Jump to content

సరిపడని సంగతులు/రెండవ యంకము/ఐదవ రంగము

వికీసోర్స్ నుండి

భీమ:-మంచిపని. నాకు మీరుమంచి సహాయము చేసినట్లాయెను. నేనుతక్షణమే శ్రీధరుని ఇంటికిపోయి నన్ను దూషించినను మెడపట్టినూకినను నేను అతనికి సహాయమొనర్తును.

మధుర; - సార్, నేనెంతమంది వకీళ్ళనో సూపించాను. నిన్నుపోలె నెల్లగుణం యారికిలేదు. నేపోయిదుస్తునా?

విద్యా:-పెళ్ళెగారూ! వారేమో నెల్లగుణం,నేనుకొంచెము దుర్మార్గుడను శవము సాగని, నాకించుక అనుమానం కలిగినా నేను తక్షణమే మీకుచెప్పిపంపిస్తాను.మీరు ఝుడ్తీ చేయండి.

మధుర:- ఆడే అబ్బా? నీవుదా యముడుండావయ్యా, దాసన్ అండి. (అనివెడలిపోవును.)

(వాడు పోయిన తరువాత విద్యాలంకాచార్యులు ఒక్కచిటుకు పొడుముపీల్చి భీమసేనరావుని చూచి)

"ఎట్లు"? జ్ఞానముండవలెనండీ జ్ఞానమూ!

(యవనికపడును).

                 ------

సరిపడని సంగతులు

రెండవయంకము - ఐదవ రంగము.

సరిపడని సంగతులు

రెండవయంకము - ఐదవ రంగము.

కాలము-ఉదయము తొమ్మిది ఘంటలు

శ్రీధరుని యిల్లు

(తార, మద్యరగమున శవమును, ప్రక్కన గాంధీ మహాత్ముని పటముపెట్టి పూజచేయుచు పాడుచుండును శ్రీధరుడుకూర్చొని చింతించుచుండును., పాట ముగిసిన పిదప శీధరుని సమీపించి)

తార:- అయ్యా! మీరిట్లు చింతించుచుండిన ప్రయోజన మేమి? మీకు నేను చెప్పవలయునా? ప్రతిదినమును మృత్యుంజయుని ఆరాధించు మీకు నేను ధైర్యము నుపదేశించుటకు శక్తురాలనా? వేడుక రాట్నము వలె ఎడతెగక తిరుగుచుండు చావుపుట్టు వులను నిరొధింప సాధ్యమా? మీరు తెలిసినవారు. అయ్యో! దు:ఖించుచున్నారే. నాకు చెప్పరాదా? ఎందులకట్లు సంకటపడుచున్నారు. కేవలము నశ్వరమగు తల్లిదేహము క్షీణించేనని మీరు ఇట్లు దు:ఖించుచున్నారా? నేనమ్మను, మీసంకటమునకు మఱియొక కారణమేదియో యుండవలెను. నాకు చెప్పగూడదా?

శ్రీధర:- చచ్చినవారికి కాదమ్మా, బ్రతికినవారి,బ్రతుకు తెరవుకొరకే నెను దు:ఖించుచున్నాను.

తార:-నాకొక్కటియు అర్ధముకాదు. నాకొరకు దు:ఖించుచున్నారా?

శ్రీధర:- బిడ్డా! ఈతల్లి నన్నొకనినేకాదు నిన్నుగూడ తనబిడ్డవలె పొషించుచుండెను. అట్టిప్రేమరాశిని మరల నీకెక్కడనుండి కొనితెత్తునమ్మా, ఇదియే నాదు;ఖకారణము. ముందు నేసేవ ఎవరుసేయుదురు. నీకాన్పునకెవరు సాయపడుదురు? దరిద్రుడనే! ఎవరినికొనితెత్తు? నీకస్టములమఱచి నాకు ముదముగూర్చుమాటలు చెప్పుచున్నావే ? ఏ! నేనెంతనిదు:ఖంతును? ఈశ్వరానుగ్రహమువలన నీకు సుఖప్రసఫమయి నీకు నెమ్మది కలిగినపిచప నీవు నాసేవజేయనొప్పుదువు గాని, ఇప్పుడు నీహితమునకై, నెనేమె చేయజాలుదు?

