సడిబెట్టె గటకటా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
సడిబెట్టె గటకటా (రాగం: ) (తాళం : )

ప|| సడిబెట్టె గటకటా సంసారము చూడ | జలధిలోపలియీత సంసారము ||

చ|| జమునోరిలో బ్రదుకు సంసారము చూడ | చమురుదీసినదివ్వె సంసారము |
సమయించుబెనుదెవులు సంసారము చూడ | సమరంబులో నునికి సంసారము ||

చ|| సందిగట్టినతాడు సంసారము చూడ | సందికంతలతోవ సంసారము |
చందురునిజీవనము సంసారము చూడ | చంద మేవలెనుండు సంసారము ||

చ|| చలువలోపలివేడి సంసారము చూడ | జలపూతబంగారు సంసారము |
యిలలోన దిరువేంకటేశ నీదాసులకు | చలువలకు గడుచలువ సంసారము ||


saDibeTTe gaTakaTA (Raagam: ) (Taalam: )

pa|| saDibeTTe gaTakaTA saMsAramu cUDa | jaladhilOpaliyIta saMsAramu ||

ca|| jamunOrilO braduku saMsAramu cUDa | camurudIsinadivve saMsAramu |
samayiMcubenudevulu saMsAramu cUDa | samaraMbulO nuniki saMsAramu ||

ca|| saMdigaTTinatADu saMsAramu cUDa | saMdikaMtalatOva saMsAramu |
caMdurunijIvanamu saMsAramu cUDa | caMda mEvalenuMDu saMsAramu ||

ca|| caluvalOpalivEDi saMsAramu cUDa | jalapUtabaMgAru saMsAramu |
yilalOna diruvEMkaTESa nIdAsulaku | caluvalaku gaDucaluva saMsAramu ||


బయటి లింకులు[మార్చు]

అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |