Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఋజువిద్యుత్ప్రవాహము - వికల్ప విద్యుత్ప్రవాహము

వికీసోర్స్ నుండి

ఋజు విద్యుత్ప్రవాహము - వికల్ప విద్యుత్ప్రవాహము :

'విద్యుత్తు అన నేమి?' అందరును ఆ ప్రశ్న వేయుదురు. కాని ఎవ్వరు నింకను దానికి పూర్తి సమాధానము చెప్పలేరు. దాని సూత్రములు చాలవరకు బాగుగా బోధపడినవి కానీ దాని సంపూర్ణ స్వభావము బోధపడలేదు.

ఆధునిక వైజ్ఞానికులకు ప్రస్తుతము విద్యుత్తును గూర్చి సామాన్యముగా గల యభిప్రాయమును చదువరులకు స్థూలముగ దెలియజేయవలెనను ఉద్దేశముతో విద్యుదణు సిద్ధాంతము సంగ్రహముగా నీ దిగువ నియబడినది. ఈ సిద్ధాంతము లేకుండ విద్యుద్ఘాటములు, తాపాయనిక గొట్టములు (thermioic tubes) మొదలగునవి పనిచేయుటను గూర్చి బుద్ధిసమ్మతముగ వ్యాఖ్యానము చేయుట దుస్సాధ్యమగుటచే నీ సిద్ధాంతము నా మోదించక తప్పదు.

నేటి ప్రపంచమునందున్న వస్తువుల సంఖ్య అత్యధికమైనది. ఈ వివిధవస్తువులు సా పేడముగా స్వల్ప సంఖ్యలో నుస్న రాసాయనిక మూలద్రవ్యముల వివిధ సంయోగ ఫలితములు. అయినప్పటికీ మూల ద్రవ్యములు మాత్రము ధనవిద్యుత్కణములు (protons), ఋణ విద్యుత్కణములు (Electrons) అను నొకమాదిరి ఘటకములచే నేర్పడియున్నవి. రెండు ఘటకముల కంటే నెక్కువ యున్నవని సూచించుచు' పరిశోధనా నిదర్శనములున్నను, మూల ద్రవ్యము యొక్క విద్యుద్ధర్మములును, రాసాయనిక ధర్మములును పూర్తిగ దాని ధన ఋణ విద్యుత్కణములే నిర్ణయించుటచే విద్యుత్ స్వభావమును దెలిసికొనుటకు తక్కిన ఘటకములు వదలివేయబడినవి. ధనవిద్యుత్తునకు

సహజమగు నాది భౌతిక ప్రమాణము ధనవిద్యుత్కణము (proton) అనియు, ఋణ విద్యుత్తునకు సహజమగు ఆది భౌతిక ప్రమాణము ఋణ విద్యుత్కణము (Electron) అనియు నిర్వచింపబడినవి. పైకి ఖాళీగానగపడు స్థలములో ధనవిద్యుత్కణములు పరస్పరముగా నౌకదాని నొకటి వికర్షించుకొనుచుండును. ఋణవిద్యుత్కణములు గూడ నట్లే చేయును. కాని ధనవిద్యుత్కణములకును, ఋణ విద్యుత్కణములకును నాకర్షణ ముండును. ఈ ఆకర్షణ వికర్షణ రూపములే సర్వరసాయన విద్యుత్క్రియలకును మూలము. ధన ఋణ విద్యుత్కణముల సంఖ్య సమానముగా లేని వస్తువు "విద్యుత్ ప్రభారము నొందినది" (electrically charged) అనబడును. ఒక వస్తువులో ప్రామాణిక సంఖ్య కంటే నెక్కువ ఋణవిద్యుత్కణము లున్నచో నది ఋణాత్మక విద్యుత్తును ప్రామాణిక సంఖ్య కంటె తక్కువ ఋణ విద్యుత్కణములున్నచో ధనాత్మక విద్యుత్తును కలిగియున్నదనబడును. ఆచరణములో సర్వ సాధారణముగా ఋణ విద్యుత్కణముల నెక్కువ చేసిసపుడు గాని, తగ్గించినపుడు గాని విద్యుత్ ప్రభారము కలుగును. ఒక ధన విద్యుత్కణము మరియొక ధన విద్యుత్కణమును వికర్షించి, ఋణ విద్యుత్కణము నాకర్షించునట్లే సజాతీయము లగు విద్యుత్తులు వికర్షించుకొనుచు విజాతీయములగు విద్యుత్తులు ఆకర్షించుకొనుచుండును.

మూలద్రవ్యమున సూక్ష్మతమ కణమగు పరమాణువు ఆ పరమాణు లక్షణమును నిలుపుకొనవలయు నన్నచో తనలోని యొక ఋణ విద్యుత్కణమును (electron) బోగొట్టుకొనవచ్చును గాని, ఒక ధనవిద్యుత్కణమును (proton) బోగొట్టుకొనరాదు. ధన విద్యుత్కణము లన్నియు పరమాణు కేంద్రమందుండును. ధన విద్యుదాశ్మక మగు కేంద్రము ఆకర్షణముతో లాగుట చేతను, విద్యుత్కణములలో వానిలో వానికిగల వికర్షణముచేతను, కేంద్రమునకు దూరముగా నున్న ఋణవిద్యుత్కణములకును మిగిలిన పరమాణుభాగమునకును పొత్తు తక్కువగా నుండును. ఒక ఘనవాహకములో సామాన్య ఉష్ణోగ్రతల యందు నీ ఋణవిద్యుత్కణములు వేరుపడి ఆ ఘనపదార్థములో స్వేచ్ఛగా దిరుగుచుండుటచే నది అంత ప్రకాశించు

చుండును. బంధరహితములగు ఋణవిద్యుత్కణములు ఇంచుమించు అన్ని దిక్కులకు దిరుగుచు చాలవరకు తడిలేని యావరణమం దున్న వాయుకణములవలె ప్రవర్తించును. ఒక ద్వారమును, ఒక గవాక్షమును తెరచియుండి, ఈ రెండింటియందును గల వాతావరణ పీడనములో భేదమున్నచో స్వేచ్ఛాచలనములలో నున్న ఆ వాయుకణములపై నిశ్చితమార్గ మొకటి యదనముగా పడును. దీనినే మనము ‘వాయు ప్రవాహము' అనుచున్నాము. అదేవిధముగా, విద్యుద్వాహకము యొక్క రెండుకొనల మధ్యను విద్యుత్పీడనములో భేదమున్న చోగాని, శక్మ భేదమున్నచో గానీ వాహకముపొడుగునను ఋణ విద్యుక్షణచలన మేర్ప

డును. అట్టి ఋణవిద్యుత్కణచలనమే 'విద్యుత్ప్రవాహ'మనబడును. ఈ విధముగా చలనమందున్న ఋణవిద్యుతృణప్రవాహముచే విద్యుత్ప్రవాహ మేర్పడుచున్నది. ఈ ఋణవిద్యుత్కణములు కర్యపై నొకేదిక్కుగా పోవుటయే ఋజువిద్యుత్ప్రవాహమగును. ఆ తీగలో గాని వాహకములో గాని వికల్ప విద్యుత్ప్రవాహమొకటి ప్రవ హించుచున్నచో ఋణవిద్యున్నణముల కవ్యాచలనము ఒక ప్రత్యేకదిశలోనే యుండుటకు బదులు ముందునకు జరుగును.

వోల్టాఘటమునావిష్కరించుటకు పూర్వము విద్యుత్ ప్రభారములను, విద్యుత్ ప్రవాహములను ఉత్పత్తిచేయు టకు రాపిడిపద్ధతి ఒక్కటే తెలిసిన మార్గము.ఈ పద్ధతిలో రాపిడివలన ఒక వస్తువునుండి ఋణ విద్యుత్కణములు విడుదల చేయబడి, ఆ వస్తువు ధనాత్మక ప్రభారమును, విడుదలచేయబడిన (అవి అధికముగనున్నవి కాబట్టి) ఋణవిద్యుత్కణములుపోయి చేరిన రెండవవస్తువు ఋణాత్మక ప్రభారమును పొందును. ఆ కాలములో నిర్మితము లైన ఒరవీడి యంత్రములు ఎక్కువ చరిత్రాత్మకముగ ప్రధానములైనవి. చలన విద్యుత్తునుండి విద్యుత్ప్రవాహముల నుత్పత్తి చేయవచ్చుననెడి యావిష్కరణము ఈ విషయాభివృద్ధిలో నొక గొప్పమెట్టు. ఈ ప్రయోజన సిద్ధికై ఘటము యొక్క ఆవిష్కరణము మొట్టమొదటి ప్రయత్నము. రాసాయనిక క్రియవలన విద్యుత్పీడనముల మధ్య భేదము (potential difference) ను

ఏర్పరచినచో ఋణవిద్యుత్కణముల ప్రవాహమేర్పడును. ఇదియే ప్రవాహవిద్యుత్తు.

ఒక వాహకముగుండ విద్యుత్తు ప్రహించుచున్నప్పుడు ఆ వాహకము యొక్క పరసణవుల మధ్యను, వాని లోపలనుండియు ఋణవిద్యుత్కణములు ప్రవహించును. ఋణవిద్యుత్కణము అత్యధికముగ బ్రవహించుచున్న చో పెద్ద ప్రవాహమనియు, స్వల్పముగ చలనమందున్నచో చిన్న ప్రవాహమనియు అందుము. విద్యుత్ప్రవాహము యొక్క మూల ప్రమాణము 'ద్యువహి' (Ampere ఆంపియర్) యనబడును. దూరము మైళ్ళలో నెట్లు గణింపబడునో, అట్లే విద్యుత్ప్రవాహము ద్యువహులలో గణింపబడును. విద్యుత్ప్రవాహమును కొలుచుయంత్రము ‘ద్యువహిమాపకము' (Ammeter) అనబడును. ప్రకృతిలో నెచట సుగూడ శక్తి ప్రేరణము లేనిదే చలనము కలుగజాలదు. విద్యుత్ప్రవాహము నొక వలయముగుండ పంపు శక్తి 'విద్యుచ్చాలకశక్తి' (Electro - motive - Force.సంగ్రహముగా ఇ. ఎమ్. ఎఫ్.) అనబడును. దీనికి 'ద్యుకక్మక' (voltage) యని మరియొక పేరు. విద్యుత్పీడనము యొక్క మూల ప్రమాణము 'ద్యుశక్మము' (వోల్టు) అనబడును.

ఒకటి లేక రెండు ద్యుశక్మముల విద్యుద్ఘాటములు మొదలుకొని అత్యధిక ద్యుశక్మ లుపయోగించు ప్రేషణ పంక్తులలో గల 250,000 ద్యుశక్మముల వరకు అన్ని విలువలలో ద్యుశక్మతలు గలవు. 110 ద్యుశక్మములకంటె నెక్కు వగల వలయముల నుపయోగించుట ప్రమాదకరమని తలచవలయును. విద్యుత్పీడనముగాని ద్యుశక్మతగాని కొలుచుటకు వాడబడు పరికరము 'ద్యుశక్మమాపకము' (voltmeter) అనబడును.

ప్రవాహ ప్రసారమునకు కలుగు అవరోధము'నిరోధము(resistence) అనబడును. ఈధర్మము నాధారముగా జేసికొనివిద్యుత్ అభియంత్రణముననుపయోగించు వస్తువులన్నియు విసంవాహకములు (Insulators) అనియు, వాహకములు(Conductors) అనియు, నిరోధకములు(Resistors) అనియు వర్గీకరింపబడినవి. విసంవాహకము అత్యధికమగు నిరోధము నిచ్చును, అది విద్యుత్పవాహము నొక నియమితమార్గమున నుంచుట కుపయోగించును. వాహకము తారతమ్యరీత్యా చాల తక్కువ నిరోధము నిచ్చును. అది విద్యుత్ప్రవాహమునకు త్రోవ నిచ్చుట కుపయోగించును. విద్యుత్పరివాహమును అదుపులో నుంచుటకుగాని, విద్యుత్ పరితాపని (Electric stoves) లో వలె విద్యుచ్ఛక్తిని ఉష్ణశక్తిగా మార్చుటకు గాని నిరోధకము విద్యుత్ప్రవాహ మార్గమును అవరోధించుటకు ఉపయోగించును. నిరోధకముయొక్క మూల ప్రమాణము 'ద్యురోధము' (ఓహ్మ) అనబడును. 'ఒక వలయము యొక్క ద్యుశక్మతను ఆ వలయములోగల నిరోధముచే భాగించినచో ఆ వలయమందున్న ప్రవాహము వచ్చును' అను నత్యంత ప్రధానమగు విద్యుత్ సూత్రము నేర్పరచిన జార్జి సైమన్ ఓహ్ అను నాతనినిబట్టి దానికా పేరు కలిగెను. ప్రవాహము యొక్క యు, ద్యుశక్మత యొక్కయు విలువలు తెలిసినచో నీ సూత్రము నుపయోగించి నిరోధము లెక్క చేయబడును. అయినను, ఒక వలయమందున్న నిరోధమును తిన్నగా కొలచుటకు చాల తరచుగా 'ద్యురోధనమాపకము' (Ohmmeter) ఉపయోగింపబడుచుండును.

విద్యుత్ప్రవాహము యొక్క అత్యంత ముఖ్యధర్మము లేవనగా——

(ఎ) విద్యుత్తు యొక్క ప్రవాహ మొక రసాయన క్రియకు కారణముగాగాని, అనుకూలముగాగాని యుండ వచ్చును. విద్యుత్ప్రవాహముయొక్క విద్యుద్రసాయన ధర్మములనుండి విద్యుత్ లేవనము (electro-plating), విద్యుత్ సంస్కరణము(electrolytic-refining), ప్రద్రావణము (smelting), విద్యుర్ఘట పరిశ్రమ, వివిధములగు సంక్లిష్ట (Synthetic) ఉత్పాదనములను తయారుచేయుట మున్నగు విద్యుద్రసాయన పరిశ్రమలు బయలుదేరెను.

వొల్లా ఘలము భజనప సలామా, చేయవలసిన వస్తువు. చవిందు విద్యున్నిరోధకము విద్యున్నలొమా పటము జయ ముఖో కోడిన విదుత్తు ప్రవహించు పట్లు చేయు భజతపురేకు

(బి) విద్యుత్ప్రవాహము ఏవస్తువుగుండాపోవుచున్నను ఆ వస్తువున కది సాధారణముగా వేడిమినిచ్చును. విద్యు త్ప్రవాహము యొక్క తాపనధర్మములు తాపనులు (stoves), జలతాపకములు (water-heaters) వంటి అనేక విధములగు తాపనోపకరణములకును, అతుకుట యందును (welding), పదునుచేయుట(tempering) యందును, విద్యుద్దీపములు మొదలగువానికిని ఉపయోగపడుచున్నవి.

(సి) విద్యుత్ప్రవాహము ఆయస్కాంత క్షేత్రమును కలుగ జేయును. విద్యుత్ప్రవాహము యొక్క ఆయస్కాంత ధర్మములే శక్త్యుత్పాదక విధానముల యందు యంత్రశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చుటకును, మోటారులలో, విద్యుచ్ఛక్తి కావలసిన చోటునకు పంపబడిన తరువాత, దానిని తిరిగి యంత్రశక్తిగా మార్చుటకును మన పెద్ద పెద్ద విద్యున్నిర్మాణములలో నుపయోగింపబడుచున్నవి. ఈ విధముగా విద్యుత్ప్రవాహము పట్టా, లేక త్రాడువలన గలుగు చాలకముచేయు పనినే చేయును. రజ్జు చాలకములచే లాభసాటిగా శక్తిని కొద్దివందలయడు గుల దూరమువరకే పంపుటకు వీలగును. విద్యుత్ప్రవాహములచే లాభసాటిగా శక్తిని వందలకొలది మైళ్ళ దూరము పంపుటకు వీలుకలిగినది. స్వల్పమారములకై నను అదుపులో నుంచుటకు దానికిగల విశేషడుగు ఆనుకూల్యమును బట్టిగాని, స్థలానుకూలమును బట్టిగాని విద్యుత్ చాలక మే తరచు శ్రేష్ఠమైనది. ఋజు రెండురకములగు విద్యుత్ ప్రవాహములకును ముఖ్యమగు భేదము అని ప్రవహించు పద్ధతిలో గలదు. విద్యుత్ప్రవాహము ఒకేదికలో, సామాన్యముగా స్థిరమైన విలువతో (steady value) బ్రవహించును. వికల్పవిద్యు త్ప్రవాహము మొదట నొకదిశలోను, తరువాత రెండవ దిశలోను సమానవిరామములలో తారుమారగుచు రెండు వైపులను ఒకే విలువలను (values) పొందుచు ప్రవహించును. ప్రవాహము ఒక వైపునుండి, వెనుకకు మరలుట కదిమొదట 'సున్న' విలువకు క్షీణించి, తరువాత రెండవ దిక్కులో నత్యధికమగు విలువను వృద్ధిచేసికొనును. తరువాత మరల 'సున్న' విలువకు క్షీణించును. ఈ తారుమారు లొకదాని వెనుక నొకటి అతి వేగముగా తటస్థించును. సర్వసామాన్యముగా నుపయోగింపబడుచున్న వలయముల యందు సెకనుకు 100 వికల్పములు (Alternations) తటస్థించును. రెండు వికల్పములు ఒక "సంహారము” (“సైకిలు') అనబడును. అందుచే ఆవలయమునకు 'సెకను1850 సంహారముల తరచుదసము (Frequency) గలదు' అని చెప్పబడును. ఈ రెండు రకముల ప్రవాహములకు గల ధర్మము లొక టేయైనము, అవి వలయములో ప్రవహించుచున్నప్పుడు వేరువేరుగా ప్రవర్తించుచు పేరు వేరు ఫలితముల నిచ్చును.

ఈవిధముగా విద్యుత్ ప్రభారమును (Battery charging) కలుగ జేయుట, విద్యుత్ లేపనము (Electro-plating) చేయుట మొదలగు పెక్కు రసాయన ప్రక్రియలకు ఋజువిద్యుత్ప్రవాహము మాత్రమే ఉపయోగించుటకు వీలగును. ఎందుచేతననగా, వికల్ప విద్యుత్ప్రవాహము రెండువైపులను సమాన పరిమాణములలో ప్రవహించునపుడు ఒక దిశలో నుత్పత్తియైన రసాయన ఫలితములు వ్యతిరేక దిశలో నుత్పత్తియైన వానితో తటస్థీకరణము నొందును (neutralized). తాపనప్రయోజనముల కొరకెట్టి భేదమును లేదు. వికల్ప విద్యుత్ప్రవాహము యొక్క విలువ విడువకుండ హెచ్చుచు, తగ్గుచు నున్నప్పటికిని, ఆ ప్రవాహపుదిక్కు విడువకుండ తారుమారగుచున్న స్పటికినీ, అది ఋజువిద్యుత్ప్రవాహ మిచ్చిన సరాసరి యుద్ధమునే యిచ్చును. యథార్థమునకు, వికల్ప విద్యుత్ప్రవాహము యొక్క ఒక ద్యువహి (ampere) యనగా, ఋజువిద్యుత్ప్రవాహముయొక్క ఒక ద్యువహి ఎట్టి పరిస్థితులలో ఎంత ఉష్ణమునిచ్చునో అదే పరిస్థితులలో అంతటి ఉష్ణము నిచ్చు ప్రమాణముగా నిర్వచింపబడినది. విద్యుత్ప్రవాహమును వహించుచున్న వాహకము చుట్టును అయస్కాంత క్షత్రమేర్పడును. అది అయస్కాంత శక్తి రేఖలచే వీళదనుగును. విడిగా, స్వేచ్ఛగా నున్న ఒక అయస్కాంత ధ్రువమును ఆడేత్రములో నుంచిన అప్పుడది విద్యుత్ ప్రవాహముగల ఆ వాహకము చుట్టును ఆగకుండ తిరుగునని ఆశ క్తి రేఖలు సూచించును. ఋజువిద్యుత్ప్రవాహము వలన నేర్పడిన క్షేత్రము స్థిరమైన విలువతో మార్పు చెందక యుండును. దీనికి భేదముగా, వికల్ప విద్యుత్ప్రవాహమువలన నేర్పడిన క్షేత్రమున తడపతడవకు ప్రవాహము హెచ్చుచు, తగ్గుచున్నప్పుడు అయస్కాంత శక్తిరేఖలు తీగచుట్టునుండి విస్తృతమగుచు, మరల దాని యొద్దకు సంకుచితమగుచు హెచ్చుచు,తగ్గుచునుండును. ప్రవాహమును వహించు వాహకము తీగచుట్ట రూపమున నున్నచో శక్తి రేఖల రాకపోకలలో నవి తీగచుట్టయొక్క మలుపుల మీదుగా కోసికొని దానిలో నా పంక్తికి ఎదురు దిక్కుగా ద్యుశక్మతను (voltage) ప్రేరేపించును. ఈ ప్రేరేపిత ద్యుశక్మత 'తిరోగత' విద్యుచ్చాలక శక్తి. ('Back' electromotive force) అనబడును. అదే సమయమున, మరియొక వాహకముగాని, తీగచుట్ట గాని మొదటిదానిదగ్గర నుంచినచో దానిలో ద్యుశ క్మత ప్రేరేపింపబడి కొనలయం దగపడును. దానిని ఇష్టానుసార సుపయోగించవచ్చును. దీని నెదుర్కొనుటకు పంక్తి ద్యుశక్మత ఏదియు లేకపోవుటచే నిది తిరోగత విద్యుచ్చాలక శ క్తి యనబడదుకాని అప్రధాన విద్యుచ్ఛాలక శక్తి యనబడును. ఇవి విద్యుదయస్కాంత ప్రేరేపణము యొక్క సూత్రములు. ఇటీవల జరిగిన యభివృద్ధి, పరి వర్తనయంత్రము, విద్యుదభియంత్రణమున కలిగిన యభ్యుదయము చాలవరకు ఆ సూత్రములపై ఆధారపడి యున్నవి, అయస్కాంత క్షేత్రముల ప్రవర్తనములో చాల వ్యత్యాసము లుండుటచే చాలరకములు ఋజు విద్యుత్ ప్రవాహయంత్రములను వికల్ప విద్యుత్ ప్రవాహము పై నుపయోగించుటకుగాని, ఈయంత్రము లను ఆ ప్రవాహము పై నుపయోగించుటకుగాని వీలులేదు. అందుచే, మోటారులయందును, విద్యుదయ స్కాంతముల యందును, అవి నడచుటకు అయస్కాంత క్షేత్రముల నుపయోగించు అన్ని సాధనముల యందును ద్యుశక్మత (Voltage) యే గాక, ఏరకము ప్రవాహమోకూడ బహుబాగ్రత్తతో పరిశీలించవలసి యున్నది. విద్యుచ్ఛక్తితోనడచు రసాయన పరికరములకుగూడ నీసూత్రమే వర్తించును. కాని, ఉష్ణము కొర కుపయోగించు నన్ని విద్యుత్సాధనములకును వికల్ప విద్యుత్ ప్రవాహము, ఋజువిద్యుత్ ప్రవాహము రెండును పనిచేయును.

విద్యుచ్ఛక్తి విషయమున నింతవరకుజరిగిన మహత్తమమైన ఆవిష్కరణములేవనగా నుత్పాదక యంత్రములో జరుగునట్లు యంత్రశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చుసూత్రములు, పద్ధతులు. కల్పనకు అతిక్లిష్టమగు సూత్రములు అవసరమైనను ఈ యంత్రము లు వా స్తవముగా నిర్మాణము నందును, నడుపుటయందును మిగుల సులభమైనవి. ఉత్పాదక యంత్రమును నడుపుటకు కావలసిన యంత్రశక్తి నుత్పత్తిచేయు పరిభ్రమణచలనము వెచ్చటినుండి యైనను కలిగించునవకాశమున్నచో దానిని విద్యుచ్ఛక్తిగా మార్చ వచ్చును. ఒక అయస్కాంత క్షేత్రము యొక్క రేఖలను వానిమీదుగా వాహకములను పంపి ఖండించుటవలన కలిగిన విద్యుదయస్కాంత ప్రేరేపణ మను విధానమూలమున ఉత్పాదక యంత్రము విద్యుచ్చాలకశక్తి నుశ్పత్తిచేయును. వాహకములలో నేర్పడిన ఈ ప్రేరేపిత విద్యుచ్చాలకశక్తి ఒక దీపసమూహమువంటి సంసృతవలయముపై నుపయోగించినపుడు విద్యుత్ప్రవాహము ప్రసరించునట్లు చేయును. విస్తారమగు ప్రమాణములో కావలసినపుడు ఈ విధముగా విద్యుచ్ఛక్తి నుత్పత్తిచేయుటయే లాభకరమైన పద్ధతి. చాల చిన్నవిగానుండు ఉత్పాదక యంత్రములలో క్షేత్రధ్రువములుగా శాశ్వతాయస్కాంతము లుపయోగింపబడుచున్నవి. తక్కిన యంత్రములన్నిటికి విద్యుదయస్కాంతములు సరఫరాచేయబడుచున్నవి. ఉత్పాదక యంత్రము తానే ఈ ఉద్రేకపు ప్రవాహము'ను సరఫరా చేయుచున్నచో నది 'స్వోద్రిక్తము' (Self-excited) అనబడును. అది బయటనున్న వేరొక స్థానమునుండి సరఫరాచేయబడినచో ఆ యంత్రము 'పరోద్రిక్తము' అనబడును. విడిగా నుద్రేకము కలిగించవలెనన్నచో విడిగా ఋజువిద్యుత్ప్రవాహమునిచ్చు మూలస్థానముండవలెను. అందుచే దానికి సాధారణముగా స్వోద్రేకమును కలిగించుటకంటె నెక్కువ ఖర్చు అగును. ఈ కారణముచే సాధారణముగా స్వోద్రేకము తద్దృష్ట్యా తృప్తికరముగా నుండని పరిస్థితులలో దానినుపయోగింతురు. విడిగా కలిగిన ఉద్రేకము క్షేత్రవలయములో కలిగినమార్పులకు తొందరగను, నిశ్చితముగను సంకోచముల నిచ్చును. అందుచేత నది నిరోధమునకు తొందరగను, నిశ్చితముగను సంకోచము ముఖ్యముగా కావలసినచోట నుపయోగపడును. ఉత్పాదక యంత్రము యొక్క ద్యుశక్మతలను (Voltage) వ్యత్యాసముగా నుంచుటకొరకు కవచవాహకములు (armature conductors) కోయుచున్న రేఖల యొక్క సంఖ్యను అదుపులో నుంచు సాధన మేదైన నేర్పాటుచేయవలెను. రేఖలను ఛేదించు వేగ మెక్కువయినచో ద్యుశక్మత హెచ్చుచుండును. ఆ వేగము తక్కువయినచో ద్యుశక్మత తగ్గుచుండును. స్వల్ప పరిమితులలో ముత్పాదక యంత్రము యొక్క వేగమును మార్చుటకు వీలగును. దాని వలన ఛేదన వేగమును, దానినుండి. ద్యుశక్మతను మార్చవచ్చును. వేగమును మార్చుట కష్టమైనపనియగుటచే షేత్రవలయము నందు నిరోధము నుంచుట ఎక్కువ అనుకూలమును, ఎక్కువ ఫలదాయకమును నగు ఉపాయము. దానివలన క్షేత్రము యొక్క తీగచుట్టలలో ప్రవహించు విద్యుత్ ప్రవాహపరిమాణము హెచ్చుటగాని, తగ్గుటగానీ జరుగుచు ఛేదిత రేఖల సంఖ్య దాని కనుగుణముగా మారుచుండును.

ఋజువిద్యుత్ప్రవాహము గల మోటారులును, అదే మాదిరి ఉద్రేక ముతోఋజువిద్యుత్ప్రవాహము గల ఉత్పాదక యంత్రమును మూలసూత్రములలో నొకేమాదిరిగా నుండును. ఉత్పాదక యంత్రము (దీనిని ఒక్కొక్కపుడు 'డైనమో' యందురు.) యొక్క నిర్మాణ మేసూత్రములపై నాధారపడియున్నదో, మోటారు యొక్క నిర్మాణము గూడ నా సూత్రములపైననే యాధారపడియుండును. ఏదైన భేదమున్నచో ఆవరణయం దుండును. విద్యుత్ ఉత్పాదక స్థావరములు మొదలగు ఆదర్శ నిర్మాణములలో నుంచబడిన ఉత్పాదక యంత్రము వివృత నిర్మాణమును గలిగియుండవచ్చును. అందుచే నన్ని భాగములను సులభముగా, స్వేచ్ఛగా తాకవచ్చును. కాని మోటారు చాల క్లిష్ట పరిస్థితులలో ననగా ఆరుబయటను, బొగ్గు ప్రదేశములందును, రసాయన కర్మాగారముల యందును మొదలగుచోట్ల పనిచేయవలసియుండును. అందుచే నట్టి పరిస్థితులలో పనిచేయు మోటారునకు రక్షణము నిచ్చు ఆవరణము ఉండవలసివచ్చును. ఈ ఆవరణముచే ముఖ్యము లగు అస్కాంత, విద్యుచ్భాగములు పూర్తిగా కప్పివేయబడియుండవచ్చును. యంత్రములను నడుపుటకు కల్పింపబడిన సాధనములలో మోటారు అన్నిటి కంటే తృప్తికరమైనది. ఎందుచేత ననగా దానిని సులభముగను, భద్రము గను సాంకేతిక జ్ఞానములేనివారుగూడ నడపవచ్చును. దానికగు ఖర్చు తక్కువ. అది ప్రయోజన కరమైనది. దాని వేగమును కావలసినట్లు సరిచేసికొన వచ్చును. కావలసిన పరిమాణములో దానిని తయారుచేయవచ్చును. ఒక వాహకము గుండా విద్యుత వాహము పోవుచు అది అయస్కాంత క్షేత్రములో నున్నపుడు, ఆ వాహకమును ప్రవాహముపోవు దిక్కునకును, అయస్కాంత రేఖలకును లంబముగా కదలింపజేయుళశక్తి యొకటి దానిపై పనిచేయును. ఈ మూలసూత్రముపై మోటారుయంత్ర పరికర్మము ఆధారపడియున్నది. క్షేత్రము స్థాపింపబడిన పద్ధతినిబట్టి మోటారులు స్థూలముగా మూడు రకములుగా నుండును.

(1) పార్శ్వాయనచాలకము (మోటారు) (Shunt motor) దీని యొక్క క్షేత్రపరిపథము పార్శ్వాయనముగా గాని సమాంతముగాగాని సంవాహకి (armature) తో ముఖ్య శక్తి స్థానముల మీదుగా కలుపబడియుండుటచే దానికా పేరు కలిగినది. అది పార్శ్వాయన ఉత్పాదక యంత్రము (shunt generator) వంటి యంత్రమే. పార్శ్వాయన మోటారు యొక్క వేగము బరువుతో స్వల్పముగనే మారుటచే దానిని స్థిరవేగచాలకము అని అందురు. యంత్ర పరికరములు, ఉదంచములు (Pumps) సంపీడకములు (compressors) చాలన మొనర్చుటకును బరువుతోగూడి సుమారుగా స్థిరనేగము కావలసిన అన్ని రకముల పారిశ్రామిక రూపములకును వాటిని ఉపయోగించవచ్చును. అయినను, తగిన అదుపులో నుంచు నిరోధము లమర్చినపుడు అది పెద్ద ప్రమాణములపై వేగమును చక్కగా అదుపులో నుంచగలదు. పార్శ్వాయనచాలకము యొక్క ముఖ్యమైన వినియోగము ఈ విషయమున గలదు.

(2) మాలాచాలకము (Series motor) క్షెత్రకుంచీయనము (field winding) తో ముఖ్య శక్తిస్థానములకు కలుపబడి యుండును. ఆ కుంచీయనము స్యందము (flux) నుత్పత్తిచేయును. అనగా సంవాహకి (armature) తో మాల నుత్పత్తిచేయును. భారప్రవాహమే క్షేత్ర ప్రవాహము కూడనగుటచే, ప్రయోగింపబడిన ద్యుశక్మత(voltage) స్థిరముగా నున్నపుడు క్షేత్ర ఉద్రేకము బరువునుబట్టి మార్పుచెందుచుండును. బరువు తేలికగానున్నపుడు వేగము అపాయకరమగునంత హెచ్చుగా నుండును.ఈ కారణముచేతనే మాలాచాలకమును తిన్నగా భారమునకు కలిపి యుంచుటగాని, పండ్లచక్రముతో కలిపియుంచుటగాని ఎల్లప్పుడును చేయవలెను. పట్టాతో మాత్రము కలుపరాదు. పట్టా జారిపోవుటగాని, తెగిపోవుటగాని తటస్థించి, చాలక్షము పలాయన మొనర్చి, ఒక్కొక్కప్పుడు బ్రద్దలై పోవుట కూడ తటస్థించవచ్చును. మాలాచాలకములు క్రేనును (Crane) ఉపయోగించి చేయు పనులకు తగియున్నవి. ఏలయనగా, అవి గొప్ప ఉపక్రమణశక్తిని (starting torque) పరిపోషించుకొని బరువైనవస్తువును ఎత్తునపుడు వేగమును తగ్గించుకొనును. తేలిక వస్తువు నెత్తునపుడు వేగమును హెచ్చించుకొనును. ఈ పతన వేగ శక్తి (torque) లక్షణము ముఖ్యముగ కావలసినది. అది మాలాచాలకమును ఆరోహణుల (hoisto) కును, క్రేనులకును, బరువులను లాగుటకును, త్రాళ్ళ బరువు లాగుటకును, చాలకము తేలికగా నడచినచో ప్రమాదము లేని ఇతర పరికరములను నడుపుటకును మిక్కిలి ఉపయుక్తముగా నుండునట్లు చేయును. వీధులలో పనిచేయు రైల్వేమోటారులు సాధారణముగా మాలా చాలక ములై యుండును. వాటిబలీయమైన ఉపక్రమణశక్తి (starting torque) వాటిని ఆపనికి ప్రత్యేకముగా తగియుండునట్లు చేయును. సామాన్య పార్శ్వాయన చాలకములో బరువు లేనప్పటి స్థితికిని, బరువు భర్తిగా నున్నప్పటి స్థితికిని మధ్య దానిలో వీలైనదానికంటె ఎక్కువగా వేగమును తగ్గించవలయునన్నచో పార్శ్వాయన కుంచీయనమునకు తోడుగా మాలా కుంచీయనము చేర్చబడును. అట్టి మోటారును 'సంయోగచాలకము' (compound motor) అందురు. సంయోగచాలకములు పాషాణములను చితుకకొట్టు యంత్రములవంటి వానిని నడుపుటకు తగియుండును. వాటిని పాషాణముతో నింపి నడుపుట ప్రారంభించవలసి వచ్చును. ఎందుచేతననగా, బరువు చేరుచున్నప్పుడు వేగము పతనమగుటయు, ఎక్కువ ఉపక్రమణ శ క్తిని పొందుటయు వాటికి తటస్థించును. అందుచే, దండమునకు కలుపబడి యున్న ప్రచక్రము (fly wheel) భారముయొక్క శిఖరమును గ్రహించుటకు వీలగును. అవి డివేటరులకును, కొంతవరకు వీధులలో నుపయోగించు మోటారులకును, నిరపాయకరమగు గరిష్ఠ వేగమును మాలా చాలకము యొక్క వేగశక్తి (speed-torque) లక్షణముతో కలుపుట అవసరమైనప్పుడునుకూడ ఉపయోగపడుచున్నవి. అవి ఉదంచముల (pumps) కుము, బరువుపనిగల ఇతర యంత్రములకునుకూడ నుపయోగపడుచున్నవి.

ప్రామాణికమగు ఋజువిద్యు త్ప్రవాహచాలకము (D. C. motor) యొక్క ధర ప్రరోచనచాలకము (Induction motor) యొక్క ధరకు ఒకటిన్నర రెండు రెట్లు ఎక్కువగా నున్నను, ఈ రోజులలో సరఫరా చేయబడు శక్తిలో నెక్కువభాగము వికల్ప విద్యుత్ప్రవాహము (AC) వలననే యైనను, ఋజువిద్యుత్ప్రవాహ (DC) చాలకముల కింకను చాల అవకాశము గలదు.వేగము నదుపులో నుంచుటకు అవసరమగు చాలనములకును, మరియితర ప్రత్యేక లక్షణములు గలవాటికిని అవి ముఖ్యముగా కావలసియుండును. ఓడలలో నుండు ఇంచుమించు చాలక ము(motors) లన్నిటికీ ఋజువిద్యుత్ప్రవాహ ముండును. ఇంగ్లాండులో ట్రాంమార్గములు, ట్రాలీలు, రైల్వేలు మొదలగు విద్యుత్ యానములకు తప్పనిసరిగా ఋజువిద్యుత్ప్రవాహము (DC) ఉపయోగింపబడు చున్నది. దశాంశములో అశ్వశక్తిగలిగి గృహములలో వాడుకొను చాలకములు మొదలు 5000 అశ్వళ క్తులు గలిగి కార్ఖానాలలో నుపయోగించు భ్రమణచాలకముల వరకు ఏపరిమాణములలో నైనను ఋజువిద్యుత్ప్రవాహ చాలకములను నిర్మించుటకు వీలగును.

ఋజువిద్యుత్ప్రవాహ పరిపథములో (direct-current circuit) ఎడ తెగని ప్రవాహప్రసారమునకు అపరి పథములో నుపయోగింపబడిన పదార్థ భాగములన్నియు లిగించు అవరోధమే నిరోధముగానుండుమ, ప్రవాహ మొక స్థిరమైన లేక నిశ్చలమైన విలువను పొందిన తరువాత నుండు స్థితికి మాత్రమే ఓహ్మసూత్ర సంబంధము వర్తించును. ఒక విద్యుత్ప్రవాహమందు ఋజువిద్యుచ్చాలక శక్తి అకస్మాత్తుగా ప్రవేశపెట్టబడినపుడో లేదా తొలగింపబడినపుడో విద్యుత్ప్రవాహమొక స్థిరత్వమును పొందును. అట్టికార్యమునకు ముందుగా అతి స్వల్ప కాలము లోనే చాల తక్కువగా అయస్కాంత స్యందము (magnetic flux) గాని అయస్కాంత శక్తిగాని ఉత్పత్తి యగునట్లు పరిపథము నిర్మితమై యున్నచో ప్రవాహము అకస్మాత్తుగా, ఇంచుమించు తక్షణమే దాని స్థిరమైన విలువకు హెచ్చును. పరివథము తీగచుట్టబడిన ఇనుముతో నేర్పడినచో కొంతసేపైన తరువాత ప్రవాహము స్థిరస్థితికి వచ్చును. ఎందుచేతననగా, ఇనుములో శక్తిని నిలువచేయుటకు కొంత వ్యవధిపట్టును. అందుచే కుండలి (coil) గల పరిపథములో ప్రవాహము నుత్పత్తిచేయు విద్యుచ్ఛాలక శక్తికి (e.m.f.) ప్రవాహము వెనుకబడుట తప్పదు. ఈవిధముగా శక్తి నిలువచేయబడు చుండుట ప్రవాహము వృద్ధియగుచున్న కొలది ఎడతెగకుండా జరుగుచుండును. ఒక్కసారిగా విద్యుచ్చాలక శక్తిని తొలగించినపుడు నిలువచేయబడిన అయస్కాంత శక్తి ప్రవాహము క్షీణించకుండ నాపియుంచును. పరిపథము వివృతమైనపుడు ఆ శక్తి విడుదలయై నెమ్మదిగా పరిపథమునకు చేరికొనును. అందుచే ప్రవాహము క్రమముగా శూన్యాంకమునకు క్షీణించును. విద్యుత్ ప్రవాహము యొక్క విలువలో గలుగు మార్పును ఎదుర్కొనెడు విద్యుత్ పరిపథధర్మము సంగ్రహముగా విద్యుత్ప్రేరణము (Inductance) అనబడును. ప్రవాహము విలువ మారు చున్నపుడే ఇండక్టెన్సు దానిని ఎదుర్కొనును గాని, అది మారక స్థిరముగా నున్నపుడు దాని నెదుర్కొనుట జరగ జాలదని మాత్రము గుర్తునందుంచుకొనవలెను. ద్యుశక్మత (voltage) కు వెనుకబడు ప్రవాహముగల పరిపథమేగాక ద్యుశక్మతను పురోగమించు ప్రవాహము గల పరిపథము మరియొకటి గలదు. అది 'సంఘనకము' (condenser) లేక ధారితకము (capacitor) అనబడును. దాని సాధారణ రూపమున అది ఒక జత లోహపు పలకలు వేరు చేయబడి కాని, విద్యుత్ అవాహక పదార్థముతో ఒకదాని నుండి మరియొకటి విద్యుద్బంధన మొనరింపబడి గాని యుండును. విద్యుద్బంధక పదార్థము 'పారద్యుతికము ' (dielectric) అనబడును. అది గాలి, అభ్రకము, గాజు మొదలైన పలురకములలో నొక పదార్థమైయుండవచ్చును. ద్యుళక్మతను వచ్చును. ద్యుళక్మతను (voltage) ప్రయోగించిన వెంటనే ఒక్కసారిగా ప్రవాహము బయలుదేరును. ఈ ప్రవాహము దానిలో ప్రవహించక, దానిని ప్రభరణము (charge) నొందించుటకు వినియోగించును. ప్రభారము(charge) అభివృద్ధి చెందుచున్నపుడు సంఘనకము (condenser) మీదుగా శక్మము (potential) అధికమగుచుండును. ఇది ఎప్పుడును నియోజిత ద్యుళక్మత (Impressed voitage) ను ఎదుర్కొనుటచే ప్రవాహము క్రమముగా తగ్గి, ధారీతకము (capacitor) మూల స్థానము యొక్క శక్మము (potential) తో ప్రభరణ మొందినపుడు శూన్యాంక మువరకు వచ్చును. ఈవిధముగా ధారితకము(capacitor) యొక్క ద్యుశ క్మత (voltage) అల్పతమముగా నున్నపుడు దానిని ప్రభరణము చేయు ప్రవాహము అధికతమముగను, సంఘనకముపై నుండు ద్యుశక్మత అధికతమముగా నుండునపుడు ప్రవాహము శూన్యముగను ఉండును. ఈవిధముగా ఈ పరి పథములో (circuit) ప్రవాహము ద్యుశక్మతను ముందుకు తీసికొని పోవుచుండును. చాల వికల్ప విద్యుత్ప్రవాహమనగా ఒక ప్రవాహములో నున్న విద్యుదణువుల (electrons) చలనము కొంత సేపు ఒక దిక్కుగను, తరువాత అదే కాల ప్రమాణమున దాని కెదురు వైపుగను ఉండుననియు, ఇట్లు ఒక సెకండునకు పర్యాయములు మరల మరల జరుగుచుండుననియు మనకు తెలియును. చాలవరకు వికల్పవిద్యుత్పరివాహములు, ద్యుళక్మతలు త్రికోణమితిశాస్త్రములో 'భుజజ్యా (sine) అని పేర్కొనబడిన ఉత్పన్న ఫల ప్రకారము మారుచుండును. ఇది విద్యుదుత్పత్తికి, ప్రసార మునకు, వినియోగమునకు కావలసియున్నది. ఋజువిద్యుత వాహమునకు పెక్కు పారిశ్రామిక ప్రయోగము లున్నప్పటికీ, పరి వాహన, వార్తా ప్రసారవిధానము మున్నగు పనులలో సాపేక్షముగా అత్యల్ప ఋజువిద్యుత్ప్రవాహ జనకములు ఉండుటయేగాక, నూటికి 85 వంతుల ఉత్పాదక స్థావరములు వికల్ప విద్యుత్ప్రవాహము నుత్పత్తి చేయుచుండును. విద్యుత్ రోపణము మొదలగు పనులకు ఋజువిద్యుత్ప్రవాహమునే ఉపయోగించుట తప్పనిసరియైనపుడు, అది ఉజ్ఞాపకములు (elevators) సంకర్షణ విధానములు మొదలగు వానియందు బాగుగా పనిచేయుట కుపయోగింపబడినపుడు? మొదట ఉత్ప త్తియైన వికల్ప విద్యుత్ప్రవాహము (A C) యంత్రసహాయముచే ఋజు విద్యుత్ప్రవాహము (D C) గా మార్చబడుచుండును. వికల్ప విద్యుత్ప్రవాహము యొక్క శ్రేష్ఠతకు కొన్ని ముఖ్యకారణము లేవనగా :-

1. హెచ్చు ద్యుశక్మతల నిచ్చునట్లుగా వికల్ప విద్యుత్ప్రవాహ ఉత్పాదక యంత్రములను నిర్మించవచ్చును. ఆ ద్యుళక్మతలకు ప్రసారపు పనులకొరకు పరివర్తనయంత్రముల ధ్వారా మరింత హెచ్చువిలువల నివ్వ వచ్చును. విద్యుచ్ఛక్తి యొక్క హెచ్చు ద్యుశక్మతగల ప్రసారము ఎక్కువ శక్తిమంతముగ మండుమ, దీనికి కావలసిన సాధన సామగ్రి ఎక్కువ తృప్తికరముగను, చవుకగను ఉండును. వికల్ప విద్యుత్ప్రవాహమువలన నిట్టి సదుపాయములకు వీలగును.

2. వికల్పవిద్యుత్ప్రవాహము యొక్క ప్రేరణ చాలకము (Induction motor) పరిశ్రమలలో సాధారణముగ నుపయోగింపబడు మోటుగనుండునట్టియు, క్లిష్ట రహితమైనట్టియు యంత్రములలో నొకటి. దానికి ఉత్తమమైన లక్షణములు గలవు. అందుచే నది చాల గొప్ప ప్రయోగములకు పనికివచ్చును. దాని శక్తి కొరకు చాల వికల్ప విద్యుత్ ప్రవాహము ఉత్పత్తియగును.

3. ఋజువిద్యత్ ప్రవాహఉత్పాదక యంత్రములకంటే వికల్ప విద్యుత్ప్రవాహ యంత్రములు చాల పెద్ద పరిమాణములలో నిర్మింపవచ్చును. శక్తిప్రమాణము యొక్క ధరను బట్టి పెద్ద యంత్రములను నిర్మించుట లాభసాటిగా నుండుటచే, ఉత్పాదకస్థావరములు మరింత పెద్ద విగను, మరింత చక్కగ పనిచేయునవిగను, అధికతర విస్తీర్ణమునకు సాపేక్షముగా తక్కువ ధరకు శక్తిని పంపునవిగను ఉండును.

ఒక విద్యుత్ పరిపథములో నిరోధము (resistance) ఉండి, వికల్పద్యుశక్మతను నియోగించినపుడు నియొ గించిన ద్యుళక్మత శూన్యముగా నున్నచో ప్రవాహము శూన్యముగా నుండును. ద్యుళక్మత అధికతమముగా నున్నపుడు ప్రవాహము అధికతమముగా నుండును. అనగా ఏర్పడిన ద్యుళక్మతా భేదములను బట్టి ప్రవాహ ములో భేదములు గూడ సరిగా అదే ప్రకారము తటస్థించును. ఈ స్థితిలో ప్రవాహము ద్యుశక్మతతో 'ప్రావస్థ’ (Phase) యందు ఉన్నదనబడును. ఏ సమయమునందైనను విడుదలయైన శక్తి ద్యుళక్మతా ప్రవాహముల గుణనలబ్ధముతో సమానముగానుండును. అది క్షణక్షణమునకు మారుచుండును.కాని సరాసరి శక్తి, ద్యుళక్మత, ప్రవాహము ఋజువిద్యుత్ ప్రవాహమున కున్నట్లే సమానముగా నుండును. ఫలప్రదమగు ప్రవాహ ద్యుశక్మతల వలెనే పరిమితిని కలిగియుండును, నిర్వచన ప్రకారము వికల్పపరిమాణముల ఫలప్రదమగు విలువలు ఋజువిద్యుత్ప్రవాహములో అదేపరిమాణమున ఉష్ణ ఫలము నిచ్చువానికి సమానముగా నుండును. పరిపథము లో విద్యు త్పేరణము (ఇండక్టెన్సు) ఉన్న యెడల ప్రవాహము ఉపయోగింపబడిన ద్యుశక్మతకు వెనుకబడును. ఈ విధ ముగా ద్యుళక్మత అత్యధికముగా నున్నప్పుడు ప్రవాహము అత్యల్పముగను, ప్రవాహము అత్యధికముగ ఉన్నపుడు ద్యుశక్మత శూన్యాంతముగను ఉండును. ఈ పరిపథములో ప్రవాహ ప్రసారమునకు కలుగు జడ్డు ముఖ్యముగా 'ప్రతిక్రియ' (Reactance) ను బట్టి నిర్ణయింపబడును. ప్రతిక్రియ వికల్పవిద్యుత్ప్రవాహ ద్యశక్మత యొక్క తరచుదనము, విద్యత్ప్రేరణము (Inductance) వీటి యొక్క గుణిజమునకు అనుపాతములో నుండును. స్వచ్ఛమగు నిరోధము ప్రవాహ ప్రసారమును అడ్డుకొనుట మాత్రమే చేసి, ద్యశక్మతతో ప్రావస్థ (phase) లో నుండును. ఇండక్టెన్సువలన కలుగు ప్రరోచిత ప్రతిక్రియ ప్రవాహ ప్రసారమును అడ్డుకొనుటయే గాక ప్రవాహమును ద్యశకతకు వెనుకబడ వేయును. సగము కాలములో విడుదలయైన వికల్పశక్తి నిలువ చేయబడి రెండవ సగముకాలములో సరిగా అంత పరిమాణముగల శక్తియే శక్తిజనకమునకు తిరిగి వచ్చును. ఈ విధముగా ఉత్పత్తిస్థానము సరఫరా చేయు సరాసరి శక్తి బొత్తిగా శూన్యమగును. ఒక ధారితకమునకు(capacitor) వికల్పద్యుశక్మతను ప్రయోగించినపుడు ప్రవాహభేదములనుబట్టి ధ్యుశర్మశాభేదములు కలుగుచుండును. కాని, ఫలితము వ్యతిరేకముగ నుండును. ఎందుచేతననగా, మొదటిదానియందు ప్రవాహము ద్యుశక్మతకు దారి చూపును. తరువాతి దానియందు ప్రవాహము ప్రయోగించిన ద్యుశక్మతకు వెనుకబడును. మొదటి సగము కాలమున ధారితకములో శక్తి నిలువ చేయబడి, రెండవ సగముకాలమున అదే మొత్తముశక్తి ఉత్పత్తి స్థానమునకు మరలివచ్చుటచే మరల ఈవలయమున నున్న సరాసరిశక్తి బొత్తిగా శూన్యముగా నుండును. నిరోధకము, ప్రరోచక ప్రతి క్రియ (Inductive reactance), ధారితక ప్రతిక్రియ అన్నియు కలిసి 'ప్రతి బంధకత' (Impedance) అనబడును. ఒక వికల్ప విద్యుత్పవాహ పరిపథములో శ క్తికి సంబంధించిన విషయములను పరిశీలించినచో 'శక్తి అంకము' (Power. factor) అనునదీ బోధపడును. శక్తి అంకము ద్యుశక్మతాప్రవాహముల ఫలప్రదమగు విలువల గుణిజము ఎంతవరకు ఉపయోగించునో తెలియజేయును. విద్యుత్ప్రేరణము, ధారితకము, అనునవి వ్యతిరేకమై ప్రవాహపు విలువను నిర్ణయించునవి యైనను అవి ఉపయోగించు మొత్తము శక్తి శూన్యముగా నుండును. ఇది ఒక యంత్రమున కీయబడిన మొత్తము శక్తి యొక్క శాతమును దెలియబరచు సామర్థ్యమువంటిది. దీనివలన ఉపయోగార్థమెంత మొత్తము శక్తి కలదో తెలియును. నిరోధకము, ఇండక్లైన్సు టెన్సు మూడును ఒక పరిపథములో పరుసగా నున్నపుడు, రెండును స్థిరముగానుంచి ఇండ క్టైన్సుగాని కెపాసిటెన్సుగాని మార్చినపుడు చిత్రముగు ఫలితము తటస్థించును. కెపాసిటెన్స్ ప్రతిక్రియ ఇండక్టెన్సు ప్రతిక్రియ యొక్క ఫలితముతో సమానమై వ్యతిరేకముగ నున్నందున, వాని ప్రమాణములు సమానముగా నున్నప్పుడవి ఒకదాని నొకటి తటస్థపరచుకొని, ఆ పరిపథము స్వచ్ఛమగు నిరోధక పరిపథముగా మారును. ఈస్థితి “అనువాదిత్వము" (resonance) అనబడును. పరిపథము అనువాదిత్వమున నున్నపుడు, నిరోధకము తక్కువగా సున్నపుడు విస్తారమగు ప్రవాహము ప్రవహించును. దీనికితోడు ప్రతిక్రియలు విస్తారముగా నున్నచో ద్యుళక్మత వాని మీదుగా ప్రవాహ ప్రతిక్రియల గుణిజముతో సమానముగా దిగజూరును. అందుచే అట్టి మాలా పరిపథము పరిపథ మూలకముల కొంత అపాయకరముగా పరిగణింపబడును. ఎందుచేతననగా, అనువాదిశ్వము హఠాత్తుగా సంభవించినచో హెచ్చు ద్యుళక్మతలు కలుగును. విలువలను తరచుదనమును మార్చుచు స్థిరముగా నుంచుట నలనగూడ అనువాదిత్వ స్థితి కలుగ జేయవచ్చును. ఇండక్టేన్సు, కెపాసిటెస్సు పార్శ్వాయన స్థితిలో (in shunt) నున్నపుడు గూడ అదేమాదిరి స్థితి సంభవించును. వికల్ప విద్యుత్ప్రవాహ శక్తి పరిపథముల విషయములో అదృష్టవశమున అనువాదిత్వ పరిస్థితులు అరుదుగానున్నవి. ఎందుచేతననగా అనువాదిత్వస్థితి వెనుకనే ఎల్లప్పుడును హెచ్చు ద్యుశక్మతలుండును. అవి విసంవాహక సామగ్రిని (insulation) రంధ్రము చేయవచ్చును. లేదా, వినం వాహకములను (insulations) తుడిచి వేయవచ్చును. లేదా ప్రసారమును పూర్తిగా మూసివేయవచ్చును. మూలసిద్ధాంతములలో ఋజు, వికల్ప విద్యుత్ప్రవాహ ఉత్పాదక యంత్రములు ఒకే మాదిరిగ నుండును.ఈ రెండిటియందును సంవాహకి (Armature) పై నుంచబడిన వాహకములలో ఏకల్ప విద్యుచ్చాలకశక్తిమాత్రమే ప్రేరేపించబడును. ఈ వాహకములలో దానిని ఋజు విద్యుత్ ప్రవాహ సంబంధముగా మార్చుటకు వీలులేదు. వినిమయ యంత్రము (commutator), కుంచెల (brushes) సహాయముతో వాహకములలో సదా ప్రవహించు వికల విద్యుత్ప్రవాహమును బహిర్గతముగా ప్రవహించు ఋజుప్రవాహముగా మార్చుటకు వీలగును. ఈవిధముగా విద్యుత్ప్ర వాహయంత్రములో వినిమయయంత్రము, దానితో నుండు కుంచెలు చాల ముఖ్యమైన భాగములు. ఇచ్చట రెండు ఆవశ్యకమగు క్రియలు జరుగును. (1) ఉత్పత్తియైన వికల్ప విద్యుత్ ప్రవాహ ద్యుశక్మత బహిర్గతముగా ఉపయోగింపబడిన ఋజు విద్యుత్ ప్రవాహ ద్యుశక్మతలుగా మారుట. (2) పరిభ్రమణ సంవాహకి (Armature) నుండి ప్రవాహము స్థిరముగా నున్న కుంచెకు మారుట, కుంచెలు తిరుగుడుచుట్టల (coil) పై రుద్దుటకు వీలగునట్లుగా చేసి బాహ్యఋజువిద్యత్ ప్రవాహ ద్యుశక్మత నిచ్చునట్లు యంత్రముల నిర్మించుటకు వీలైనప్పటికి, చుట్టలు త్వరగా నరిగిపోవుటచే ప్రతి యొక చుట్టపై ప్రత్యేకముగా రుద్దుటకు వీలైన వినియ యంత్రము నమర్చుటయే ప్రామాణికాచారమైయున్నది. చిన్న చిన్న వికల్ప విద్యుత్ జనక యంత్రములు స్థిరధ్రువములతోను, పరిభ్రమించు చుట్టతోను చేయబడును. పెద్ద యంత్రములు స్థిర మైనచుట్టలతోను (స్టేటర్) పరిభ్రమించు ధ్రువములతోను (రోటర్) చేయబడును. ఉత్పత్తియైన శక్తి తరువాత స్థిరమైన అంతిమముల ద్వారా సేకరింప వచ్చును. ఇది చాల గొప్ప సదుపాయము. ఎందుచేత ననగా, అత్యధికమగు ఉత్పత్తి, ద్యుశక్మతల విషయమున ఋజువిద్యుత్ ప్రవాహ యంత్రములలో పరిభ్రమించు అంతిమములనుండి శక్తిని సేకరించుటయనునది తీవ్రమగు అవధిగానుండును. పొందిన వికల్పవిద్యుత్ ద్యుశకత యొక్క తరచుదనము ధ్రువముల జతల యొక్కయు, సెకండునకు చేయు పరిభ్రమణముల సంఖ్య యొక్కయు గుణిజమునకు సమానముగానుండును. ఈ విధముగా నడుపునట్టి పరిస్థితులలో నుండు భేదములు గాక, వికల్ప విద్యుజ్జన యంత్రమునకును, ఋజు విద్యుజ్జనక యంత్రమునకును ఈ దిగువ నిచ్చిన భేదములుండును. (1) ఒక స్థిరమైన తరచుదనములో వికల్ప విద్యుత్ప్రవాహమును పొందుటకు వికల్పవిద్యుజ్జనక యంత్రమును ఒక స్థిరమైన వేగముతో నడపవలసియుండును. ఋజు విద్యుజ్జనక యంత్రమును అనుకూలమును, ఉచితమును అగు వేగముతో నడపవచ్చును. (2) నికల్పవిద్యుజ్జనక యంత్రము ఎల్లప్పుడును వేరుగా ఉద్రేకింపవలసియుండును. ఋజు విద్యుజ్జనక యంత్రమును వేరుగా ఉద్రేకింపవచ్చును. లేదా స్వయముగా గాని ఉద్రేకింపవచ్చును. ఇంకను పూర్తిగా ఆ స్థిరమైన చుట్టల యొక్క ఉపరితలమును ఉపయోగించుకొనుటకు రెండవ చుట్ట అమర్చబడును అవసరమైనచో మూడవ చుట్ట ఇట్లే క్రమముగా ఉపయోగించ వేరుగానున్న ప్రతియొక చుట్టమును ఒక 'ప్రావస్థ' (phase) యనబడును. అవి వేరు వేరుగా భారములకు కలుపబడి యుండవచ్చును. చాల ప్రావస్థల (phases) తో పనిచేయుటవలన ముఖ్యమైన ప్రయోజనములు గలవు (1) ఈయబడిన ఒక పరిమాణము గల చట్రమునకు 'బహుప్రావస్థ' (Poly phase) యంత్రము యొక్క ఉత్పత్తి యెక్కు వగానుండును. అనగా, ప్రయోజనకారియగు పదార్థము బహుప్రావస్థ యంత్రములో ఎక్కువ సమర్థతో వినియోగపడును. (2) వాహక దూరమున కుపయోగింపబడు తామ్రపు ఖర్చు తప్పక తగ్గును. ప్రసారితమగు శక్తి, ప్రసార సామర్థ్యము స్థిరముగా నుండును. ఏమైనను, మూడు ప్రావస్థలకంటే నెక్కు వగ నుపయోగించుట తగదు. ఎందుచేతననగా, ప్రావస్థల సంఖ్య ఎక్కువైన కొలది వికల్పవిద్యుజ్జనక యంత్రములయందును, సంవియుకదంతి (Switchgear) మొదలగు వానియందు క్లిష్టత కూడ హెచ్చుఅగుచుండును. అందుచేత మూడు ప్రావస్థలు గల విధానము బహు ప్రావస్థ (Poly phase) విధానములో ప్రామాణికముగా నంగీకరింపబడినది.

పరివర్తన యంత్రము యొక్క సూత్రమును మనము ముందు విచారించితిమి. అనగా వికల్ప విద్యుత్ప్రవాహ మొక చుట్టద్వారా ప్రవహించుచున్నపుడు మారుచున్న స్యందమేర్పడును. ఈ స్యందముతోకలుపుచు మరి యొక చుట్ట నమర్చినపుడు ద్యుశక్మత ప్రేరేపించబడును. అది దాని అంతిమముల యొద్ద విడుదలై యిష్టమువచ్చిన ట్లుపయోగించుకొనుటకు వీలుగానుండును. పరివర్తన యంత్రములో ముఖ్యముగా వేరువేరుగా ఒక ఇనుపకడ్డీపై చుట్టబడిన రెండు చుట్టలు దగ్గరగానుండును. ఇనుపకడ్డీ అయస్కాంత శక్తి రేఖలకు గాలికంటెను శ్రేష్ఠమైన వాహకము. అందుచే రేఖ లన్నియు ఇనుమునే యంటుకొని యుండును. సరఫరాతో కలుపబడి శక్తిని గ్రహించు చుట్ట 'ప్రాథమిక కుంచీయన' మనబడును. భారమునకు కలుపబడి శ క్తిని విడుదలచేయు చుట్ట 'ద్వితీయ కుంచీయన' మనబడును. జ్వలీకృతదీపము లేక విద్యుత్ చాలకమువంటి భారము ద్వితీయ కుంచీయనమునకు కలుపబడినచో ప్రవాహము ప్రసరించును. ఈ విధముగా ఒక విద్యుత్ పరిపథమునుండి మరియొక దానికి వాటిమధ్య లోహసంబంధ మేమియు బొత్తిగా లేనప్పటికి మార్చబడును. ఇట్లు అద్భుతముగా శక్తి మార్చబడుట విద్యుదయస్కాంత ప్రేరేపణ సూత్రముపై జరుగును. సరఫరా ద్యుశక్మతను తగ్గించుట కుపయోగించు పరివర్తన యంత్రము దింపుడు పరివర్తన యంత్ర (step-down transformer) మనబడును. ద్యుళక్మతను హెచ్చుచేయునది ఎక్కుడు పరివర్తనయంత్ర (step-up transformer) మనబడును. ఇచ్చట శక్తి బదిలీ చేయబడుచుండుటచే, నష్టములు పోగా, సరఫరా అయిన శక్తి విడుదలైన శక్తికి సమానముగా నుండ వలెను. అందుచే దింపుడు పరివర్తన యంత్రములో ద్యుశక్మత తగ్గించబడినపుడు అదే అనుపాతములో ప్రవాహము హెచ్చును. ఎక్కుడు పరివర్తన యంత్రములో దీనికి వ్యతిరేకముగా జరుగును. యాంత్రిక శక్తి ప్రసారమున ఒక జతదంతులు (gears) ఒక టార్కు వేగమునుండి మరియొక టార్కు వేగమునకు మారునట్లే విద్యుత్ శక్తి ప్రసారమున పరినర్తన యంత్రము ఒక ద్యుశక్మత ప్రవాహము నుండి మరియొక ద్యుశక్మత ప్రవాహమునకు మార్చును. పరివర్తన యంత్రములలో ఒరపిడి వలన నష్టములు కలుగు చలనభాగములు లేక పోవుటచే అవి చాల సమర్థతతో బనిచేయును.

ఋజువిద్యుత్ ప్రవాహబాలకములు, ఉత్పాదక యంత్రములు ఇంచుమించు ఒకేమాదిరిగా నుండును. ఒక దానిని నడపుట కెట్లు వీలగునో రెండవదానినికూడా అట్లే నడపుటకు వీలగును. కాని వికల్ప విద్యుత్ ప్రవాహచాలకములకును, ఉత్పాదక యంత్రములకును నిర్మాణమున, 'సంకాలియచాలకము' (Synchronous motor) అను రకపు యంత్రములో తప్ప మిగిలిన వానిలో చాల వ్యత్యాస ముండును. వికల్ప విద్యుత్ ప్రవాహజనక యంత్రములో వాస్తవమునకు ఒకరకము మాత్రమే యున్నను, చాలక ములలో నాలుగు రకము లున్నవి. అవి: (1) ప్రేరేపణచాలక ము (Induction motor) (8) సంకాలీయ చాలకము (Synchronous motor) (3) విముఖత్వ చాలకము (Repulsion motor), (4) మాలా చాలకము (Series motor). ప్రేరేపణ చాలకములో స్టేటర్ అను స్థిరకుంచీయనము సరఫరానుండి విద్యుత్ శక్తిని గ్రహించును. 'స్టేటర్ లో కలుగు నష్టములుపోగా, ఈ శక్తి యంత్రము యొక్క రోటర్ అనబడు పరిభ్రమణ స్థానమునకు బదిలీ చేయబడును. ఇది పరివర్తన యంత్ర క్రియవలన జరుగును. ఇట్టి యంత్రము ఒక ప్రత్యేక తరగతికి చెందిన పరివర్తన యంత్రము. వీనిలో ప్రాథమికమగు స్టేటర్ స్థిరముగనుండి, అమబంధకమగు రోటర్ పరిభ్రమణముచేయుచును నుండును. ఇది దేనికొరకు నిర్మింపబడినదో, ఆ వికల్ప విద్యుత్ ప్రవాహము యొక్క సరఫరాకు కలుపబడి నపుడే అది తృప్తికరముగా పనిచేయును. వానిలో రకముల చాలకములు అతిపార్వజనీనముగను, విస్తృ తముగను ఉపయోగింపబడుచున్నవి. ఎందుచేత ననగా (1) వాటి నిర్మాణము సులభము. అవి మోటుగను, బొత్తిగా చిక్కు కలిగించనివిగను ఉండును. కదులుచుండు భాగములు లేవు. అందుచే ప్రవాహమును పరిభ్రమణ భాగమునకు పంపుటలో కష్టము లేదు. (2) సాపేక్షకముగా వాటికి ఖర్చు తక్కువ. తయారగు చున్న ఛాలకములలో అవి నిస్సందేహముగ అన్నిటికంటే ఛవుకగా నుండును. (3) వాటిని ఏ స్థలమునందై నను నడపుటకు వీలగును. సరిగా విసంవాహకము చేసినచో సంచారక ధూమములు (Corrosive fumes) గల వాతవరణములోనైనను, నూనెలోనైనను, నీటిలోనైనను నడపవచ్చును. (4) అవి భారముతో జోక్యములేకుండ దృఢముగా స్థిరమైన వేగముతో నడచును. చాలభాగము ప్రయోగముల కిది కావలసిన విషయము. చాలకమును వీరుచునట్లుగా లేనిభారమైనచో, సంకాలీయ చాలకములు భారముతో జోక్యము లేకుండ స్థిరమైన వేగముతో పనిచేయును. సంకాశీయ చాలకము యొక్క స్టేటర్' వికల్ప విద్యుజ్జనక యంత్రము యొక్కగాని, ప్రేరేపణచాలకము యొక్కగాని స్టేటరువలెనే యుండును. కాని రోటర్' అనునది ఉత్పాదక యంత్రము యొక్కయు, ప్రేరేపణచాలకము యొక్కయు సమ్మేళనము. సంపూర్ణముగా స్థిరమైన వేగముతో నడచు సంకాలియచాలకము యొక్క ఈ లక్షణమువలన చిన్న సంశాలీయ చాలకములను గడియారములు, కాలయంత్రములు, సినిమా ప్రసారము, స్వయముగా పోవు తంతివార్తా ప్రసారము మొదలగువానికి ఉపయోగించుటకు వీలుకలిగినది. పెద్ద చాలకములు స్వయముగా పోవు వాహకములు నడపుటకును, యంత్రసంశోధకములు మొదలగునవి నడపుటకును ఉపయోగింపబడుచున్నవి. ప్రత్యేకరకపు ప్రేరేపణచాలకమును తయారుచేయుటకుముందు హెచ్చు ఉపక్రమణశక్తి (Starting Torque) కావలసినచోట వికర్షణచాలకము ప్రామాణికముగా అంగీకరింపబడినది. ఇది కొంచెము ఎక్కువ వెలగల యంత్రమైనను, ఇది ఇబ్బంది కలుగజేయు అవకాశ ములున్నదైనను, దీనియందు హెచ్చు ఉపక్రమణ వేగము తక్కువ ప్రారంభ ప్రవాహము అను రెండు మిక్కిలి వాంఛనీయమైన లక్షణము లున్నవి. ఋజు విద్యుత్ప్రవాహచాలక ముల వరుసలు వికల్ప విద్యుత్ప్రవాహముయొక్క సరఫరాకు కలిపినచో పనిచేయును; ఏమైనము, యంత్రము పెద్దదైనకొలది దానిని చక్కగా నడపుటకు కొంది నిర్మాణాత్మకమగు మార్పులు చేయ వలసి యుండును. ఈ మాలాచాలకము ఆశ్వశక్తి యొక్క అంశిక ప్రమాణములలో ఈ దిగువ సందర్భముల యందు విరివిగా నుపయోగించబడును (1) వికల్పవిద్యుత్ప్రవాహము యొ క్ష గాని, ఋజువిద్యుత్ప్రవాహము యొక్క గాని సరఫరాకు కలిపినపుడు చాలకము సంపూర్ణముగా తృప్తికరముగా పనిచేయుట అవసరమైనపుడును, (2) హెచ్చు వేగముగల చాలకము భారప్రమాణము ఒకటికి తక్కువ వేగముగల చాలక ముకంటే ఎక్కువశ క్తిని కలుగజేయును కాబట్టి హెచ్చు వేగముగల చాలకము నుపయోగించుట ముఖ్యమైనపుడును, (8) తక్కువ భార మున్నప్పుడు హెచ్చు వేగమును, భార మెక్కు వగ నున్నపుడు తక్కువ వేగమును స్వయముగా భార పరినూణ మునుబట్టి వేగమును సరిచేసికొనగల యంత్రము లవసరమైనపుడును, విద్యుత్ గౌరయంత్రములు, కుట్టు యంత్రములు, తేలికగానుండు వ్యఘనయంత్రములు (drills) మొదలగునవి ఇట్టి సామాన్యయంత్రములు. అది ఋజు, వికల్ప, విద్యుత్ ప్రవాహములకు రెండింటికిని తగ్గియుండుటచే దీనిని తరచుగా 'విశ్వచాలకము' అందురు. ఏమైనను, ఇది అన్నిటికంటే ఎక్కువగా సంకర్షణచాలకముల కుపయోగింపబడుచున్నది. ప్రపంచములో నున్న విద్యుత్ చలిత్రము (locomotives) లలో సుమారు మూడవవంతు పెద్దవై, ఒకే ప్రావస్థగల వికల్ప విద్యుత్ప్రవాహ మాలా చాలకములతోడనే నడపబడుచున్నవి. దీని లక్షణము చాల తగియున్నదై ఉపయోగింపబడిన ద్యుశకృతను మార్చుటచే సులభముగను, సమర్థతతోను క్రమపరచుటకు వీలగును. ఒకే ప్రమాణముగల ఉత్పత్తికి బహుప్రావస్థలుగల చాలక ముకంటే ఏక ప్రావస్థగల చాలకము ఎక్కువ వేలయైనను, సంకర్షణక్రియకు ఏక ప్రావస్థగల చాలకములే సాధారణముగా నుపయోగింపబడుచున్నవి. ఎందుచేతననగా, దానికి ఒక ట్రాలీతీగ మాత్రమే కావలయును. ఉక్కు పట్టాలు తిరిగివచ్చు వాహకముగా పని చేయును. కాని మూడు ప్రావస్థలున్నచో మూడు వాహకములు, అందుచే రెండు ట్రాలీతీగలు కావలసి యుండును. శక్తి సరఫరాయొక్క తరచుదనమును తక్కు పచేయుటచే సమర్థత, నడక చాల అభివృద్ధి యగును. కాబట్టి, వికల్ప విద్యుత్ప్రవాహ సంకర్షణక్రియకు సెకండుకు 15 లేక 16⅔ చక్రములు ప్రామాణిక మైన తరచుదనముగా తాత్కాలికముగ నంగీకరింపబడినది. ఇంతకు ముందు బహు ప్రావస్థలుగల విధానముతో పనిచేయుటవలన ప్రయోజనములను, మూడు ప్రావస్థలుగల విధానమును బహుప్రావస్థ విధానములో ప్రామాణికముగ నంగీకరించుటకుగల కారణములను మనము చూచియున్నాము. బహుప్రావస్థ సరఫరా ఉన్న కర్మాగారములలో, పెద్ద ఫారములలో, పెద్ద భవనములలో బహుప్రావస్థ ప్రేరేపణచాలకము లుపయో గింపబడుచున్నవి. ఎందుచేతననగా, (1) అధిక సంఖ్యలో పారిశ్రామిక ప్రయోగములకు వీలుగా వాటికి ఉత్తమమగు నిర్వహణ లక్షణములు గలవు. (2) ఇతర రకముల చాలకములలో చాల వాటికంటె సాపేక్షకముగా, చవుకగా నుండును. (3) అవి చాల మోటుగానుండి ఇబ్బందిని కలుగజేయవు. (4) ఏ స్థలమునందైనను వాటిని నడపుటకు వీలగును. కాని ఋజువిద్యుత్ప్రవాహ చాలకములో వలె అంత త్వరగా వేగమును అదుపులో నుంచుటకు వీలు లేకపోవుట యను బాధకము వాటికి గలదు. కాని చాల రకముల ప్రయోగములకు ఇది ఒక ప్రత్యేకముగు అడ్డంకి కాదు. తగిన నిర్మాణ విధానముతో (design) ఉపక్రమణ వేగమునుకూడ సబబైన హెచ్చుస్థితికి తేవచ్చును. వినిమయ యంత్ర (commutators) ములతో గూడిన చాలకముల కంటె అవి మంచి అదనపు భారసమర్థతను కలిగియుండును. వినిమయ యంత్రములలో స్ఫులింగీకరణము తరచుగా దుర్ఘటమై తృప్తికరముగా పని చేయనీయదు.

విద్యుచ్ఛక్తిని, అది లభించు రూపముననే ఒకానొక ప్రత్యేకక్రియకు నేరుగా నుపయోగించుటకు తరచుగా వీలు లేకుండును. అందుచే, వినియోగించుటకు ముందు దానిని మరియొక రూపములోనికి మార్చవలసి వచ్చును. ఉదాహరణకు విద్యుచ్ఛక్తి వికల్ప విద్యుత్ ప్రవాహ రూపమున సెకండుకు 50 చక్రముల తరచుదనములో సాధారణముగ లభించును. కాని విద్యుద్రసాయన యంత్రములకు ఋజువిద్యుత్ప్రవాహము కావలెను. అందుచే, దానిని ఋజువిద్యుత్ప్రవాహముగా మార్చుట అవసరము. వికల్ప విద్యుత్ప్రవాహముతో నడచు విద్యుత్ రైల్వే శక్తిని 50 చక్రముల పద్దతినుండి కొనినపుడు దానిని ఎక్కువ సమర్థత, మంచి నడకకొరకు 15 లేక 164 చక్రముల పద్ధతిలోనికి మార్చుటకు సాధనములు కావలయును. వాడుక కొరకు కావలసిన మార్పులేవనగా - (1) వికల్ప విద్యుత్ ప్రవాహమునుండి ఋజువిద్యుత్ ప్రవాహము. (2) ఋజువిద్యుత్ ప్రవాహమునుండి వికల్ప విద్యుత్ ప్రవాహమునుండి వికల్ప విద్యుత్ ప్రవాహము. (8) ఋజువిద్యుత్ ప్రవాహము నుండి వేరు ద్యుశక్మత గల ఋజు విద్యుత్ ప్రవాహము. (4) వికల్ప విద్యుత్ ప్రవాహమునుండి వేరు ద్యుశక్మత గల వికల్ప విద్యుత్ ప్రవాహము. (5) వికల్ప విద్యుత్ ప్రవాహము నుండి వేరు తరచుదనముగల వికల్ప విద్యుత్ ప్రవాహము. (6) త్రిప్రావస్థనుండి ద్వి ప్రావస్థ. పై వానిలో 4, 6 సంఖ్యలు గల విషయములు పరివర్తన యంత్రములచే చక్కగా నిర్వర్తింపబడును. 2, 3.5 సంఖ్యలుగల విషయములు చాలక—ఉత్పాదక యంత్ర సముదాయముచే నిర్వర్తింపబడును. వాటిలో యంత్రస్థముగా జతచేయబడిన రెండు పరిభ్రమణ యంత్రములుండును. వీటిలో ఒకటి ఒక చాలకమును నడుపుచు లభించిన సరఫరానుండి విద్యుత్ శక్తి ని తీసికోని, కావలసిన సరఫరా నుత్పత్తిచేయు రెండవ యంత్రమును నడపుచుండును. పైన ఇచ్చిన మార్పులలో దేనినైనను చాలక ఉత్పాదక యంత్రసముదాయము నిర్వర్తించగలదు. దానిని అతిత్వరలో అదుపులోనికి తీసికొని రావచ్చును. అందుచే మార్పులు చేయు సాధనములలో నిది చాల సులభసాధ్యమైనది. అది పరివర్తన యంత్రముకంటె చాల రెట్లు ఖరీదుగలది. దాని విషయమున ఎంతో అది ఎక్కువశ్రద్ద కావలెను. అది తక్కువ సమర్థతకలది ఐనప్పటికి, వేరొక విధముగా తృప్తికరముగా నిర్వర్తించుటకు వీలులేని మార్పులను చేయుటకు అది నిరివిగా నుపయోగింపబడుచున్నది. అతి సాధారణముగా నుండి 1 వ సంఖ్యగల విషయము చాలక ఉత్పాదక యంత్ర సముదాయము, రస చాప సంశోధకములు (mercury-arc rectifiers), లోహ సంశోధకములు,తాపాయనక నాళములు (thermionic tubes) మొదలగు వివిధ సాధనములచే నిర్వర్తింపబడును. . చవుకగా ప్రసారము చేయుటకు హెచ్చు ద్యుళక్మతలు అవసరమగుట వాస్తవమైనప్పటికిని. ఋజు విద్యుత్ప్ర వాహముపై నుపయోగించు ద్యుళక్మతలు తగ్గులోనే యుండును. కారణ మేమనగా, చాలకములు, దీపములు, తాపకములు నిర్మించుట సాధ్యముకాదు. వాటిని హెచ్చు ద్యుశక్మతలలో నడపుటకు విద్యుచ్ఛక్తి ఖర్చగును. వాటిని నిరపాయ స్థితిలో నుంచుటకు వినియోగ సాధనముల పై నున్న ద్యుశక్మతలను తగ్గు విలువలోనే పరిమితి చేయవలసి యుండును. ప్రసార రేఖకును వినియోగ సాధనమునకు మధ్య పనిచేయుచు, హెచ్చు ద్యుళక్మతను కావలసిన తగ్గు ద్యుళక్మతలోనికి మార్చుటకు వీలయినదియు, నిరపాయ మగునదియు, నమ్మకమైనదియు, చవుకగా నుండు నదియు నగు సాధనము కావలెను. ఋజువిద్యుత్ప్రవాహ పద్ధతులలో ఈ రకమగు తగిన సాధనము ఇంకను లభ్యము కాలేదు. కాని వికల్ప విద్యుత్ప్రవాహ పద్ధతులలో 'పరివర్తన యంత్రము' (transformer) అను చాల తృప్తికరమైన సాధనము ఈ పనిని నిర్వర్తించుటకు తగి యున్నది. అందుచేతనే, వికల్ప విద్యుత్ ప్రవాహ విధానములు అంద విరివిగా నుపయోగింపబడుచున్నవి. పరివర్తసవపు బ్యాంకులు ఉత్పాదక యంత్రములకును, ప్రసార శేఖలకును మధ్య ప్రవేశ పెట్టబడును. దీనివలన ద్యుశ క్మత కావలసిన విలువకు హెచ్చును. అందుచే, ఆ మార్గమును, పరివర్తన యంత్రములును సర్వసమర్థతతో చవుకగా నుండును. దానిని నడపుటయందు మాత్రము శ్రద్ధ అవసరము. పరివర్తన యంత్రములు ద్యుశక్మతను కావలసిన విలువకు తగ్గించుటకు కూడ ఉపయోగించును.వినియోగసాధనములను, వాటిని ఉపయోగించువారికి నిరపాయముగా నుండునట్లు నడపుటలో తీసికొనవలసి యుండును. ఈ రోజులలో విద్యుచ్ఛక్తి చాల భాగము బొగ్గును కాల్చి తయారు చేసిన ఆవిరిశ క్తి యంత్రముల వలనను (ఉష్ణ విద్యుత్), జలశక్తి యంత్రముల వలనను (జల విద్యుత్) లభించుచున్నది. జల విద్యుచ్ఛక్తి యంత్రముల విషయములో జలపాతము లున్న చోటనే విద్యుచ్ఛక్తినీ ఉత్పత్తి చేయవలసియుండును. తరువాత దానిని తరచుగా బహుదూరముగా నున్న వినియోజకుల నివాసములకు శక్తి విద్యుత్ రూపమున బంపుదురు. ఉష్ణవిద్యుత్ యంత్రములు బొగ్గుగనుల సమీపమున నైనను ఉండవచ్చును లేదా శక్తి బొగ్గురూపమున రవాణా చేయబడుచు నవి వినియోజకుల నివాసముల సమీపమున నైనను ఉండవచ్చును. అందుచే, శ క్తి నిచ్చు యంత్రములు ఉష్ణవిద్యుత్ యంత్రము లైనను, జలవిద్యుత్ యంత్రములైనను విస్తృతమగు పద్ధతిలో ప్రసార రేఖలు, సప్లై రేఖలు ఉండును. ఈ పద్ధతి ఇంచుమించు ఎల్లప్పుడు త్రిప్రావస్థ గలదిగా నుండును.

డి. వి. ఆర్. వి.