Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎల్గ్రికో

వికీసోర్స్ నుండి

ఎల్గ్రికో (Elgreco) 1548-1614 A.D. :

ఎల్గ్రికో అనువాని మొదటి పేరు 'డొమినికన్ థియొ టొకోపోలస్' అనునదై యుండెను (Domenicos- Theotocopolus). ఆతడు క్రీట్ (Crete) ద్వీపమునందు జన్మించెను. స్పెయిను దేశవాసులు (Spaniards) అతనికి "ఎల్గ్రికో" (గ్రీక్ నివాసి) యని నామకరణము చేసిరి.

ఆతడు బై జంటైను (Byzantine) కళా సంప్రదాయ ప్రభావమునకు పూర్తిగా లోనై యుండెను. పొడవైన దేహములతో నొప్పుచు మెలికెలు నొప్పుచు మెలికెలు తిరిగిన మనుష్యుల చిత్రములే ఆ ఆ విషయమును నిర్ధారణచేయును. యౌవనము నందే ఇతడు ఇటలీ దేశమున ఉత్తమ చిత్రకారుడుగా ప్రకాశించెను. వెనీసు (Venice) నగరములో టిటియను (Titian) అనువాని భావచిత్రము లితనిదృష్టి నాకర్షించెను. మైకెలాం జెలో(Michelangelo) అను ఇటాలియను శిల్పకారుడు తయారుచేసిన శిల్పములు కాలక్రమమున భగ్నములు కాగా, వాటియందలి ఆకృతి విశిష్టతయు, దివ్యత్వమును. ఎల్గ్రికో హృదయము నాకర్షించెను. అతడు వెనీసు నగరములోని ప్రఖ్యాత చిత్రకారుడగు టింటారిటో (Tintorito) అనువాని శిల్పగృహమునందు (Studio) చిత్రకళ నభ్యసించెను.

ఇటలీయందుకంటె ఇతర దేశములలో ఆ కాలమున చిత్రకారులకు పని యెక్కువగా లభించుచుండెడిది గావున ఎల్గ్రికో ఇటలీని వదలి స్పెయినులోని టోలెడో (Toledo) అను నగరమునకు 1576 లో చేరుకొనెను. 16వ శతాబ్దము నందు ఇటలీ యందుకంటే స్పెయినులో మతవిశ్వాసము ప్రబలతరముగా నుండెను. ఎల్గ్రికో యొక్క కళయందు మతావేశమును ఒకరకమైన వివశత్వమును ఉబికివచ్చు చుండును. అతని చిత్రాలను అల్పశ్రేణికి చెందిన ఇటాలియను చిత్రములచే తృప్తిచెందెడి ప్రభువులేగాక అచటి క్రైస్తవ దేవాలయములందలి అధికారులు కూడ కొనివాటియందు ఆదరాభిమానముల చూపిరి,


ఎల్గ్రికో కళలోని అంతర్యము, భావసౌందర్యము అతని సుప్రసిద్ధములైన చిత్రములు కొన్నింటిని జూచిన యర్థము కాగలవు. "సెయింట్ మార్టిను బిచ్చగాడు” (Saint Martin the Beggar) "కౌంటు ఓర్గాజు యొక్క సమాధి" (Burial of Count Orgáz) "టోలేడో పట్టణదృశ్యము" (View of the city of Toledo) “సిలువ నెక్కించుట" (Crucification) అను నవి అతని సుప్రసిద్ధ చిత్రములుగా నెన్న దగియున్నవి. టింటారిటో చిత్రములలోగల భావమారవము అతని చిత్రములలో నధికముగా గోచరించుచుండును. చిత్రములలోని య కృతులను సాగదీసి, రంగులను ప్రమా ణాధికముగా వాడుటచే అతని చిత్రములయందు ఒక తీరుగా ఆధ్యాత్మికత పొడసూపును. ఒక అంతర పరిస్థితిని సృష్టించుటకై, రంగులను, ఆకృతులను ఇచ్చవచ్చినట్లు మార్చుటలో ఎల్దికో అత్యంత సమర్థుడైయుండెను. ఆతని 'టోలెడో' పట్టణ దృశ్యరూపమైన చిత్రమొకటి భావ గాంభీర్యము కలదైయుండి చూపరుల కావేశమును గలిగించును. లౌరే (Loure) మ్యూజియములో నున్న 'నిలువ నెక్కించుట'(crucification) అను అతని చిత్రము ప్రపంచమునందలి ఉత్తమ కళాఖండములలో నొకటిగా పేరొందినది.

ప్రాచీన నగరమైన టోలెడోలో నిప్పటికిని "క్యాసా డెల్ గ్రికో" (Casadel Greco) అను ప్రదేశమునందున్న చర్చియందలి వేదిక పై నతడు వ్రాసిన భిత్తి చిత్రమొకటి "కౌంటు ఓర్గాజ్ సమాధి" అను చిత్రమొకటి (Burial of Count Orgaz) అత్యంత ప్రాశస్త్యము నొందినవి. ఆతని ఉత్తమోత్తమ చిత్రము లన్నియును అనామక న యొక చర్చి యందలి గోడలపై టోలెడో నగరమందు నేటికిని చూడవచ్చును.

ఎక్స్ట్రాకో ఉత్తమ కళాకారుడుగ విఖ్యాతినొందెను. కొంద రీతనిని మతోన్మాది యవసాగిరి. కాని యాతని చిత్రముల ప్రభావము నేటికిని కళాకారులపై ప్రసరించుట గమనింపదగినది.

18 వ శతాబ్ది యందలి ఒత్తిడులను బట్టి వ్రాయబడిన ఆతని చిత్రములలో ఆనాటి రీతి పై లక్షణ్యము గోచరించు చుండును.

కొం.శే