తారా! ఆలోకరక్షకుడే నిన్ను, నన్ను, సర్వులను రక్షించువాడని నాకు తెలియును. ఆదృఢనమ్మకము నాకుగలదు కాని నీసౌఖ్యము నరయట నాకర్తవ్యముగాదా? ఈచింతమాత్రము నన్ను బాధించుచున్నది. తల్లి మరణమునకు దు:ఖింపను. నీకాన్పుకై దు:ఖింపను. ప్రపంచమున బిడ్డలుకన్నతల్లులు ఎందరొ నిను గాపాడుటకు సిద్ధముగానుందురు. అయిన......

తార:-అయిననేమి? మీచింతకు గారణమేమి?

శ్రిధర:- (లేచి ఇటునటు తిరుగును) లేదు చింత, చింతకు కారణములేదు. అదియుగూడ లోకభర్తకు చెందిన కార్యము. అతడే

50

నీకుభర్తంగూర్చి సౌఖ్యము గలుగజేయును. నీవుసుఖ ముగనుందువు.

తార:-(ఇంచుకదు:ఖము నభినయించి గద్గదస్వరముతో) మమ్ములనువిడిచి నాకు సౌఖ్యమా? మీపాదసేవలేని సౌఖ్యము స్వర్గసౌఖ్యమయినను నాకువలదు. అయ్యా! ఒకవేళ మీసేవచేయుటకు నేను యోగ్యురాలనుగాననియా....?

శ్రీధర:-అయ్యో! అయ్యో! ఇటుతగునా? అట్టికల్మషము, అట్టికలత, నను చేరకుండుగాక! అమ్మానీయట్టి సాధ్వీమణి సేవనొందుటకు నాకు పూర్వజన్మపు సుకృత్రముండవలెనమ్మ! నీవు! నీవు! నీప్రాణము, నాసంపద, నాదైర్యము, నాభక్తి, నావైబవము,నీదీక్ష, తారా! నాస్వర్గమేనీవు, తారా! నీవుయౌనశృంగార వతియు....

తార:-ఏమట్లు ఊరకనిలచితిరి?

శ్రీధర:-తారా! యౌవనమిట్టిదియని....

తార:-(వేగముగ) యౌవనము మీపాదధూళిసమము. (సమీపించి హస్తమును స్పృశించును)

శ్రీధర:-(కనువిచ్చి తారను చూచును) తారా! నీవుయౌవనశృంగార వనదేవతవు. అయిన (కోపముతో) ప్రకృతిపాపసమాజమున.....

తార:-అయ్యా! ఇదియా సమయము సమాజపు దుస్ధితులనువర్ణించుటకు? జరుగవలైనకార్యముల చూడవలదా?

శ్రీధర;- తారా! చచ్చినవారికి మార్గముచూపుట మనపనికాదు. బ్రదికినవారికి మార్గముచూపుటయే మనపని. చచ్చినవారి సౌఖ్యము చావులేనట్టి ఆ దేవదేవుడే చూచికొనును. బ్రతికియున్నవారల సౌఖ్యము మనమించుక గమనించిన చాలును. స్వర్గమునందు, కైలాసమునందు, వైకుంఠమునందు, ఆరోగ్యసంఘములకు పట్టణపారిశుద్ధ్య సంఘములకు, భోజనములకు, విందులకు, సౌఖ్యములకు, ఏమియు కొఱతలేదు. ఇచ్చటిప్రజాసౌ

59

ఖ్యముల మనము గాపాడుకొన్నజాలును. చచ్చినవారి శార్ధమునకంటె బ్రతికినవారి సౌఖ్యమునందు శ్రద్దవహించుటయే నిజమైన ధర్మము.

తార:-అయ్యా! ఎండ ఎక్కుచున్నది. నేనేపోయి శెట్టిగారి నడిగి సహాయము చేయమని.....(అనుచుండగా)

లీలావతి ప్రవేశము.

(తార ఒక్కనిముసము ఆశ్చర్యము నభినయించి పిదప తటాలున లీలావతిపాదములపైబడును. శ్రీధరుడు ఏమియుతొచక నిలుచును. లీలావతి తారను సమీపించును. లీలావతి తారను మరల కౌగలించికొని ముద్దిడి)

లీలా:- బిడ్డా! మాయందరికంటే నీవే పరిశుద్ధురాలవు, నీవేపాపముచేయలేదు. ఇప్పుడ ప్రశంసవలదు. జరుగవలసిన కార్యములున్నవి. ముసలితల్లి మరణమునొందిన విషయమునువిని తక్షణమే వచ్చితిని. ఇచ్చటి సందర్భములు నాకు తెలిసినవి. నీవుపడిన బాధలన్నియు తెలిసికొన్నాను. ఇప్పుదు నిరాటంకముగ నీచెంత నిన్ను నాబిడ్డవలె పొషించుటకు సిద్దురాలుగనున్నాను. అది ఇకముందుపని, ప్రస్తుత మీదేహమునకు సంస్కారము చేయవలెను.

తార:-అమ్మా! నాకొరకెంత సాహసముచేసితివి? నీకుకలుగబొవుహింస ఇందుకైనను యొచనచేయక పొతివే? పొమ్ము నిన్ను ప్రార్ధించెదను. నీవింటికి పొమ్ము.

లీలా:-తారా! స్త్రీలందరు దుర్బలులని తలచితివా? ఒక్కనాడైనను తమశక్తిని ఈమగపందలకు తెలియచేయ శక్తులుగాక పొవుదురా?

తార:— అమ్మా! నీ కేల యిట్టిబుద్ధిపు ట్టెను? నీవు సమాజమునకు గొప్పగనున్నావు. నీకుగౌరవముగలదు. వెల లేని పతిభక్తి చే వెలగుచుండు సతీమణివని నిన్ను సకలప్రపంచమును కొనియాడు చున్నది ధర్మపత్నియను బిరుదున కేహానిక లుగునే!

లీల:- ధర్మము లేనిపతి యొక్క సతి, ధర్మపత్ని యెట్లగును? భర్త దగ్గర ధర్మమున్నగదా భార్య ఆధర్మమును పరిపాలింప దొడుగును?

తార:- అమ్మా! దూరమాలోచింపుము. ఊరక ఏలకష్టములకు గురియయ్యెదవు? ఒక నాడు గృహమువిడిచి ఒంటరిగా వీథిని వెళ్లిన దానవుగావు. భర్తను ధిక్కరించిన పిదప నీగతి ఏమగునో ఇంచుక యోచించుము. మగవారి సహాయము లేక మగువలు ఈసంసార సాగరమును తరింపగలరా.

లీల:- తారా! నాకట్టి భయము లేదు. కష్ట మెట్టిదో, దుఃఖము ఎట్టి దో, నిరాధారత్వ మెట్టిదో పరీక్షించియే చూచెదగాక, నిరా ధారత్వమా? ఈ ప్రపంచము , ఆకాశ మధ్యమున పుట్టి చెఁడువ లె తిరుగుచున్న దిసుమా! దీనికి ఆధార మెది? ప్రహ్లాదుడు తండ్రికి ఏమియుత్తరమిచ్చెను. జ్ఞాపకము లేదా?'

తార:— అమ్మా! నీ వెంత చెప్పి నను నామనసునకది యెప్పకున్న ది. సమాజము నీ కొన్ని పేర్లిడునో! ఎందరునిను! వేలు చూపి హసింతురో! యోచించినట్లైల నాకుకళవలము కలుగుచున్నది.

లీల:- తారా! సమాజము సమాజమనుచుంటివి. ఈసమాజపుకట్టు బాట్లను చూచి తప్పకుండ అనుసరించి ఆచరించిన వారికిమాత్ర ము సమాజ మేలాటి సహాయమునొనర్చినది? కష్ట స్థితియందు ఎట్టిసహాయమయినను గలుగునా? ఈ సమాజమునుంచి- “ తెప్ప లుగ చెరువునిండిన గప్పలు పది వేల గదరా సుమతీ” అనివిన లేదా? అంతయే. భాగ్యవంతుల పీనుగను చూచిరా, పరోపకా రబుద్ధి భుజములపై నికే ఎక్కును. నిర్భాగ్యులపీనుగ అయిన చో నా భార్య గర్భిణి. . . . . . తల్లిదండ్రుల - ఆయువు. ..... కోటి శాస్త్రములుకూర్చి తప్పించి కొందురు. ద్రవ్యమునకొక ధర్మ శాస్త్రము. దారిద్ర్యమున కొకధర్మశాస్త్రము. ఇది యేగదా

61

.

దానివలె ప్రకృతసమాజపు నియమము! తారా! కాలము మీరుచున్నది. రమ్ము. నేనును, నీవును, శ్రీధరుడును, ముగ్గురమును ఈశవముసు కొనిపోవుదము.

(అనుచు ఆశవము దగ్గరకుపోయి తలవంచికొని ప్రార్థన చేయు కూర్చొనును.)

(ప్రవేశము-భీమ సేన రావు-విద్యాలంకారాచార్యులు)

భీము:- (లీలావతిని చూచి; నిశ్చేష్టితుడై , ఆగ్రహముతో) ఏమి!?

లీలా:- తలయెత్తి చూచి, మెల్లగ లేచి, స్టేజుముందరి భాగమును చేరి, సైగ చేసి, భీమసేనగావును వద్దకుగమ్మని )'

అరవకుము. ఇదివకీళ్ళు వాదించుస్థలము గాదు, సాక్షులనుభయ పెట్టి వంచిచు స్థలముగాదు. సూర్యచంద్రులను, అష్టది క్పాలకులను, తుదకులోక నాధుడగు శ్రీమహావిష్ణువును సయిత ము జయింపచాలితిమని మదముచే విరవీగుచుండు హిరణ్య కశిపు, రావణాది అసుర శ్రేష్ఠుల కైనను గర్వమునడంచి భయ మను పుట్టి చుస్థలము. మృత్యు దేవతయ ధీన ముసుమా ఈస్థల మిప్పుడు. ఇందు మృత్యుంజయు డొక్కడుమాత్రము. తలయెతి తిరుగుటకు అర్హుడుగాని నీయట్టి వాడు తలవంచి దైన్యముతో గద్గద స్వరము తో మాటలాడవలెను. హెచ్చరిక. నన్నా నీవు పిలిచినది.

భీమ:- నిన్నే

లీల:- నే న చేతన పదార్థముగాదు. నాతలితండులు నాకు పేరిడి నారు. నీకు నన్ను పెండ్లి చేసియిచ్చి నను నాశరీరమును చెడుపుటకు సహాయము చేసిరి గాని నా పేరుమాపుటకుగాదు. నీకధికారము లేదు.

భీమ:- (చెవులు మూసికొని.) నారాయణ! నారాయణ!!

విద్యా:- కృష్ణా! వాసు దేవా!! జ్ఞానముండవ లె, జ్ఞానము.

భీమ: - అయ్యయ్యో! దేశ మెంత చెడిపోయెను! ధర్మమున కెట్టి దుస్థితిగలిగెను! ఈ భారతవర్షమున కెట్టికుందకముగలిగెను! ఎట్టి యపకీర్తి గలిగెను హిందూస్త్రీ లకు.

62

విద్యా:- కలియుగము ముదుగుచువచ్చే. సావిత్రి, చంద్రమతి ఇట్టి పతివ్రతా శిరోమణులు సంచరించిన ఈ పుణ్యభూమి.......

ల: - ఆచార్యుల వారూ! మారీచి, సుబాహు, శకుని, ఇట్టిపుణ్య జనులవతరించిన ఈపుణ్య భూమి . . . . . .

విద్యా:— అమ్మా! బుద్దివ చ్చెను. నీతో ఎవరు మాట్లాడువారు? ఆడుది సాహసించెనా మగ వారు, "మే మేమి చేయుదుము. ముఖ్య ము కలియుగము,

లీ:- ఆచార్యుల వారూ! మీయట్టి వారలుండిన నిక్కముగ నియ్యది కలియుగమే. చూడండి. అదియొక్కటేగాదు. ఇది రోకలియుగము, దేవునికై న దెబ్బేగురువు.

