సహాయం:వికీసోర్స్ లో రచనలు చేర్చు విధానము

వికీసోర్స్ నుండి
వికీసోర్స్ లో రచనలు చేర్చు విధానము
    వికీసోర్స్ లో రచనలు చేర్చు విధానము - ఉపోద్ఘాతము

    వికీసోర్స్ లో మార్పులూ చేర్పులూ అనగా కొత్త రచనలని చేర్చి, వాటిని సరిదిద్దడమే. వికీపీడియా లో లా కాకుండా, ఇక్కడ మనం ఒక రచన ని చేర్చి, దిద్దుబాట్లు చేసిన తరువాత, మళ్ళీ దాన్ని మార్చే అవసరం ఉండదు.

    గూగుల్ వంటి వారిచే మనకివాళ చాలా పెద్ద సంఖ్యలో రచనలు వికీసోర్స్ లో చేర్చబడుతున్నాయి, కానీ అవి అంత కచ్చితంగా ఉండడం లేదు. చేర్చిన రచన ఒకోసారి వేరు అర్ధాన్ని ఇవ్వడం లేక పుస్తకం కూర్పు మారడం జరుగుతోంది. అధ్యాయములు, పేజీలు స్పష్టంగా వుండడం లేదు, ఫుట్ నోట్సు సరిగా చేయడం లేదు. అందువలన ఇపుడు వికీసోర్స్ లో మనకి ఎంతోమంది సహాయకులు అవసర మవుతున్నారు. చేర్చబడిన రచనలని చూసేందుకూ, సరిచేసేందుకూ మనకివాళ మంచి సదుపాయాలున్నాయి, అతి త్వరలో మీరీ సృజనాత్మక విషయం లో మంచి సహాయ సహకారాలు అందించ గలరు.

    మీ వద్ద ఒక కొత్త రచన వుండివుంటే, మీరీ వ్యాసం చివరికి వెళ్ళి, అది వికీసోర్స్ లో చేర్చు విధానం తెలుసుకోవచ్చు. కాని నేర్చుకుందుకు మనం అప్పటికే చేర్చబడిన 'వ్యాసం ' ఒకదాన్ని వాడుకుంటే మనకింకా సులభం అవుతుంది.

    నేర్చుకుందుకు ఒక రచనని వెతకడం[మార్చు]

    నేర్చుకుందుకు ఉద్దేశించిన 'రచన ' మనకి ఆసక్తి కరముగా వుండాలి కాబట్టి అలాంటి పుస్తకాన్ని - ఇప్పుడు సరిదిద్ద బడుతున్నదాన్ని - వెతుక్కోవాలి. అందుకు అనేక మార్గాలున్నాయి:

    ఆ రచనకి ఎలాంటి మార్పులు చేయాలో కనుగొనడం[మార్చు]

    జరుగుతున్న పనిని ఒక 'సూచిక ' అనే నేమ్-స్పేస్ లో వుంచుతాం. పైవన్నీ అక్కడికే దారితీస్తాయి. మీరొక పూర్తికాని అచ్చుని పుచ్చుకునినపుడు, మీకు ఈ కింది విధానంగా కనిపించవచ్చు:

    కింద యీయబడిన బాక్స్ ఈ విషయం పూర్తిచేయబడ లేదని తెలుపుతుంది. పైన వున్న 'సోర్స్ ' టాబ్ ని గమనించండి. ఈ విషయం పై స్కాన్ చేసిన కాపీలు ఉన్నాయని అది తెలుపుతుంది. 'సోర్స్ ' టాబ్ లేకున్నచో మీకు ఈ 'రచన ' కాపీ లభ్యమవుతుంది. అది వుంటే, దానిపై 'క్లిక్' మనిపించండి. 'ఎడిట్' టాబ్ పై క్లిక్ చేయవద్దు. మనకి కావలసింది అది కాదు.

    ఇప్పుడు మీకు ఒక పేజీ మేప్ కనిపిస్తుంది: అందులో మీరు ప్రస్తుతం ఉన్న మార్పు స్థాయి తెలుస్తుంది:

    ఇది మనకి ఆ రచన పై సాగుతున్న పనిని బొమ్మల్లో చూపిస్తుంది, ఇలాగ:

    Without text
    empty page Not proofread Proofread Validated
    Problematic

    ఈ కచ్చితమైన రహదారి పై మనకి రెండుసార్లు చెక్ చేసుకుందుకు అవకాశం వుంది, ఇద్దరు వ్యక్తులతో. చాలా పేజీలపై 'అచ్చు లేదు ' అని వున్నప్పటికీ, OCR కి చెందిన ఫలితం తరచూ ఇక్కడ కనిపిస్తుంది, మనకింక టైపు చేసే అవసరం లేకుండానే. ప్రూఫ్ రీడింగ్ కి సంబంధించిన వివరాలని తెలుసుకోడానికి ప్రూఫ్ రీడింగ్ చూడండి. పేజ్ బ్రేకులు కొంత సమస్యాత్మకమైన విషయము.

    తగినంత పని జరిగిన తరువాత, ఆ భాగాన్ని ( ఉదా: అధ్యాయాన్ని ) పుస్తకపు అసలు పుట పైకి ట్రాంస్క్లూజన్ అనే పద్ధతి ద్వారా తీసుకురావచ్చును. ఇందులో పుటలని అధ్యాయాల కింద కూర్చడం వుంటుంది ( ఎంసైక్లోపీడియా అయితే, వ్యాసాలుగా ) ఇందుకు సంబంధించిన వివరలకి చూ. ట్రాంస్క్లూజన్.

    అన్ని పేజీలని ప్రూఫ్ రీడింగ్ చేసి, సరిచూసి, తెచ్చిన తరువాత, పూర్తి కాలేదని చెప్పే టాగ్ లని తీసివేసి పూర్తి అయిన విషయాల జాబితా లో ఆ పుస్తకాన్ని / రచనని చేరుస్తాము.

    ( ఇంకా వుంది )

    ( ఇది 'Help:Introduction to editing Wikisource' అను వ్యాసమునకు అనువాదము గా ఉద్దేశించ బడినది )