సాక్షి వ్యాసాలు

వికీసోర్స్ నుండి

సాక్షి (వ్యాసాలు) వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి వ్యాసములను రచించారు. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. తెలుగు మాతృభాష గల వారు కూడ అర్ధం చేసుకోవటనికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసలన్నీ కూడ కొంత వినోదపూర్వక భావంతోనె వ్రాయబడినప్పటికి, అప్పటి సామజిక పరిస్థితులను ఎండగట్టుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదొ ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 20వ శతాబ్దపు మొదటి రోజులలో, ఆరు సంపుటాలుగా ప్రచురణ పొందినాయి. ఆ తరువాత, 1990లలో 3 సంపుటాలుగా ఒకసారి, 2 సంపుటాలుగా ఒకసారి ప్రచురించబడినాయి. మూడు సంపుటాలుగా వెలువడిన సంపుటాలకు ముందుమాట, రచయిత మరియు ఆకాశవాణి కళాకారుడు అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (ప్రముఖ రచయిత మరియు వ్యాఖ్యాత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కుమారుడు) వ్రాశాడు.

విషయ సూచిక [దాచు] 1 సాక్షి సంఘము 1.1 సాక్షి సంఘ సభ్యులు 1.2 సాక్షి సంఘ నియమములు 2 సాక్షి వ్యాసముల జాబితా


[మార్చు] సాక్షి సంఘము దాదాపు వ్యాసాలన్నీ కూడ సాక్షి సంఘ సమావేశాలలో సంఘ సభ్యుడు జఘాలశాస్త్రి చెప్తూండగా చదువరులకు తెలియుచేయబడుతాయి. కొన్ని సందర్భములలో కాలాచర్యుడో లేక వాణీదాసుడో ఎక్కడీకో వెళ్ళి అక్కడ తాము చూసిన విషయాలను లేఖద్వార సంఘమునకు తెలియుపరుస్తారు, ఆ లేఖ చదువటంద్వార ఆ వ్యాసవిశేషాలు చదువరులకు తెలుస్తాయి.


[మార్చు] సాక్షి సంఘ సభ్యులు సాక్షి సంఘములో సభ్యులు-

జంఘాల శాస్త్రి వాణీదాసు కాలాచార్యుడు బొర్రయ్య శెట్టి సాక్షి సాక్షి అనగా రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావే అని ఒక వాదన.

[మార్చు] సాక్షి సంఘ నియమములు ప్రార్థన-చక్రవర్తికి, వారి కుటుంబమునకు అరోగ్యం కలగాలని (అప్పటికి మనదేశాన్ని ఇంగ్లీషు వారు పరిపాలిస్తున్నారు. రచయిత ఇంగ్లీషువారికి విధేయుడయిన ఒక మహారాజు ఆస్థానంలో ఉండేవాడు), మరియు వారి సంఘము చిరకాలము అందరికి ఉపయోగప్రదముగ ఉండాలని దేవుని ప్రార్థించుట. రాజకీయముల గురించి వ్రాయకూడదు, ముచ్చటించకూడదు. తప్పులనేకాని మనుషులను నిందింపకూడదు. తప్పులగురించి విశదీకరించుటకు పేరు వ్రాయవలసిన అవసరమైనచో, కల్పితమైన పేరునే వాడాలి, అసలు పేరు వ్రాయరాదు. సభ జరుగుతున్నంతసేపు, మత్తు పదార్ధములను నోటినుండి గని, ముక్కు నుండి గాని "చప్పుడగునట్టు" పోనీయకూడదు. వాదములలో తిట్టుకొనరాదు, కొట్టుకొనరాదు. కొట్టుకొనుట అనివార్యమయిన సందర్భములలో, అ విషయంలో కోర్టుకు ఎక్కకూడదు.

[మార్చు] సాక్షి వ్యాసముల జాబితా సాక్షి సంఘనిర్మాణము గ్రామ్యభాషా గ్రంథ పఠనము విమర్శక స్వభావము స్త్రీ స్వాతంత్ర్యము గ్రహచక్ర జ్యోతిషము వాల్మీకి విశ్వామిత్ర రామాయణవిమర్శనము పాశ్చాత్య నాగరికతా మాహాత్మ్యము భూతవైద్యము వేదాంతోపన్యాసము దివ్యజ్ఞానమతము దివ్యయోగములు సారంగధర నాటక ప్రదర్శనము నాటక ప్రదర్శనము స్వప్న చారిప్రకృతి స్వవిషయసల్లాపములు మఠాధిపతులు మతవైషమ్యము నాటక ప్రదర్శనము నాటకీయ పద్యరచన ఆధ్యాత్మిక విద్యావశ్యకత తోలుబొమ్మలు సభాస్వకీయవ్యాపారము సత్యము రంజాన్ పండుగ - వినాయక చతుర్థి పార్థసారథిస్వామి పార్థసారథిస్వామి కాలాచార్యుని వివాహ ప్రయత్నము కాలావార్యుని వివాహ ప్రయత్నము దాక్షిణాత్యోపన్యాసము జంఘాలశాస్త్రి యుపన్యాసము సభాస్వకీయాంశములు సాక్షి వ్యాసముల జాబితా మరియు కొన్ని వ్యాసములు వికీ సోర్స్ నందు కలవు(వికీసోర్స్‌లో