి ప్రవహించును. తత్ప్రాంతీయులే దైత్యులు. పురాణాలు పెంచిన వారికి భౌగోళిక జ్ఞానము లేక చిత్ర విచిత్ర కల్పనలు చేసిరి. బుగ్వేద కాలములో దాశరాజు యుద్ధము ప్రసిద్ధమైనది. పదిమంది రాజులు కలిసి ఆర్యావర్తముపై దాడిచేయుట, వసిష్ఠుడు ఆర్యుల పక్షమందు, విశ్వామిత్రుడు పరదేశీయుల పక్షమందుండుట అందుకాననగును. ఋగ్వేద పరిశీలనమువల్ల ఇట్టివెన్నియో వెల్లడియగును. అట్టిలా అను హూణుడు క్రీస్తు శక పంచమ శతాబ్దమందు మంగోలియా నుండి హంగరీ వరకు రక్త ప్రవాహాలతో మానవ సంహారము చేస్తూ పోయెను. ఇట్టి దాడులు ఆది కాలమందుండెను. తర్వాత మత యుద్దాలు వచ్చెను. అందు క్రైస్తవులు, ముసల్మానులు ప్రధాన పాత్ర వహించిరి. అటు తర్వాత వ్యాపార యుద్ధాలు మొదలయ్యెను. తిరుగుతుందయ్యా అని అనగానే అతన్ని బట్టి బైబిల్‌ బోధల నబద్ధ మందువా నీ తల కాచుకో అని పీడించి క్షమాపణ పత్రికను క్రైస్తవాచార్యులు వ్రాయించుకొనిరి. గ్యాలిలియో నక్షత్రశాస్త్ర మందద్భత పరిశోధకుడని కీర్తించుతున్నారు కదా అతనికంటె 1200 ఏండ్లకు ముందు క్రీ.శ. 476లో నుండిన మన ఆర్యభటుడు సూర్య సిద్ధాంత గ్రంథము ద్వారా గ్యాలిలయో చూపించిన విషయాన్నే కాక ఇంకా ఇతరాంశములను భూమికి సూర్యునికి భూమికి చంద్రునికి ఉండు అంతరాయమును ఈనాడు టెలిస్కోపు యంత్రాలతో చూచి గుణించిన పాశ్చాత్యుల లెక్కలకు ఇంచుమించు సరిపోవునట్లుగా ఆనాడే తెలిపియుండెనుకదా? అతని పేరెందైనా ఉదాహరింతురా? అతడు ప్రసిద్ధుడు కాడు. ఆనాడే అతని కీర్తి రోము వరకు వ్యాపించెను. అరబ్బు లతణ్ణి అర్జబహార్‌ అని తమ అస్తవ్యస్తపు బాసలో పేర్కొనిరి. రోమకులు అరబ్బుల నుండి ఆ పేరును గ్రహించి అర్దుబారియస్‌ అనిరి. పాశ్చాత్యులకు ఈసఫ్‌ కలడు కాని గుణాఢ్యుడు కాని విష్ణుగుప్తుడు కాని కానరాలేదు. కాక్‌, లివింగ్‌స్టన్‌ ప్రభృతుల చరిత్రలు వ్రాసిరి కాని కాంబోడియాను పాలించిన మన కౌండిన్యుడు కాని చీనాలో 30 ఏండ్లుండి అచ్చటనే చనిపోయిన కుమార జీవుడు కాని, అపర బుద్ధుడుగా ప్రఖ్యాతుడైన ఆర్య నాగార్జునుడు కాని వారికి జ్ఞాపకము రాలేదు. హార్వీ అను ఆంగ్లేయుడు క్రీ.శ. 17వ శతాబ్దములో శరీరమందు రక్తము ప్రవహిస్తూ వుండును అను విషయము కనిపెట్టితే అతని యాయుపజ్ఞాఫలితమే ఆధునిక పాశ్చాత్య వైద్యానికి మూలకందమని శ్లాఘించిరి. కాని అతనికంటే 1800 ఏండ్లకు ముందు మన హారీతుడు, సుశ్రుతుని కన్న ముందుండినవాడు పాండురోగ నిరూపణములో ధమనులలో అన్ని రసములు రక్తమై ప్రవహిస్తూ వుండునని వ్రాసెను. భావ ప్రకాశమను వైద్య గ్రంథము హార్వీకన్న 100 ఏండ్లు ముందు వెలిసెను. అందుకూడా హార్వీ కనిపెట్టిన విషయాన్నే తెలిపినారు. హారీతుడు ఆత్రేయ పునర్వసు శిష్యుడు, చరకాదుల సతీర్థ్యుడు, హారీత సంహితను రచించినవాడు. పాశ్చుయర్‌ క్రిమి సిద్ధాంతమును కనిపెట్టెను. హారునల్‌ రషీద్‌ ఖలీఫా కాలములో బాగ్దాదులో నివసించి, ఖలీఫా రాజ్యమునకు వైద్యాధికారియై మన వైద్య గ్రంథములను అరబీ లోనికి పరివర్తనము చేసిన మంఖుని మనమే మరచినాము. ఇట్టి వనంతముగా కలవు. ఈ పరిశోధనలు చేసి ప్రపంచానికి తెలుపుకొనుట మన విధి. కూడా తెలియదు. విక్రమార్కులు కల్పిత పురుషుడో కాడో చెప్పజాలము. మన భక్తులలో 200-300 ఏండ్ల క్రిందట వారికినీ వైకుంఠము నుండి విమానాలు వచ్చి వారిని సశరీరముగా తీసుకొని పోయెనని మనవారు వ్రాసిరి. మహాపురుషుల చరిత్రలకు మనవారును ఉత్తమ స్థానమిచ్చిరి.

యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్త దనువర్తతే (భగవద్గీత 3-21)

అని భగవద్గీతయే బోధించెను. కాని మనలో నిజమైన జీవిత చరిత్రలు లేవనియే యొప్పుకోవలెను.

ఈ శతాబ్దిలో మరల దృక్పథము మారినది. ప్రతి దేశ చరిత్రలో ఆ దేశ సాంస్కృతిక సాంఘిక చరిత్రకు ప్రాధాన్యమియ్యవలెనన్న భావముతో చరిత్రలు వ్రాస్తున్నారు. ఇదే సరియగు విధానము.

మానవ చరిత్ర

ఇంచుమించు 100 ఏండ్ల క్రిందట డార్విన్‌ “పరిణామ”(EVంlution) సిద్ధాంతమును లేవదీసెను. ఆనాటి నుంచి చరిత్ర నూతన మార్గములందు ప్రవేశించెను. క్రీ.శ. 1891లో వెస్టన్‌ మారన్‌ అను నతడు “మానవ వివాహ చరిత్ర” అను మహోద్గ్రంథమును వ్రాసెను. మానవుడు స్వాభావికముగ ఏకపత్నీ వ్రతుడేయని క్రైస్తవ బోధకనుకూలముగ అతి చతురతతో తన గ్రంథమున రచింపగ 30 ఏండ్లపాటు అదే మానవ చరిత్ర బైబిల్‌ అయిపోయెను. 1920 ప్రాంతములో రాబర్టు బ్రిఫీల్ట్‌ అను పండితుడు “తల్లులు” (The Mothers) అను గ్రంథాన్ని రచించి వెస్టర్‌ మారన్‌ సిద్ధాంతాలనన్నింటిని ధ్వంసము చేసి ప్రపంచమంతటను ఆదికాలములో వివాహ నియమములు లేవనియు పశువృత్తియే మానవ వృత్తిగా నుండెననియు గట్టిగా నిరూపించెను. యిప్పుడాతని గ్రంథమే ప్రపంచమంతటను చెలామణి పొందినది. ఈ సిద్ధాంతమునే “తల్లి హక్కు” (Mother Right) అను పేరుతో ఒక జర్మన్‌ పండితులు స్థిరపరిచెను. ఆది కాలములో ఒక గుంపువారు యింకొక గుంపు పిల్లలను స్వీకరించేవారనియు, అట్టి స్త్రీలను గుంపు వారందరును కూడుచుండిరనియు నేటికిని ఆటవికులలో ఈ పద్ధతి కలదనియు నిరూపితమైనది. అట్టి గుంపును “టోటెమ్‌ గుంపులనిరి”. మన హిందువులలో గోత్రములనున విట్టివైయుండును. ఆదికాలమందు బహు కళత్రత్వము బహుభర్తృత్వము వుండెను. స్త్రీలు అందరి స్వత్వమన్నట్లుగానే స్థిరచరాస్తులన్నియు ఒక్కొక్క వర్గపు సమిష్టి స్వత్వముగా నుండెను. ఆదిలో జనులు తల్లుల నెరిగిన వారేగాని ఏ పురుషునికి జన్మించినది వారికి తెలియదు. అందుచేత తల్లికే ప్రాధాన్యముండెను. వివాహ నిబంధన లేర్పడిన తరువాతనే తండ్రికి ప్రాధాన్యము వచ్చినది. ఆదిమ పురుషునికాలాన్ని శిలాయుగమనిరి. యిది యుత్తయూహగాదు. వేల వేల సంవత్సరాల క్రిందటి పూడికలను త్రవ్వగ అందు మానవాస్తులతోపాటు రాతి గొడ్డండ్లు, రాతిమొనలుగల బళ్ళెముల వంటివి లభించినవి, తరువాత రాగి, యిత్తడి, యినుము, కనుగొనిరని శాస్త్ర నిపుణులు నిరూపించినారు. ఆదిలో మానవుడు పండ్లు, గడ్డలు, పచ్చి మాంసము తినెనందురు. అగ్నిని తరువాత కనిపెట్టిరి. కట్టెల రాపిడిచే, రాళ్ళ రాపిడిచే అగ్గిపుట్టుట గమనించి ఆదికాలమువారును వాటి రాపిడిచే అగ్గి పుట్టించిరి. గ్రీకు వారు పుమిధీయస్‌ అనువాడు మొదట అగ్నిని దేవలోకమునుండి అపహరించి తెచ్చి మానవులకియ్యగ దేవతలతనిని బంధించి బాధించిరనునొక కథను వ్రాసినారు. ఇది ఆదికాలపు అగ్ని సముత్పాదన కథనమె అని పుమిదియన్‌ అనగా పుమదనము అను పదమే నిరూపిస్తున్నది. పాశ్చాత్యులు సైన్సు ద్వారా మానవ ప్రాచీన చరిత్రను కనుగొంటున్నారు. ప్రపంచములో ప్రతి ఖండమందును మిగిలిన ఆటవికుల ఆచార వ్యవహార విశ్వాసాలను సమగ్రముగా పరిశీలించి మన ఆదిమ పురుషుల కాలపు స్థితులనూహిస్తున్నారు. మన దేశమందును గోండు, కోయ, సవర, చెంచు, తోడ, భీల్‌, నాగ, సంథాల్‌ వంటి ఆటవికులు కొల్లలుగా గలరు. కాని వారిని గురించి పరిశోధనలు చేసిన భారతీయులు వ్రేళ్ళ మీది లెక్కలోపలివారె. ఆంధ్రులకు సంబంధించిన చెంచు, గోండు, కోయలు మనము ఏమియు తెలుసుకొన్న వారము కాము. యూరోపు, అమెరికా చారిత్రక పరిశోధకులు ఆది మానవ చరిత్రకై ఆంత్రాఫాలజి, జియాలజీ, సెక్సాలజీ వంటి శాస్త్రాలను ఆధారము చేసుకొని తమ పరిశోధనలు సాగిస్తున్నారు. కాని వారి దృష్టి మన వేదములపై మనగృహ్య సూత్రములపై మన బ్రాహ్మణములపై, మన పురాణాలపై ప్రసరించుట లేదు. వారింతవరకు నిర్ణయించిన సిద్ధాంతములన్నియు పై వాఙ్మయములందు లభిస్తూనే యున్నవి. మనకు ప్రాచీనాచారములపై పట్టుదల మెండు. నేటికిని శుభాశుభ కార్యాలలోని మన ఆచారములు ఋగ్వేద కాలమువై యున్నవి. యజ్ఞాలలో నేటికిని కట్టెలను మధించి అగ్నిని పుట్టింతురు. నేటికిని మట్టి పాత్రలే శుభాశుభ కార్యాల కవసరము. 'మృణ్మయం దేవపాత్రం” యని అన్నారు. నేటికిని ఒడికిన దారమే పవిత్రము, ఉన్ని దారమే కొన్నింటికి కావలెను. ఇట్టి వెన్నియో వేదముల సుండి విశదమగును. ప్రాచీన కాలములో బహు దేశములలోను, ఆటవికులలోను, చీనా అరలు లౌర్తరీ వంటి దేశాలలోను మనుష్య భక్షణ ముండెనని పలువురు నిరూపించిరి. మన ఐతరేయ బ్రాహ్మణములో నరమేధ యజ్ఞము శునశ్శేపుని కథ ఈ సందర్భములో గమనింపదగినది. మన దేశములో నేటికిని పల్లెలో చెకుముకి రాయితో “అగ్నికొట్టీ” వాడు కొందురు. ఆది కాలములో అగ్నికే సర్వ ప్రాధాన్యముండెను. “అగ్ని మీళే పురోహితం” అని ఋగ్వేదము ప్రారంభమగుచున్నది. మన ప్రాచీన భాగదేయులకు జరదుష్ట్ర మతానుయాయులకు అగ్నియే ప్రధాన దేవత. మన పురాణాలలో అనేక ప్రాచీన తమ చరిత్రలు అణిగియున్నవి. మహాభారతములోని అనేకాంశములు ఆది కాలపు సాంఘిక స్థితిని వెలువరిస్తున్నవి. ఆది పర్వమందలి శ్వేతకేతు కథ కుంతీ నియోగం. ఆ సందర్భమందు పాండు రాజన్న మాటలు పూర్వమందలి సాంఘిక స్థితిని తెలుపును. స్త్రీలు అనాహృతలై స్వేచ్ఛా చారిణులై యుండిరి. “అయం ధర్మ సనాతనః అని పాండు రాజనెను. మమత అను నామె, ఉతత్స బృహస్పతి అను సోదరులకు ఏకభార్యగా నుండెను. ద్రౌపది పంచపాండవుల భార్య. నేటికిని టిబెట్టులోను, మలబారులోను, బహుభర్తృత్వము (Polyandry) అందందు నిలిచినది. యయాతి కూతురు వరుసగ హర్యశ్వ దివోదాస ఉశీనర, విశ్వామిత్రులకు సంసారము చేసి పిల్లలగనెను. శాస్త్రకారుల అష్టవిధ వివాహాలు ద్వాదశౌరస పుత్రులు ప్రాచీనాచారాలను స్పష్టీకరించెను. పూర్వము కతక భరద్వాజులు తమ తమ భార్యలను మార్చుకొనిరని “దృష్టం ధర్మ వ్యతిక్రమం సహసంచ మహీతాం” అనియు గౌతమ ధర్మ సూత్రములందు తెలిపినారు. ఛాందోగ్యములోని జాబాలి కథ సుప్రసిద్ధమే కదా! ఇట్టి వన్నియు ప్రాచీన మానవ చరిత్రకు చాలా సహాయపడును. చారిత్రికులు మన వేదశాస్త్రపురాణాలన్నీ దృష్టితో పరిశోధించి మన ప్రాచీన చరిత్రకు తోడ్పడవలసి యుండును.