భీమ: – మూయుమునోరు! అధిక ప్రసంగివి. భర్తయధికారము నీకు దెలి యునా? (అనిమాట్లాడుచుండగా)

(మధుర పిళె ఒక వైపు ఉంచి వచ్చును. వెంట మరియొక జవాను వచ్చును. విద్యాలం కారాచార్య , భీమ సేసరావు, ఒక్క చోట చేరుదురు. లీలావతి, తార, ఆశ్చర్యమునభినయింతురు.)

శ్రీధర:- (దిగ్గున లేచి) అయ్యా! మీ రేలవ చ్చితిరిందు?

మధుర – డూటి వుండాది సామీ! ఏమి దా చేసేది సెప్పండీ. నౌకరీ చెడ్డది.

శ్రీధర:— అయ్యా! ఏమి? నీమాటలునాకర్షముగాలేదు.

మధుర:- ఇక్' స్పెక్టరుగారు మిమ్ములను స్టేషక్ కిట్టె పుడుచుకొని రమ్మన్నారు. నీ ఇల్లుదా సోదా చేయవలె.

శ్రీధర: - ఎందులకు?

మధుర:- ఏమిసామి! కొంచెముగూడ తెలియనట్లుమాట్లా తారే! శెట్టిగారింట్లో చందహారము ఎక్కడ పెట్టినారో చెప్పండి?

శ్రీధర:—హర! హర!! హర!!! మృత్యు దేవతా! అవమాన దేవతను గూడా వెంట బెట్టుకొనివచ్చియున్నావా? (అనిఇంచుక యోచించి) అయ్యా! సోదా చేయుటకు నాయటంక మేమియును లేదు, అయిన నిది సమయమా?

63

మధుర:- మేముఏమి దాచేసేది స్వామి? డ్యూటీ డ్యూటీదా. మాఇంటి ఆండ వాండ్లు కాయిలాగవుండారుఅంటె లీవుయిచ్చే లేదు అంటాడు సూ ప్రెంటు, డ్యూటీకి ఎక్కడ స్వామిదయ?

శ్రీధర: – (నవ్వి) నిక్కముగ వచించితిరి పిళ్ళైగారూ. ఇప్పటి రాజ్య ము ఆచార్యులవారి స్వరాజ్యము. నీయాచార్యులవారి ధర్మము నకుభ క్తి లేదు. మీడ్యూటీకిదయ లేదు. కానిండు, మీ కార్యము కానిండు.

అప్పుడు భీమ సేస రావు హెడ్ కానిస్టేబిల్ కు లీలావతిని, తారను, చూపించి సైగ చేయును.)

మధుర:- అమ్మాకొంచెముపోదురు. మీరుబయటదావుఁడవలె. మారూల్సుకు యిరుద్దము. ఇంటిమ జమాని పంచాయితీ వాళ్ళు తప్ప వేరెవ్వరువుండరాదని రూల్సు.

లీల:— ఆచార్యులవా రేలనుండవచ్చు?

మధుర:- వారుదా పంచాయతీ!

లీల: – సరి! ఇప్పుడు సరిపోయినది. పోలీసుదర్బారు. ఆచార్యులగారి రాజ్యము; వైభవమున కేమితక్కువ లేదు.

శ్రీధర:—తల్లీ, లీలావతి దేవీ! బిడ్డా, తారా! మన కేలయధికారుల ,, వాగ్వాదము. మీరుదయ చేసి ఆవలికి పొండు.

(తార, లీలావతియు, వెడలిపోవుదురు . ఆచార్యుల వారు తలకుజుట్టిన శాలువయందు కట్టిన బంగాగపు తునకను కుండలో వేయును. 'హెడ్ కానిస్టేబిల్ వెదకి దానిని తీసికొనును. శ్రీధరుని చేతికి సంకెలలు వేయుదురు.)

శ్రీధర:— రామచంద్రా! ఇదియే నానీధర్మపరిపాలనము? ఇదియే నా నీ మహిమ? నీకుకన్నులున్నవా? లేవా? కానిమ్ము.]

యవనిక పడును.

64

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse