Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/చాక్యార్లు

వికీసోర్స్ నుండి


చాక్యార్లు

మలబారులో చాక్యార్లు అను బ్రాహ్మణ జాతి యొకటి కలదు. ఈ జాత్యుత్పత్తి విషయము యనేకులనేక విధముల వ్రాసియున్నారు. నాగమయ్య తన మాన్యూలులో వీరు శ్లాఘ్య వాక్కుకారులగుటచే నా పదమే యపభ్రంశమున 'చాక్యార్లు' అయ్యెనని వ్రాసియున్నాడు. ఈ జాతి మొదలు నంబూద్రీ బ్రాహ్మణులలో జేరినదయి కొన్ని యాచార లోపములచే నేటి కాలమున నించుక హీనముగాఁ జూడఁబడుచున్నది.

ఈ చాక్యార్లు మన యాంధ్రమున భాగవతుల రీతి కథా కాలక్షేపము చేయువారై నాటక ప్రదర్శనములచే లోకుల రంజింపఁజేయువారే కాక, హాస్యమునకు నిధులయి పాండిత్య ప్రకర్షచే కవులయి గౌరవముతో భావింపబడుచున్నారు. వీరి నాటకమును “చాక్యారుకూతు” అని చెప్పెదరు. వీరి ప్రదర్శనము కొన్ని సమయములందనేక దినములవఱకు జరుగుచుండును. వీరి ప్రదర్శనమును థర్సటన్‌ ఇట్లు వర్ణించినాడు. ముఖ్య పాత్రయైనవాడు ముక్కాలి పీటపై కూర్చునియుండును. జలతారంచులు కల యొక పెద్ద తలపాగను చుట్టియుండును. రంగులయంబుగల పెద్ద వస్త్రము నొకదానిని నడుము చుట్టును మడతలు మడతలుపడ చుట్టియుండును. అతని వెనుక నొక నంబియారు స్త్రీ నిలిచి యుండును. చాక్యార్లు సభ్యుల నవ్వించుచుండినను నిశ్చలముగా గూర్చొనినట్టి యొక ప్రదర్శకుఁడొక మూలనుండును. ఇతఁడెప్పుడైన నించుక నవ్వినట్లయిన చాక్యారు తన కథను చాలించును. ఒక తూరి చాక్యార్లు మహాభారత మందు దుర్యోధనుఁడొక పల్లియ సయితము పాండవులకివ్వననుట ప్రదర్శించుచుండ పాండవ పక్షపాతియైన యొక సభ్యుడు మైమఱచి సభారంగమునకురికి, ఓరి, పాప మాపాండవులింతగా దీనులయి వేడుచుండ యొక యంగుళపు భూమియైన నొసఁగననెదవా, యని దుర్యోధన పాత్ర ధారిని చావమొత్తెనట! అప్పటినుండియు చాక్యార్లు కూతును గృహములలో ప్రదర్శింపక దేవాలయములందే ప్రదర్శింప వలయునని శాసించిరట. కౌసల్యా తనయుని యందు సుమిత్రాత్మజునికెంత భక్తి యున్నదో యంత భక్తి యొకే తల్లికి జనించిన నాయందు నీకు లేకపోయెను గదా యనియు, నా మాటలకు నీవు కోపించిన తూష్ణింభావమైన వహింపక (సద్యః) తక్షణమే రాఘపుని పక్షమున జేరుటచే నీ యందు ధర్మచింత కాక ద్రోహ చింతయే యున్నదనియు రావణుడు విషాదముతోఁ పలుకుచున్నాడు.

ఇట్టి శ్లోకము లనేకములున్నను నాకు లభ్యములైన వివియే. తక్కినవాని నింకను ప్రయత్నించుచున్నాను.

ఈ చాక్యార్లు హాస్యరస ప్రధానులు. వారికి రాజానుగ్రహము మెండు. ఒక మారు దామోదరన్‌ అనువాడు మహోదర వ్యాధితో జిక్కి ప్రదర్శించుటను మానగా నచ్చటి రాజు వీనిని జూచి “ఓయి దామోదరన్‌ నీ స్థితి నాకు వ్యసనము గలిగించెను. అని పలికిన వెంటనే యితడు, స్వామీ! నన్నింక దామోదరన్‌ అని పిలువకుడు. మహోదరన్‌ అని సంభోదింపుడు” అని పలికెనఁట.

మళయాళములోని పూజారులను శాంతి విప్రులనెదరు. ఒక చాక్యారుతో శాంతి విప్రడొకనాడు చాలాసేపు మాట్లాడి శాంతికి (పూజకు) వేళయైనది పోవలయును అని చెప్ప ఓయి మీ శాంతి యెట్టిదో నాకు దెలియును అని యిట్లాశువుగా శ్లోక మొకటి రచించెనట.


శ్లో॥ శాంతి ద్విజః ప్రకురుతే బహు దీప శాంతీం
      పక్వాజ్య పాయస గుళైర్జఠరాగ్ని శాంతీం!
      తత్రత్య బాల వనితా మదనాగ్ని శాంతీం
      కాలక్రమేణా పరమేశ్వర శక్తి శాంతీం!


దీపార్చనలకై యిచ్చిన నూనెను భక్తులు తరలినంతటనే దీపములు నార్పి బుడ్డితో నూనె నింటికి తీసుకొని పోవుటచేతను స్వామి కర్పించిన పాయసాన్నములతో తమ పొట్టలనింపుటచేతను, తిన్నగా దేవుని శక్తిని సహితము పోగొట్టువారని చెప్పెనట! ఈ శ్లోకమువంటిదొకటి ఆంధ్రదేశములో ఈ విధముగా ప్రచారమందున్నది.


పూర్వ జన్మని చోరత్వాత్‌
జారత్వా దిహజన్మని
అరిత్వాద్దేవ పూజాయాం
పూజారి రితి కథ్యతే॥


శ్లో॥ రామాయ ప్రతిపక్ష కక్ష శిఖనేదాస్వామి వామైథిలీమ్‌
     యుద్ధే రాఘవ సాయకైర్వినిహతస్సర్గం గమిష్యామి వా
     నీతిజ్ఞే! కథయస్వ, దేవి! కథమౌ పక్షో గృహీతన్త్వయా
     సుశ్రావ్యం ప్రియ మస్మదీయ మభవ న్మాత్రావశేషం బలం


ఇంద్రజిత్తు చనిపోయిన తర్వాత రావణుడు భీతిచే తన భార్యను కర్తవ్యమును విచారించు విషయమును వర్ణించుచున్నది పై శ్లోకము. దానికి మండోదరి ఈ క్రింది శ్లోకమున ప్రత్యుత్తర మొసంగుచున్నది.


శ్లో॥ దృష్ట్యాదైన్యం భగిన్యాః సునయ! ఖరవదం మాతులస్వాపినాశం
      సాలానాంభంజనం తత్కపివరనిధనం తచ్చ సుగ్రీవ సఖ్యం
      కర్మాణ్యుద్యాన హర్తుః జలనిధి నియమం యోన జాతస్తదానీం
      సోయం నష్టే కులేస్మిన్‌ కథమితర్జాయతే తేవివేకరిః


ఈ శ్లోక మందు వాలిపేరు చెప్పక తత్కపివర యని చెప్పుటచే రావణునికి భీతి కలిగించుట, అట్టి వానినే చంపినవాడు గాన రాముని శక్తి చూపించుట విశేషము. అదే రీతి హనుమంతుని “ఉద్యాన హర్త” యని సంబోధించినది. ఇట్లందరును చచ్చియుండ యిప్పుడా నీకు వివేకము వచ్చినది అని రావణుని భార్య యాక్షేపించెనట!


తుదకు రావణుఁడు యుద్ధము జేయు సమయమున యతడు దశముఖుడు కాన కవి చమత్కారముగా నవరసములకు మారుగా దశరసములు రావణుని యందుఁ గనబడెనని క్రింది శ్లోకమందు వర్ణించి యున్నాడు.


శ్లో॥ నాశ్చర్యం రామభద్రే సచటుభట ముఖే సవ్యధం దేవతూర్యే;
     నాశం యుద్ధే న కోపం కపిషు సవినయం లక్ష్మీణే సాశ్రుపూర్యాం
     సాసూయం భాతృ కృత్యే, సభయ మనిలజే సత్ర పంచాత్మ వృత్తా
     ఇత్యేవం వక్త్ర చక్రం రజనిచు పతే ర్భిన్నభానం బభూవ


రావణుడు యుద్ధము సేయు సమయమున తమ్ముడగు విభీషణుని జూచి యసూయతో (సాసూయం) నిట్లు పలికెను.


శ్లో॥ సత్యం నామ వయం విభీషణ పరిత్యాజ్య వవస్థాంగతః!
     త్వంచాస్మ ద్వచనాపరాధకుపిత స్సవ్యశ్శితో రాఘవం
     ఏ తత్వా మనుశోచతే దశముఖో దృష్ట్యా కయోద్వీక్షసే
     కౌసల్యాతనయానువృత్తి జటిలం మిత్రం సుమిత్రాత్మజం॥

మూన్నాళ్ళ ముచ్చటతో చచ్చేదానికి కూడా చరిత్ర కావలెనా అని నిస్పృహులై చరిత్రలు

వ్రాసిపెట్టిన పాపాన పోలేదనియు తెల్లవారు బాగా ప్రచారము చేసిరి. కాని అది పూర్తిగా అంగీకరింప దగినది కాదు. బుగ్వేదము కంటే ప్రాచీనమగు గ్రంథము ప్రపంచమందు లేదని వారంగీకరించినారు. అంతటి ప్రాచీన గ్రంథములో ఒక అక్షరము హెచ్చుగాక తచ్చుగాక నేటి వరకు రక్షించుకొని వచ్చిన వారికి చరిత్రాభిమానము లేదనగలమా? మన పురాణాలన్నియు మన చరిత్రలే కాక మనకు పశ్చిమముగా ఉత్తరముగా నుండిన తార్తరీ, తుఖార, ఈరా, కాస్పియ సముద్ర తీర దేశాలు, బాబిలోనియా, ఆసిరియా, ఫ్రిజియా వంటి దేశాల చరిత్రలు కూడ అందుండెను. ఆదికాలములో అనగా 2500 ఏండ్లకు పూర్వము ఏర్పడిన పురాణాలలో సరియగు చరిత్ర లుండెనని ఊహించుటకు కావలసినన్ని నిదర్శనముల కలవు. కాని క్రీస్తు శకాద్యనంతరము పురాణాలలో హస్త క్షేపము చేయుచూ వచ్చిన వారికి ప్రాచీనుల భౌగోళిక చారిత్రక పరిజ్ఞానము శూన్యమగుటచేత సప్తసముద్రములను, సప్త ద్వీపాలను పిచ్చిగా వర్ణించి రాక్షస కిన్నర పిశాచాసురాదులను సృష్టించిరి. ఈ వర్గాలవారందరు మన కుత్తరమున పశ్చిమమున నుండు దేశాలలోని ప్రాచీన జనులేయనియు, సప్త సముద్రాలన్నియు అచ్చటి నదులన్నియు, సప్త ఖండాలున్నూ అచ్చటి దేశాలనియు బాగా నిరూపించుట కే సందేహమునూ లేదు. పురాణాలపై చేతులు వేసినవారు మనకు గొప్ప అపకారమును చేసిపోయిరి. మనలో విద్యా ప్రయత్నమునకు తక్షశిల, నలందా, అమరావతి, కాశ్మీరము, కాశి, మధురాది విద్యాపీఠముల దివ్య చరిత్రయే సహస్రవిధముల చాటుతుంది. ఒక్క తక్షశిలలోనే 10వేల విద్యార్థులు, చీనీ, ఈరాన్‌ ప్రాంతాలనుండి వచ్చిన వారును ఉండిరనియు, 200మంది ఆచార్యులుండిరనియు, శత సహస్ర గ్రంథముల భాండాగారము (రత్నగంజ) యుండెననియు, ముస్లిముల మొదటి ధాటిలోనే అవన్నీ అగ్గి పాలయ్యెననియు, ముస్లిములు ఆక్రమించిన ప్రతి ప్రాంతములో గ్రంథములను దగ్ధము చేసిరనియు తెలిసికొనిన మన అమూల్య సంపద ఎంత నాశనమయ్యెనో తెలుసుకొనవచ్చును. ప్రపంచ వాఙ్మయములో మొదటి కథ మనది; మొదటి వ్యాకరణము మనది. ఈ విధముగా లెక్కించి వివరించుచూ పోయిన గ్రంథము చాలాపెరిగిపోవును. మన పూర్వులు చరిత్రలు వ్రాసినవారు కారనుట ఉత్ప్రేక్షాతిశయాలంకారములలో చేర్చదగిన మాటలు.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse