Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎంబ్రాయిస్ పేర్

వికీసోర్స్ నుండి

ఎంబ్రాయిస్ పేర్ (1510-1590):

ఎంబ్రాయిస్ వేర్ శస్త్రచికిత్సయందు పేర్వడసిన మహాప్రవీణులలో నొకడు. ఇతనికి గ్రీకు, లాటిన్ భాషలు రావు. పుస్తకములందుకున్న పరిశీలనమందే ఇతనికిగల నమ్మకము అధికము. ఫ్రాన్సులో వరుసగా నాలుగు వైద్యశాలలలో శస్త్రచికిత్సకు డయ్యెను. లావల్ పట్టణ మితని జన్మస్థానము. పారిస్ వెళ్ళి శస్త్రచికిత్స నభ్యసించి హోటల్ డ్యూ యను ప్రఖ్యాత వైద్యశాలలో మూడు

సంవత్సరములు పనిచేసెను. పిమ్మట సైన్యములో ముప్పది సంవత్సరముల దీర్ఘకాలము కొలువు చేసెను. వృద్ధుడైన పిమ్మట తన అనుభవములను స్వీయచరిత్ర రూపమున లోకమున కందించెను. శస్త్రచికిత్సలో ఇతడు కృషి చేసినది ఒక తుపాకిగుండు దెబ్బలనుగూర్చి మాత్రమే కాదు. ఎముక విరుగుట, స్థానము తప్పుట మొదలగు చిక్కులకు చేయవలసిన చికిత్సను వివరముగా చర్చించెను. హెర్నియా శస్త్రచికిత్సలో వృషణములను తీసివేయు విధానమును ఇతడు రద్దుచేసెను. అతడు సెగవ్యాధివలన రక్తవాహికలు పెద్దవగునని సూచించెను. ధమనీ పటకారును (అర్టెరీ ఫోర్ సెపు), ఇతర సాధనములను కనుగొనెను. చరిత్రలో ఖ్యాతికెక్కిన శస్త్రకళానిధులందు ఎంబ్రాయిస్ వేర్ కు ఉన్నతస్థానము గలదు.

డా. ఎస్. వే.