మానవ చరిత్ర నిర్మాతలు మన భూమి 200 కోట్ల యేండ్ల ముందు ఏర్పడి యుండునందురు. మనలో మహాసంకల్పమొకటి కలదు. ఆది దాక్షిణాత్యులచేతను క్రీ.శ. 6వ శతాబ్ది తర్వాతను అల్లబడినదని దానిలోని విషయములే పట్టించును. అయినను అందలి భూ సృష్టి కాలనిర్ణయము గమనింపదగినది-


“ప్రవర్తమాన స్వాద్య బ్రాహ్మణః ప్రథమ పరార్థే
పంచాశ దృత్సరేష్య తీతేషు ద్వితేయ పరార్ధే.....
శ్వేత వరాహ కల్పే............ వైవస్వత మన్వంతరే........
కలియుగే ప్రథమ పాదే........ శాలివాహన శకే.........”


అని చెప్పుట వాడుక. దాన్ని గుణించిన గణకులు సృష్ట్యాది ఇంచుమించు 192 కోట్ల యేండ్లని చెప్పుదురు. పాశ్చాత్యులు సైన్సు అంచెనాలతో చెప్పెడు దానికి మన మహాసంకల్పానికంతగా భేదము కానరాదు. ఇట్లు 200 కోట్ల యేండ్ల నుండి ఏర్పడెనను మనుష్యుడెప్పుడేర్పడెనన్నది తేలలేదు. కొన్ని ఏండ్ల క్రిందట జావా ద్వీపములో భూగర్భ మందొక మనిషి ఆస్థిపంజరము లభించెను. దాన్ని పరిశీలించిన నిపుణులు జావాలో ఆ మనిషి 8 లక్షల యేండ్లకు ముందుండెననిరి. మరికొంత కాలానికి ఇంచుమించు 15 యేండ్ల క్రిందట చీనాలోని పేకింగ్‌ నగర ప్రాంత మందొక మనిషి కపాలము భూగర్భ పాతాళమందు లభించెను. దాన్ని పరిశీలించిన నిపుణులు, ఈ పుర్రెగల మనిషి 10 లక్షల యేండ్లకు ముందుండెనని నిశ్చయించిరి. అంతకన్న ప్రాచీనమునకు పరిశోధకులు వెళ్లజాలిన వారు కారు. క్రీస్తునకు పూర్వము 4000 ఏండ్ల క్రిందట భూసృష్టి జరిగెనన్న బైబిలులోని మోటుమాట అపాస్తమైనది. మానవుని యునికి లక్షల ఏండ్ల ముందులో యున్నది. ఒక శతాబ్దము నుండి మానవుని ఆది జన్మస్థానము 'మధ్య ఆసియా' అని తేలినది. ఇంతవరకు పేకింగ్‌ పుర్రె ఆధారముతో ఆ వాదము స్థిరపడినది. చరిత్రల దృక్పథములో ఈ విధముగా అద్భుతమగు మార్పులు జరుగుతున్నవని మన చారిత్రకులందఱును గమనింపవలసి యున్నది.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse