సుఖి యెవరో రామనామ సుఖియెవరో

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

కానడ రాగం - దేశాది తాళం


పల్లవి

సుఖి యెవరో ? రామ నామ - సుఖియెవరో ?

అనుపల్లవి

సుఖి యెవరో ? సుముఖి యెవరో ?

అఖిల సారమగు తారక నామ !


చరణము

సత్యము దప్పక సకల లోకులకు

భ్రుత్యుడై దైవ భేదము లేక

నిత్యమైన సుస్వరపు గానముతో

నిరంతరము, త్యాగరాజనుత నామ !