సహజ నిరోధకత్వం(Innate immunity):

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
       'సహజ నిరోధకత్వం(Innate immunity): 
       పరిణామక్రమంలో జీవులలో మొదటగా ఏర్పడ్డ రక్షణ వ్యవస్థ(ist line of defence)(1 )
       పుట్టుకతోనే ఏర్పడి సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధించే స్వయంసిద్ధమైన వ్యాధినిరోధక వ్యవస్థ .వ్యక్తులలో జీవిత కాలం కొనసాగుతుంది . వంశపారంపర్యంగా జీవులకు సంక్రమిస్తుంది కూడా(2)
       హానికారక సూక్ష్మజీవుల తాకిడికి వెనువెంటనే స్పందించి వ్యక్తపరిచే మొట్టమొదటి స్వాభావిక చర్య .ఈ చర్యలన్నీ కొన్నిగంటల వ్యవధి లోనే జరుగుతాయి .అనగా తక్షణం జరిగే చర్యలు.
       ఈ వ్యవస్థలో జ్ఞాపకశక్తి లోపించిఉంటుంది(absence of memory).
       స్వాభావిక చర్యలన్నీ నిర్దిష్ట మైనవి కావు(non-specific). అందువలన బాక్టీరియా ,వైరస్ ,ఫంగై , ప్రోటోజోవా వంటి అన్నిరకాల సూక్ష్మజీవుల ప్రవేశాన్నినిరోధిస్తుంది(3).
       2011 వ సo||లో Bruce A.Beutler మరియు Jules A. Hoffmann అను శాస్త్రజ్ఞులు ' స్వాభావిక నిరోధకత్వం యొక్క క్రియా శీలత '(concerning the activation of active 
       immunity) ను గురించిన పరిశోధనలకు గాను వారికి నోబెల్ బహుమతి రావడం జరిగింది(4)
       ఈ నిరోధకత్వం అనేక అవరోధాలసహాయం తో సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది . ఈ అవరోధాలను వరుసగా భౌతిక(physical) , రసాయనిక(chemical),జీవసంబంధ(biological) 
       మరియు కణసంబంధ అవరోధాలుగా(cellular) పరిగణిస్తారు(3)
       ఈ వ్యవస్థ లో పాల్గొనే కణాలు ముఖ్యంగా న్యూట్రోఫిల్స్(neutrophils) ,మోనోసైట్లు(monocytes) ,సహజ కిల్లర్ కణాలు(natural killer cells),  బేసోఫిల్స్(basophils), మాస్ట్ 
       కణాలు(mast cells) 
       అసంక్రామ్య వ్యవస్థ లో భాగమైన ' కాంప్లిమెంట్ ప్రోటీన్స్ '(complement proteins) కూడా స్వాభావిక చర్యలలో పాల్గొంటాయి(5) . ఈ ప్రోటీన్ లు వ్యాధిజనకాలను 'లైసిస్'(lysis) 
       ప్రక్రియకు గురిచేసి నాశనం కావించటం కాని , 
       లేదా మాక్రోఫేజ్ ల సహాయంతో కణ భక్షణంకానీ జరుపుతాయి(6).స్వాభావిక చర్యలలో మాక్రోఫేజ్ లు అతి కీలక పాత్ర వహిస్తాయి .ఇవి బాక్టీరియాల ఉనికిని గుర్తించి , సైటోకైన్ లనబడు 
       ప్రోటీనుల సహాయంతో వాటిని కణభక్షణా నికి గురిచేస్తాయి(7)
       చిన్న పిల్లల లో కూడా ఈ స్వాభావిక అసంక్రామ్య చర్యలు చాలా చక్కగా నిర్వర్తింపబడుతాయి(8)
       స్వాభావిక నిరోధకత్వం యొక్క ముఖ్య విధి : 1.  శరీరాన్ని చేరే వ్యాధికారక జీవరాసుల నాశనం కావించటం 2. ఆర్జిత నిరోధకత్వాన్ని ప్రేరేపించడం(activation of acquired immunity)
       REFERENCES :
       1. astro.org
       2. Innate immunity vs adaptive immunity-'Immunology and Microbiology' : technologynetwork.com
       3. 'Clinical science' by Dr. Mythili Dhimahi , Ist edition,2005-06, pp : 142-144
       4. https : //www.nobelprize.org -prizes
       5. primaryimmune.org
       6. Complement/ Britannica : http://www.britannica.com- science
       7. Innate vs adaptive immunity : Khan Academy.org 
       8. The immune system & primary immunodeficiency : primaryimmune.org                     By Dr.Krishna kumar Vepakomma