Jump to content

సంపూర్ణ నీతిచంద్రిక/కరటక దమనకుల విషాదము - పన్నుగడ

వికీసోర్స్ నుండి

కరటక దమనకుల విషాదము - పన్నుగడ

అనంతర మీవిషయము లన్నియు గరటక దమనకులకు మిక్కిలి ఖేదము గలిగించెను. దమనకుడు కరటకునితో మిత్రమా! యిపుడు గర్తవ్య మేమి? ఇది స్వయంకృతాపరాధము. స్వయంకృతదోషమునకు విలపించుట కూడ యుక్తముగాదు. తాము చేసికొన్న దోషముచేత నొక రాజకుమారుడు నొకసన్న్యాసియు హాని నొందిరి. నీకా కథలు చెప్పెదను వినుము.