సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉష్ణమండలపు వ్యాధులు
ఉష్ణమండలపు వ్యాధులు :
ఉష్ణమండలపు వ్యాధులనగా వెచ్చని దేశములందు సాధారణముగా సంభవించు వ్యాధులు. భారతదేశము అట్టి దేశములలో నొకటి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, బర్మా, మలయా, ఉత్తర అమెరికాలోని దక్షిణ భాగము ఉష్ణమండలము లోనే గలవు. ఉష్ణమండల దేశములలో వేసవికాలము తీవ్రముగ నుండును. ఇందు మనము ధరించు దుస్తులు తేలికగా నుండవలెను. అవి తెల్లనూలుతో చేయబడి యుండుట శ్రేష్ఠము. అట్టివి చెమటను పీల్చివేయు శక్తిని కలిగి యుండును. డాబాయిండ్లు లేక వరండాలు కల యిండ్లు రాత్రులందు నిదురించుటకు అనుకూలముగ నుండును. దోమల బాధను నివారించుటకై దోమ తెరను తప్పక ఉపయోగించవలెను.
ఉడుకు జ్వరము, ఉడుకుకు సొమ్మసిల్లుట, వడగొట్టుట, (హీట్ ఫీవర్, హీట్ ఎగ్జాషన్, మరియు సన్ స్ట్రొక్) : సంవత్సరములో మిక్కిలి వేడిగా నుండు కాలమున పగలు ఉష్ణోగ్రత పెరిగి పోవును. కంఠమునకు మిక్కిలిగా చెమట పట్టును. చెమటద్వార రక్తములో నుండు ఉప్పు ఎక్కువగా బైటికి పోవును. అందువలన అలసట కలుగును. కొంచెవు ఉప్పును నీళ్ళలో కలిపి తీసికొనుటవలన అట్టిది నివారించబడును. ఒకప్పుడు వేడిని క్రమబద్ధముచేయు సాధనము అశక్తము అగును. రోగికి చెమటపట్టక ఉష్ణోగ్రత హెచ్చిపోవుకు, ఉష్ణోగ్రత 107° లకు మించిన యెడల అందుండి కోలుకొనుట చాలవరకు అరుదు. రోగికి క్రమక్రమముగా స్మృతితప్పి చనిపోవును. తక్కువ తీవ్రపరిస్థితిలో అనగా ఉష్ణోగ్రత మిక్కిలి హెచ్చుగానుండని పరిస్థితిలో జ్వరముమాత్రము కొన్ని దినములవర కుండును. మనము ముఖ్యముగా ఉష్ణోగ్రతను తగ్గించుటకు ప్రయత్నించవలసియున్నది. ఈ ప్రయత్నము నెర వేరుటకు రోగిని చీకటిగల చల్లనిగదిలో నుంచవలెను. మంచుగడ్డ కలిపిన నీటిని రోగి శరీరముపై రుద్దవలెను. రోగము నెమ్మదించువరకు ఉష్ణోగ్రతను చాల సేపు తక్కువగా నుంచుటకు ఈ పద్ధతులను అవలంబించవలెను.
టైఫాయిడ్ జాతికి చెందిన జ్వరములు: ఈ టైఫాయిడ్, పేరావ్, పేరాబి, వేరాసి క్రిములమూలమున కలుగుచున్నది. ఇవి నీరు పాటు, ఈగలు, ఆపరిశుభ్రమైన వ్రేళ్ళమూలమున వ్యాపించును. ఇవి కాక తమ మల మూత్రములలో ఈ సూక్ష్మక్రిములను విసర్జించు వాహకులుగలరు. కాని వాహకులు మాత్రము వాటివలన ఎట్టి రోగములకు గురికారు. ఈ జ్వరము రాకుండుటకు నివారణ మార్గములు :
- (1) సురక్షితమైన నీటిసరఫరా.
- (2) వాహకములగు మనుష్యులను గుర్తించి, వారిని వేరుచేసి చికిత్సచేయుట.
- (3) ఆహారపదార్ధములను ఈగల బారినుండి రక్షించుట,
(4) ఈగలు ముమ్మరముగానుండు జూన్ నెలకు పూర్వమే టి. ఏ. బి. టీకాలు వేయించుకొనుట.
అంకురించిన 12 దినములతర్వాత తలనొప్పి, నాడి నెమ్మదిగా ఆడుట, కొంచెము దగ్గు- వీనితో జ్వరము ప్రారంభ మగును. 6 వ లేక 7 వ రోజున స్పష్టమైన పెంకురంగు మచ్చలు కానరావచ్చును. రెండవవారములో రోగికి జ్వరము హెచ్చి సంధించుట జరుగవచ్చును. 18వ లేక 21 వ. నాటికి జ్వరము నెమ్మదిగా తగ్గిపోవచ్చును. ఇందు వచ్చు క్లిష్టపరిస్థితులు (1) నీళ్ళవిరేచనములు, (2) ఉమ్మి గ్రంధి వాయుట, (3) రొమ్ముపడిసేము (4) కడుపుబ్బుట (5) రక్తప్రసారము స్తంభించి శరీరము చల్లబడుట (6) విరేచనములో రక్తముపడుట (7) ప్రేగుపగులుట, ఇందు 5, 6, 7 మరణకారణములు కావచ్చును. రోగిని ప్రత్యేకముగ నుంచుట, వ్యాధిలక్షణానుసారముగ చికిత్స చేయుట యిందు కవసరములు. క్లోరోమైసిటిన్ ఫాయిడ్ క్రిములపై నిర్దుష్ట ఫలితముల నీయగల క్రిమిసంహారిణి, దీని నుపయోగించిన యెడల జ్వరము సాధారణముగ మూడు నాలుగు దినములలో తగ్గుదలకు వచ్చును. కానీ జ్వరము తిరుగబెట్టుట సామాన్యము.
(2) మాల్టాజ్వరము : ఇది బ్రూసల్లా మెలిటంసిస్ అను యెబార్టన్ అను క్రిములవలన సంభవించు వ్యాధి, ఇది యూరపు ఖండమునం దెక్కువ. భారత దేశమున కూడ కొందరు అప్పుడప్పుడు దీనికి గురియగుట కద్దు. ఈ వ్యాధి గల మేకల ద్వార, పశువుల ద్వార, యిది వ్యాపించుట కలదు. పాలను కాచిన యెడల ఈ సూక్ష్మక్రిములు చని పోవును. ఈ వ్యాధి అంకురించుకాలము కనీసము 14 దినములు. ఆ పిమ్మట జ్వరము మెల్లమెల్లగా తలనొప్పి, కీళ్ళ నొప్పులతో ప్రారంభమై అది రెండు వారములు ఉండును. ఆ పిమ్మట ఉష్ణోగ్రత కొద్ది రోజులు తగ్గినట్లే అగపడి మరలవచ్చి మరి రెండు వారము లుండును. ఈ వ్యాధి రెండు సంవత్సరముల దీర్ఘకాల ముండుటకూడ గలదు. ఈ వ్యాధికి సంతృప్తికరమైన చికిత్స లేదు. కేవలము వ్యాధి లక్షణములకు మాత్రమే చికిత్స జరుగవలసి యుండును.
(1) తిరుగబెట్టు జ్వరము (రిలేప్సింగ్ ఫీవరు): ఇది ట్రిపనీమా రిక్కరింటిస్ మూలమున సంభవించును. అందలి రకము లేవి యనగా (1) పేలవలన వచ్చునది. ఇది వ్యాపించు అంటువ్యాధి. (2) టిక్ పురుగు (ఆఫ్రికా)ల వలన కలుగు జ్వరము. ఇది దేశ ప్రాధాన్యమగు వ్యాధి (ఎండమిక్). శరీరమంతటను నొప్పులతోను, తలనొప్పితోను ఈ వ్యాధి హఠాత్తుగా ప్రారంభమగును. ఒంటిపై ఎఱ్ఱని లేక నల్లని దద్దుర్లు కనబడవచ్చును. ఏడవనాడు ఉష్ణోగ్రత తగ్గును. వారము రోజుల తరువాత మరల జ్వరము కాచి 3 లేక 4 దినము లుండును. మూడవసారి పటము 3. చలిజ్వరము (మలేరియా) అన్యాధారజీవి యొక్క జీవిత చరిత్ర
1. దోమదశ: నెత్తురులోని మలేరియా క్రిములను దోమ త్రాగును. మగ ఆడ భేదముగల లింగరూపములు ఏకమై కడుపుగోడయందు గ్రుడ్డుగా మారును. ఆవి పగిలి స్పరోజాయిట్సు అను పురుగులు మరల దోమ కరచిన యెడల నెత్తురులోనికి పోవును.
2. లింగభేదము గల రూపములు రక్తకణములలో నున్నవి. కొన్ని మగ ఆడు రూపములు ధరించును. ఇవి దోమ కడుపులోనికి పోయిన పిదప మరల పెరుగును.
3. మలేరియా పురుగు కాలేయకణములలో వృద్ధిపొందును. ఈ దశలో జ్వరముండదు.
4. రక్తములోని దశ : కాలేయమునుండి బయటికివచ్చిన పురుగులు కణములలో తిరిగి పెరిగి, కణములు పగిలి బయటికి వచ్చును, మరల రక్తములోనికి పోవును. ఇట్లు బయటికి వచ్చినపుడు జ్వరమువచ్చును.
తిరుగబెట్టుటకూడ కలదు. అసూక్ష్మక్రిములను జ్వర కాలములో రక్తమునుండి సంపాదింపవచ్చును. టిక్ పురుగువలన కలిగిన జ్వరము ఇంకను ఎక్కువమార్లు తిరుగ బెట్టును కాని ఇందు జ్వరముండు కాలము తక్కువ. ఆర్ సెనికల్ ఔషధములనుకాని పెన్సిలినును కానీ జ్వరమువచ్చిన వెంటనే సూదిమందు ద్వారా యిచ్చిన యెడల తరచు గుణము కనబడును.
4. ప్లేబాటమస్ జ్వరము : ఇది వేసవి నెలలయందు పెరిగెడు పురుగుచే వ్యాపింప చేయబడిన రసిద్వారా వచ్చును. ఈజ్వరము అంకురించు కాలము 7 దినములు. తర్వాత జ్వరమువచ్చి శరీరమం దంతటను అంతర్గతముగ నొప్పులు వచ్చును. జ్వరము డెబ్బది రెండు గంటలుండును. ఇందు మరణించుట ఎన్నటికిని జరుగదు. ఈ జ్వరము ఒకసారి వచ్చినచో తిరిగిరాదు.
5. ఎలుకకాటు జ్వరము : ఎలుక కాటువలన అందచేయబడిన స్పయిరలం మైనస్ అను క్రిమి సంబంధమైన రసివలన ఇది వచ్చును. కాటువేయబడినచోట నొప్పియుండును. మాంసగ్రంథులు వాయుటకూడ జరుగవచ్చును. జ్వరము సుమారు ఆరుదినముల కొకసారివచ్చి ఒకటి రెండు దినము లుండును. ఆర్సెనికలు ఔషధములును, పెన్సిలిన్ ఔషధమును ఈ వ్యాధిని పోగొట్టును.
6. చలిజ్వరము (మలేరియా) : ఆడ ఎనాఫిలైన్ దోమల మూలమున ఈ వ్యాధి ఒకరి నుండి మరి యొకరికి అంద జేయబడును. మలేరియా అన్యాధారజీవి (పారసైట్). కొంత కాలము మానవులందును, మరికొంత కాలము దోమ యొక్క గర్భపు గోడయంచును పెరుగును.ఈ అన్యాధార జీవులు రక్తములో ప్రవేశింపగనే శక్తిమంతములగును. అంకురించు కాలము 12 రోజులు. ఈ కాలములో అన్యాధారజీవి కాలేయములో పెరుగును.
సాధారణమలేరియా వ్యాధియందలి దశలు :
(1) ఉత్పత్తిదశ : ఇందు కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు ఉండును.
(2) వణకువచ్చు దశ : ఇందు వణకు, జ్వరము హెచ్చుట యుండును. ఇది అరగంట మొదలు రెండు గంటలవరకు ఉండును
(3) అధికజ్వరముండు దశ : ఎక్కువ ఉష్ణోగ్రత యుండును. కాని వణకుట యుండదు. ఈ పరిస్థితి 4 గంటలు మొదలు 6 గంటలవరకు ఉండును.
(4) చెమటపట్టు దశ : చెమటపట్టి శరీర ఉష్ణోగ్రత మామూలు స్థితికి వచ్చును.
మలేరియా వ్యాధియందలి వివిధ రకములు :
1. చినైన్ టర్షియన్ : ఇందు రోజువిడచి రోజు జ్వరము వచ్చును.
2. క్వార్టన్: ఒకరోజు జ్వరమువచ్చి మరల రెండు రోజులు మాని మరల మూడవనాడు వచ్చును.
పటము 6.మూడు రకముల చలిజ్వరపు పటము
3. మాలిగ్నెంటుటర్షియం: ఈ వ్యాధి సోకినపుడు మిగుల ప్రమాదకరములగు ఈక్రింది రుగ్మతలు రావచ్చును.
(ఆ) మెదడు చలిజ్వరము (సెరిబ్రల్ మలేరియా) : ఇందుసంధించుట, మూర్ఛపోవుట, స్మృతి తప్పుట జరుగును.
(ఆ) జ్వరతీవ్రత ఎక్కువగుట: ఇందు ఉష్ణోగ్రత 107° - 111° ల వరకు ఉండును.
(ఇ) వాంతులు, నీటి విరేచనములు, కడుపునొప్పి.
(ఈ) పైత్యసంబంధమైనవి ; ఇందు స్వల్పముగా కామేరలు వచ్చును.
(ఉ) సల్లనీటి జ్వరము : రోగి హఠాత్తుగా నల్లనిరంగు గల మూత్రమును విసర్జించును.
రక్తములోని ఎఱ్ఱ కణములు నశించుటవలన మూత్రములో హెమోగ్లోబిక్ రూపాంతరము లుండును.
దీర్ఘ కాలముగ నున్నచో మలేరియా రోగిని అశక్తుని చేయును. మరియు ప్లీహ, కాలేయములు పెరుగుటకును, పాండు రోగమునకును హేతువగును. ఇందులకు తీసికొనవలసిన నివారణ చర్యలు :
(1) దోమల బాధ గల ప్రదేశములనుండి దోమలను డి. డి. టి మొదలగు సాధనములద్వారా నిర్మూలించుట.
(2) వ్యక్తిగత జాగ్రత్తలు : (i) దోమ తెర నుపయోగించుట (ii) పగలు సరియగు దుస్తులను ధరించుట. (iii) మీథైక్ థేలేడ్ వంటి మందులను ముఖము, కాళ్ళు, చేతులు మొదలగు దోమకాటుకు గురికాగల అవయవము ఉష్ణమండలపు వ్యాధులు లపై రాచుకొనుట, (iv) క్లోరోక్వింగాని, పాలొ డ్రిన్ గాని వారమునకు ఒకమారు తీసికొనుట,
జ్వరము వచ్చినపుడు ఈ క్రింది ఔషధములలో దేనినైనా సరియగు మోతాదులలో నుపయోగింపవచ్చును. (1) క్వినైన్ (2) మెపాకై (3) పాలో డ్రిస్ (4) క్లోరో క్విన్ (5) డారాప్రిం. నల్లనీటిజ్వరము వచ్చినపుడు రక్తమును ఎక్కించుటవలన ప్రాణసంరక్షణము కలుగును.
7. విషపాండు జ్వరము (కాలాజార్) : వీష్ మన్ డొనవాన్ క్రిములవలన కలుగును. ఇవి నెత్తురులోను, ఎముకల లోను, అంతర్భాగ అవయవములలోను ఉండును. ప్లబాట మస్ అను ఎగి రెడు పురుగులు దీనిని వ్యాపింపచేయును. ఇది మదరాసు, అస్సాం, బెంగాలు రాష్ట్రములలో వచ్చును. ఇది మధ్యధరా ప్రాంతములో శిశువ్యాధి రూపమున వచ్చును. అంకురించుకాలము 1-12 మాసముల తర్వాత. (1) జ్వరము రోజుకు రెండుసార్లు హెచ్చును. (2) చర్మము నల్ల బడును. (3) రక్తము తగ్గిన శరీరము పాలిపోవును. (4) బరువుతగ్గును. (5) కాలేయము, ప్లీహము పెద్దవి యగును. అంటిమనీ ఔషధములను సూదిమందుద్వారా యిచ్చినయెడల గుణము కనబడును.
ట్రైపైన సోమయాసిన్ : ఇది ట్రివను సోనూ, రొడిసియం మరియు గాంబియంసీ అను జీవాణువులచే వ్యాపిం చుమ. సిర్సి అను ఈగచే ఒకరినుండి మరొకరికి అందచేయబడును. ఇది ఆఫ్రికాఖండమందలి ఉష్ణమండల ప్రాంతములో
మాత్రమే వచ్చును. మాంసగ్రంథులు వాయుట, అప్పుడప్పుడు చర్మముమీద పొక్కులు వచ్చి పోవుట, జ్వరము, నిద్రాబద్ధకము అధికముగా నుండుట, మానసిక అస్వస్థత దీని లక్షణములు. దీనికి ఆర్సనిక్ లేక ట్రిపార్సమైడు ఔషధములతో చికిత్స చేయవలెను.
టైఫస్ జాతికి చెందిన జ్వరములు: రికెట్సియ అను అన్యాధారజీవివలన ఇది సంభవించును. ఇంతవరకు ఈ క్రింది రూపములు తెలిసియున్నవి :
(అ) చిరకాలముగ తెలిసియున్న జాతి: ఇది పేలవలన వ్యాపించును. (ఆ) మురైన్ జాతి: ఇది ఎలుకల శరీరముమీది తుళ్ళుపురుగుల (ఫ్లిస్) వలన కలుగును. (ఇ) రాకీవర్వత మచ్చల జ్వరము : టిక్సు అను పేరు గల ఒక రకపు ప్రాకెడు పురుగువలన వచ్చును. (ఈ) మైట్స్ జ్వరము : 8 కాళ్ళు గల ఒక జాతీ పురుగువలన సంభవించును. (ఉ) క్యు జ్వరము : ఇది జంతువులనుండి మనుష్యులకు టిక్సువలన వ్యాపింపచేయబడును. (ఊ) ట్రెంచి జ్వరము : ఇది పేల ద్వారా వ్యాపింప చేయబడును.
ఈ రకములకు చెందిన వ్యాధి ఫలానాయని నిర్ధారణ చేయుట రక్త పరీక్ష ద్వారా సాధ్యము. దీనినే వీవ్ ఫేలిక్సు పరీక్ష యందురు.
ఈ వ్యాధి అంకురించు కాలము 5 మొదలు 20 దినములు వరకు ఉండును. తర్వాత జ్వరము వచ్చును. ఇది యిందలి మొదటి ప్రత్యేకత. విషజన్య రక్తదోషము రెండవ ప్రత్యేకత. సంధించుట మూడవ విశిష్ట లక్షణము. 4 వ లేక 5 వ దినమున శరీరమున మచ్చలు కనబడుట 4వ లక్షణము. రక్తములోని తెల్లకణము లెక్కు వగుట అయిదవ లక్షణము. జ్వరము 12 మొదలు 15 దినముల వరకుండును. ఆర్యోమైసిన్, టెఱ్ఱమైసిన్ మొదలగు జీవాణు వ్యతిరేక ఔషధముల నుపయోగించుచు చికిత్స చేసిన యెడల గుణము కనబడును.
పసుపుపచ్చ జ్వరము (ఎల్లో ఫీవర్) : ఈడిస్ ఈజిప్టియై యమ ఒక విధమైన దోమచే వ్యాపింపచేయబడిన రసి ద్వారా ఇది అంకురించును. జ్వరము, కామెరలు, నల్లటి వాంతులు, ఒకప్పుడు నెత్తురు పొక్కులు ఉండును. అంత రించు కాలము 3 మొదలు 5 దినముల వరకుండును. ఈ వ్యాధి భారతదేశమందులేదు. ఆఫ్రికా, దక్షిణ అమెరి కాలయందు కలదు. ఈ రసి భారతదేశమున ప్రవేశ పెట్టబడకుండ విమాన కేంద్రములందు తీవ్ర నిరోధక చర్యలు తీసికొనబడుచున్నవి. ఇది రాకుండ టీకాలు వేయించు కొనుటకు వీలున్నది.
బొబ్బలరోగము (ప్లేగు) : ఇది చాల త్వరితముగా వ్యాపించు అంటువ్యాధి. ఇది బాసిలన్ పెస్టిస్ అను సూక్ష్మక్రిముల మూలమున అంకురించును. ఈ వ్యాధి కేంద్రములు ఉత్తర హిందూస్థానము, చైనా, మంగోలియా, ఉగండాలలో గలవు. ఈ వ్యాధి ఎలుకలద్వారా వ్యాపించును. ఎలుకలు చావగనే వాని పైగల త్రుళ్ళు పురుగులు వాటిని వదిలి మానవులను కరచును. వ్యాధి ఈవిధముగా వ్యాపించును. ఇది అంకురించు కాలము 2 మొదలు 10 దినముల వరకు ఉండును. మిక్కిలి ఉష్ణోగ్రత, రక్త విషదోషము, సంధించుట ఉండును. ఇందలి వివిధ రూపము లీ క్రింద పేర్కొనబడినవి :
(1) బ్యూబొనిక్ రూపము: గజ్జలు, చంకలు, లేక మెడయందలి మాంసగ్రంథులు ఉబ్బును. ఇది మిగుల వ్యాప్తిలో నున్న రకము.
(2) సెప్టిసీమియా: ఇది మిగుల ఉపద్రవకరమైనది.
- (3) హఠాత్తుగా జ్వరమువచ్చి 3 లేక 4 గంటలలో నే మనుష్యుడు చనిపోవురకము.
- (4) శ్లేషాధిక్య రకము.
- (5) హఠాత్తుగా వచ్చి దానంతట అదేపోవును.
- (6) జ్వరము వచ్చినను నడచుటకు చిక్కు ఉండని రూపము. ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్యలు :
- 1. ఎలుకల యొక్కయు విషజీవుల యొక్కయు స్థావరములను నిర్మూలించుట.
- 2. టీకాలు వేయించుకొనుట.
- 3. రోగులను, వారికి సంబంధించినవారిని వేరుచేసి వ్యాధి వారిద్వారా యితరులకు వ్యాపింపకుండ చేయుట.
సామాన్యముగ వచ్చు బ్యూబోనిక్ రూపములో వ్యాధి సోకినప్పుడు సల్ఫాడయాటివ్ మాత్రలు ఇయ్యవలెను. మరియు స్ట్రెప్టోమైసిన్ పెద్ద. మోతాదులో సూది
మందుగ ఇయ్యవలెను. ఈ విధమైన చికిత్సవలన మరణములు తక్కువగా సంభవించుట మన అనుభవములోని విషయము.
కలరా : ఇది భారతదేశమున అంటువ్యాధి. నీరు, ఈగలు, సన్నిహితత్వము దీనివ్యా ప్తికి కారణములు. దీనికి కారణమైన సూక్ష్మజీవి పేరు విబ్రియో కలరా, అంకురించుకాలము 3 మొదలు ఆరుదినములవర కుండును, ఆ పిమ్మట, నిరంతరవాంతులు, విరేచనములు, తిమ్మిరులు, నిస్త్రాణతో వ్యాధి ప్రారంభమగును. రోగి ఈ నిస్త్రాణతో ప్రారంభఘట్టమందే మృతినొందనియెడల తర్వాతిఘట్టములో జ్వరముండును. నిరోధక టీకాలు ఈ వ్యాధి రాకుండ నెలలతరబడి కాపాడును, ఇందు కోల్పోయిన ద్రవలవణములను భర్తీచేయుటయే చికిత్స యొక్క ప్రథ మాశయము. నీళ్ల విరేచనములను ఔషధములవలన అదుపులోనికి తేవచ్చును.
రక్తగ్రహణి (డిసెంట్రీ) : తరచుగా మలవిసర్జన జరుగును. అందు శ్లేష్మము, రక్తము ఉండును. ఇందలి ప్రధానరకములు :
- (1) సూక్ష్మక్రిములవలన వచ్చిన రక్తగ్రహణి : ఇది తీవ్రమైనది. దీర్ఘకాల ముండును.
- (2) ప్రొటోజోవల్ రక్తగ్రహణి: ఇందలి రకములు.
- (ఎ) ఎంటమీబా హిస్టాలిటికా.
- (బి) చెలాంటిడియం కోవై.
- (సి) జియార్కియా.
- (డి) యం. టే. మలేరియా,
- (ఇ) కాలాజార్ .
- (3) ఒక విధమైన గుండుపాములచే కలుగునది.
- (4) బల్లపరుపు పురుగులచే కలుగునది దాని పేరు సిష్ట సోమయాసిన్,
సూక్ష్మక్రిములవలన వచ్చు రక్తగ్రహణి : ఇది అనేక రకములైన రక్తగ్రహణి జీవాణువులచే సంభవించును. షీగారకము బహుతీవ్రమైనది. నీటి మూలమునను, ఈగల మూలమునను ఇది వ్యాపించును. వర్షకాలమం దిది అంటు వ్యాధిగ సంభవించును. ఇది అంకురించుకాలము 1 మొదలు 7 దినములవర కుండును. ఇది జ్వరము, వికారము, వాంతులు, తలనొప్పి, తరచుగ రక్తశ్లేష్మములతో కూడిన విరేచనములు, విరేచనములకు పూర్వము కడుపునొప్పి వీటితో ప్రారంభమగును. ఈ వ్యాధి స్వయంపరిమితము. రోగి సామాన్యముగ ఒక వారము రోజులలో స్వస్థత పొందును. రోగి బలహీనత పొందినచో సైలన్ ద్రవములు ఇయ్యవలెను. ఆహారము ద్రవరూపముగ నుండవలెను, సల్ఫాగ్వనడీన్, దేలిల్, సల్ఫాఫైజల్ లను సరియగు మోతాదులలో నియ్యవలెను. ప్రారంభములోనే యియ్యబడినయెడల ఇవి వ్యాధి యొక్క ఉద్ధృతిని ఎదుర్కొనును.
ఇంద్రియరహిత క్రిమి సంబంధమైన రక్తగ్రహణి (ఎమేటిక్ డిసెంట్రీ): చెడిన నీరు, కూరగాయలవంటి ఆహార పదార్థములు, వీటినుండి వాహకములద్వారా అంద చేయబడును. జ్వరము, నెత్తురు, చీము గల విరేచనములు, విరేచనములకు పూర్వము కడుపునొప్పి యుండును. ఇది మిగుల దీర్ఘ కాల వ్యాధి. మలమును పరీక్షించగా అంటమీ బహిస్టాలిటి కాయను సూక్ష్మక్రిములు గోచరించును. ఇందులకు చేయవలసిన చికిత్స :
(1) ఉధృతరూపములను నశింపచేయుటకు ఎమిటిన్ ½ గ్రయిస్ సూదిమందు ద్వారా ఎనిమిది దినములు ఇచ్చుట, అవసరమైనచో ఆరోమైసిన్ లేక పెఱ్ఱమైసియంను ఆరు మొదలు ఎనిమిది దినములవరకు ఇచ్చుట.
(2) తర్వాత పూర్తి ఉపశమనము కలుగుటకు
(అ) ఎమోటిన్ బిస్మత్ అయొడైడ్ మాత్రలను 10 దినములు ప్రతి రాత్రియు 1½ గ్రయిన్లు ఇచ్చుట.
(అ) కార్ బార్సన్ మాత్రను ప్రతిసారి ఒకటి చొప్పున దినమునకు రెండుసార్లు పది దినములు ఇచ్చుట.
(ఇ) డయొడోక్విన్ మాత్రలను రోజుకు 3 సార్ల చొప్పున రెండు మూడు వారములు ఇచ్చుట.
(ఈ) చీనోఫారమును నీళ్ళలో కలిపి ఎనీమాను ఇచ్చుట. ఆ నీరు చాల సేపు లో నుండవలెను.
ఈ రకపు రక్తగ్రహణియందు వచ్చు క్లిష్ట పరిస్థితి. కాలేయములో కురుపు పుట్టుట, ఎమాటినును వరుసగా కొన్నాళ్ళు ఇచ్చి ఆ పిదప బ్లోరోక్విన్ మాత్రలు ఇచ్చిన యెడల తరచుగా నయమగును. కాలేయములో చీము ఏర్పడిన యెడల సూది ద్వారా చీముతీసివేయవలసివచ్చును. ఒక్కొక్కప్పుడు శస్త్రచికిత్స పెక్కు పర్యాయములు చేయుట అవసరనుగును. జిరర్డియాసిస్ : ఇది జిరర్డియాయను అన్యాధారజీవిచే రక్తగ్రహణి లక్షణములతో వచ్చును. అవి మలమునందు కనబడును. మెపాక్రైన్ మాత్రలను 5 దినము లిచ్చిన యెడ నయమగును.
పటము 7.
1. సిష్టసోమా అన్యాధార జీవి- మగది - ఆడుది.ఇది ఈజిప్టులో రక్తగ్రహణికి కారణమగుమ, 2. పైదాని గ్రుడ్డు. 3. సిష్టసోమా హెమటోబియం యొక్క గ్రుడ్డు - దీని వలన మూత్రములో నెత్తురు పడును.
స్కిప్టో సోమా రక్తగ్రహణి : ఇందు మూడు రకములు గలవు.
- (1) మూత్రములో రక్తము వచ్చునది. ఉదా : సి. హెమటోబియం
- (2) సి. జపానిక
- (3) సిమాన్సని.
రక్తగ్రహణికారణములైన వీటి గ్రుడ్లు మూత్రములోను, విరేచనములోను దొరకును. ఇవి నీటిలోపడి పగిలి, మిరానిడియం అను ఈదెడుపురుగులు బైటికివచ్చును. ఇవి ఒక విధమైన నత్తగుల్లల శరీరమును పొడుచుకొని లోనికి పోవును. నత్తగుల్లల ఊపిరితిత్తులలోను పేగులలోను గ్రుడ్లుగామారును. 14 రోజుల తర్వాత ఇవి పగిలి నత్తగుల్ల నుండి బైటికివచ్చి నీళ్ళలో ఈదును. వీటిని సర్కేరియా అందురు. ఇవి మనుష్యుల చర్మములోపల గుచ్చుకొని రక్తములో ప్రవేశించి మూత్రతిత్తి మలనాళపు గోడలలోనికి వెళ్ళి పెద్దవై గ్రుడ్లను పెట్టును. ఇవి అంటిమనీ ఔషధములవలన అంధిమోమలీన్ లేక ఫాడిన్ ఆను ఆంటిమనీ సూదిమందులవలన నయమగును. మిరాసిల్ -డి గోలీలు తీసికొనిన గ్రుడ్లు పెట్టుట ఆగి వ్యాధి నయమగును.
గుండుపాములవలన సంభవించెడు రక్తగ్రహణి : ఇది ఉత్తరనై జీరియాయందు మాత్రమే వచ్చెడు వ్యాధి. పెద్ద పేగు యొక్క గోడలలో ఆపాము తనగ్రుడ్లను పెట్టును. అవి పెరిగి పెద్దవి కాగానే పెద్ద పేగు గోడ పగిలి అవి ఉన్న చోటునుండి కదలి రక్తగ్రహణి నుత్పత్తిచేయును.
ఇతర వ్యాధులవలన వచ్చు రక్తగ్రహణి (సింప్టోమేటిక్ డిసెంట్రీ) : మలవిసర్జన ప్రేగులో కాన్సరు రోగము వలనను మెర్క్యురీ మొదలగు పాషాణములు తినుటవలనను రక్తగ్రహణివంటి వ్యాధిలక్షణము లుండును.
అంటువ్యాధులు :
1. మసూచి (స్మాల్ పాక్సు): ఇది చాల అంటు వ్యాధి యైన ప్రేలుడు రకపు జ్వరము. ఇది రసివలన కలుగును. గాలితో వ్యాపించును. ఇది రెండు రకములు. (1) ప్రాచీనమైన రకము. ఇది బహు తీవ్రమైనది. (2) టీకాలు వేయించు కొనుట వలన పరిణతి చెందిన రకము. ఇది అంకురించు కాలము 12 దినములు. ఇందులకు నాందీ ప్రస్తావనగా 3 దినములు జ్వరము కాయును. చెమట పట్టుట, వీపునొప్పి.. ఆ జ్వర లక్షణములు. 4 వనాడు మొదట నుదుటి పైనను, చేతుల మీదను, అరికాళ్ళయందును పొక్కులు పోయును. జ్వరము తగ్గిపోవును. ఐదవ లేక ఆరవరోజున ఆ పొక్కులలో నీరుచేరును. ఎనిమిదవ నాటికి అనీరు చీముక్రిందమారి మరల జ్వరమువచ్చును. పొక్కులమధ్య లోనికి గుంతయుండును. ఇరువది యొకటవనాటినుండి పొక్కులు ఎండి రాలిపో నారంభించును. టీకాల వలన పరిణతి చెందిన రకములో పొక్కులు తక్కువ. అనుబంధజ్వర ముండదు. పొక్కులు లేచినచో ఇంకిపోవునేగాని అన్ని ఘట్టములను దాటవలసిన పనియుండదు. ఇందలి రకములు -- (1) తీవ్రము కానటు వంటిది. (2) మిశ్రమమైనది. (3) హానికరమైనది. టీకాల వలన అధికమగు నిరోధనశక్తి ఏర్పడును. ప్రతి ఐదు లేక పదేండ్లకు టీకాలు వేయించు కొనవలెను. పిల్లలకు టీకాలు వేయించుటకు 3 వ మాసము ఎక్కువ తగినకాలము. టీకాలు వేయించిన పిమ్మట వచ్చుటకు అవకాశముగల క్లిష్టపరిస్థితులు—— (1) సామాన్యమగు పొక్కులు లేచుట.
(2) అనుబంధ సంపర్క దోషము (3) మెదడువాపు (ఎన్ కెఫలైటీస్). వ్యాధిలక్షణానుసారముగ చికిత్స చేయవలెను.
2. ఆటలమ్మ (చికెన్ పాక్సు): ఇదికూడ మిగుల అంటువ్యాధి. ఇది రసివలన కలుగును. గాలివలన వ్యాపించును. సాధారణముగ ఇది పిల్లలకు సంభవించును. జ్వరము వచ్చిన 24 గంటలలో నీటిబిందువులవంటి పొక్కులు ఒకటి వెంబడి ఒకటి పుట్టలుగా లేచును. వీటితో పాటు జ్వరముండును. శరీర కాండము పై ప్రారంభమై పొక్కులు బైట ప్రాంతమునకు వ్యాపించును. వ్యాధి పదిరోజులకన్న ఎక్కువకాల ముండదు.
పటము 8. డింగూజ్వరపు జ్వరపటము
3. పొంగు లేక వేపపువ్వు (మీజిల్పు) : ఇది ఒక రకపు రసివలన కలుగును. ఇది అంకురించుటకు పట్టెడు కాలము 7 మొదలు 14 దినములవరకు ఉండును. మొదటి నాల్గు దినములు జ్వరము, ముక్కు, కండ్లనుండి నీరుకారుట, దగ్గు, నోటిలో పండ్ల వెనుక భాగమున తెల్ల మచ్చలు (కాప్లిక్ స్పాట్సు) ఉండును. ఇందు ప్రత్యేకముగ ఎఱ్ఱ మచ్చలు 4 వ రోజున కనబడును. మచ్చలు ఎదిగినకొలది జ్వరముకూడ హెచ్చును. అవి ఆరవరోజున కాని ఎనిమిదవ రోజునకాని తగ్గును. ఇందలి వివిధరకములు : (1) సాధువైనది (2) ప్రమాదకరమైనది (3) ఊపిరితిత్తులకు సంబం ధించినది. ఈ వ్యాధి ప్రారంభమందే శ్లేష్మాధిక్యజ్వరము రావచ్చును. వ్యాధివచ్చి తగ్గినవారి రక్తము 10 సి. సి. పిల్లలకు సూదిమందుగా నిచ్చిన వ్యాధి రాకుండుట, ఒకవేళ వచ్చినను సాధువుగావచ్చుట జరుగును. వ్యాధి లక్షణానుసారముగా చికిత్స చేయవలెను.
4. జర్మన్ పొంగు (రుచెల్లా) : ఇది చాల అంటువ్యాధి. రసిద్వారా వ్యాపించును. అంకురించుకాలము 14 మొదలు 19 రోజులవరకు ఉండును. ముక్కకారు లక్షణము లిందుండవు. జ్వరము వచ్చిన 24 గంటల లోపుననే పొక్షులు కనబడును. అవి పొంగులోవలెనే లక్షణములు కలిగి యుండును. మాంసగ్రంథులు తరుచు ఉబ్బుచుండును. ఈ వ్యాధి ఎక్కువ తికమకలు లేకుండగనే గడచిపోవును. పొక్కులు రెండుమూడుదినము లుండును.
ఎముకలు మరియు కీళ్ళ నొప్పులతో వచ్చు జ్వరము (డింగూ) : రసిద్వారా కలిగి ఈడిస్ దోమలచే వ్యాపింప చేయబడును. అంకురించుకాలము 3 మొదలు 7 దినముల వరకు ఉండును. మూడురోజులు జ్వరము, దానితోపాటు నడుము నొప్పి, కీళ్లనొప్పు లుండును. నాలుగవ దినమున ఉష్ణోగ్రత తగ్గిపోవును. కొద్ది గంటలతర్వాత మరల హెచ్చి జ్వరము మరి మూడునాళ్ళు ఉండును. అప్పుడు ఉష్ణోగ్రత సాధారణస్థితికి (నార్మలు) వచ్చును. పొంగుతో వచ్చు పొక్కులవంటివి 4 వ నాడు ఉష్ణోగ్రత హెచ్చినపుడు కనబడిన కనబడవచ్చును.
ప్రేగులలోని అన్యాధార జీవులు:
(1) కడుపులో పాములు (ఎస్ కారిస్ లుంబ్రికాయిడిన్): దీనినే ఏలుగు పాము అందురు. దీని సగటు పొడవు 8 అంగుళములు.
జీవిత చరిత్ర: ఆడుది దినమునకు 2 లక్షల గ్రుడ్లు పెట్టును. ఆ గ్రుడ్లు 5 లేక 6 సంవత్సరములవరకు జీవించ గలవు. అవి విరేచనములో బైటికివచ్చును. ఈ గ్రుడ్డు ఆహారముద్వారా కడుపులోనికి పోయినచో అవి ప్రేగులో పగిలి ప్రాకుడు పురుగులు బైటికివచ్చును. అవి ప్రేగు గోడను పొడుచుకొని రక్త ప్రవాహము ద్వారా ఊపిరితిత్తులలోనికి చేరును. అచటినుండి గాలి గొట్టములోనికి, అచటినుండి గొంతుద్వారా ప్రేగులలోనికి పోవును. ఈ జీవియొక్క సంయోగము అధికమైనయెడల 9 వ రోజున
శ్లేష్మాధిక్య జ్వరము వచ్చును. పిల్లలతో గుండ్రపు పాము లుండుట సామాన్య విషయము. వాటివలన, జ్వరము, మూర్ఛ, చిక్కి పోవుట, ఆకలి లేకుండుట మొదలగు వ్యాధులు వచ్చును. ఒక్కొక్కప్పుడివి ప్రేగులలో అడ్డును గూడ కలిగించును. వీనిని నిర్మూలించుట కుపయోగపడు ఔషధములు : (1) సంటోనిన్ (8) హేటరోజూన్ (3) ఎంటసిల్ గోలీలు (పిపరిజీన్).
