సంపూర్ణ నీతిచంద్రిక/సంజీవకుడు మంత్రియు, గరటక దమనకులు కోశాధికారులు నగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సంజీవకుడు మంత్రియు, గరటక దమనకులు కోశాధికారులు నగుట

సంజీవకుడు విధేయతతో బింగళకునకు సాష్టాంగ వందన మాచరించి "ప్రభుని యాజ్ఞలకు బద్ధుడను" అని పలికెను. పింగళకుడు సంతసించి యావృషభమునకు మంత్రి పద మొసగి గౌరవించెను. నాటినుండియు బింగళక సంజీవకులు కడుంగడు నమ్మకముతో జెలిమి యొనరించుచు సుఖముగా కాలము గడుపుచుండిరి. పింగళకుడు కరటక దమనకులను గోశాధికారులుగా నియమించి గౌరవించెను.