(2) కొంకె పురుగు (అంథెలోస్టోమాడియోడినాలీ) లేక హూకవరం : మగపురుగు యొక్క పరిమాణము 8 మొదలు 11 మిల్లిమీటర్లవరకు ఉండును. ఆడుదాని పొడవు 10 మొదలు 18 మిల్లిమీటర్ల వరకు ఉండును. నోటి భాగములో పండ్లుండును. వాటి సహాయమున ఇది ప్రేగులలో కరచిపెట్టుకొని రక్తమును త్రాగును. రక్తము పోవుట వలన రోగి శరీరములో ఇనుము లోపించును. అందువలన తీవ్రమైన రక్తలోపము వచ్చును. లోపముమ సరిచేయుటకు ఇనుమును లోపలకు ఇచ్చుట,హెమోగ్లోబిన్ నూటికి 50 వంతులు అయినప్పుడు పురుగులను నిర్మూలించుట. అందులకు ఉపయోగపడు ఔషధములు : (1) కార్బన్ టెట్రక్లోరైడ్ (2) పెట్రక్లోరోయిధ లీన్ (3) ఓలియం చినసోడియం (4) థైమాల్.
జీవిత చరిత్ర : గ్రుడ్డు మలములోనుండి బైటికి వచ్చును. అది పగిలి ప్రాకుడు పురుగులై మనుష్య చర్మమును పొడుచుకొని రక్తముతోపాటు ఊపిరితిత్తుల లోనికిచేరి అచటినుండి గాలిగొట్టముద్వారా గొంతు నుండి ప్రేగులలోనికి చేరును.
(3) నులిపురుగు (త్రెడ్ వరమ్) : మగపురుగు 2.5 మిల్లిమీటర్లు, ఆడపురుగు 9 మొదలు 10 మిల్లిమీటర్ల వరకును పొడుగుండును. ఇది పిల్లలలో సామాన్యము. అది రాత్రులందు మలద్వారము ద్వారా బయటికి వచ్చి చర్మముమీద గ్రుడ్లను పెట్టును. దీనివలన ఆయా భాగములందు దురద బుట్టి పిల్లలుగోకుదురు. చేతికి గ్రుడ్లు అంటుకొని నోటి ద్వారా కడుపులోనికి పోవును. మలద్వారము చుట్టును మెర్క్యురీమలామ పెట్టి చెడ్డీ, తొడగవలెను. (1) జంక్షన్ వయలెట్ గోలీలు, (2) యేంటనిల్ గోలీలు (పిపరజీన్) లేక (3) డైఫినా గోలీలు ఇచ్చిన, పురుగు చచ్చును.
(4) ట్రికినెల్లా స్పయికోలిస్: మగదాని పొడవు 1.6 సెంటి మీటర్లు, ఆడుదానిపొడవు 3.4 సెంటీమీటర్లు ఉండును. ఈ గ్రుడ్లతో నిండిన పంది, అడవిపంది మొదలగు జంతువుల మాంసము సరిగావండకుండా తినిన యెడల ఈ అన్యాధార జీవులు 48 గంటలలో పెద్దవై ఆడ మగ పురుగులు తయారగును. మరి 24 గంటలలో ఆడపురుగు గర్భముదాల్చి గ్రుడ్లను పెట్టును. గ్రుడ్లు పగిలి ప్రాకెడు పురుగులు తయారై ప్రేగులు పొడుచుకొని కండరములలో ప్రవేశించును. అచట అవి గ్రుడ్లుగామారును. ఈ వ్యాధిలో ఏవిధమైన బాహ్యచిహ్నము లేకుండుట కాని కండర నొప్పులుండుటకాని జరుగవచ్చును. హృదయ కండరముల కివి సోకి హృదయము చెడిన సూచనలు కానవచ్చును. కండరములోని ఒక తుమకను పరీక్షించి తద్వారా రోగనిర్ధారణ చేయుదురు.
బల్లపరుపు అన్యాధారజీవులు (టేస్ వరము):
(1) టేనియా సోలియం : దీని పొడవు సుమారు 10 అడుగులు. దీని తలయొక్క వ్యాసము ఒక మిల్లీమీటరు. ఇది గుండ్రముగా నుండును. దాని చుట్టును 25 మొదలు 50 వరకు చిన్ని ముళ్ళుండును. గుండ్రని పీల్చు సాధనములు నాలుగు కలవు. మెడ చిన్నదిగా నుండి అది ఖండములుగా విస్తరించును. ఈ ఖండములను పార్లటైడ్సు అని పిలుతురు. ప్రతిదానియందును మగదాని యొక్కయు, ఆడుదాని యొక్కయు అవయవము
పటము 9. బల్లపరుపు అన్యాధారజీవి
- డి :తల
- డి ' : ఎదిగిన ఇండములు
- ఇ : టి. ఎ. థినోకకస్ X 10
- యఫ్ : హైడిటిడ్ సిస్టు
పటము 16. అన్యాధార జీవుల గ్రుడ్లు
- ఎ : నులిపురుగు గ్రుడ్లు
- బి : ఏలికపాముల గ్రుడ్లు
- సి : విష్ వరం గ్రుడ్లు
- డి & ఇ : బల్లపరుపు అన్యాధారజీవుల గ్రుడ్లు
- యఫ్: కొంకిపురుగు గ్రుడ్లు
- జి & హేచ్} ఒక రకమైన బల్లపరుపు అన్యాధార జీవుల గ్రుడ్లు
లుండును. కాని అవి వేర్వేరు కాలములలొ పరిపక్వములగును. ఆఖరు ఖండములు పరిపక్వమై గ్రుడ్లతో నిండి యుండును, అవి అప్పుడప్పుడు మలములో పడుచుండును. భూమిలోని మెత్తనిభాగము విడిపోయినప్పుడు గ్రుడ్లు వేరగును. పంది ఆమలమును తినునప్పుడు పురుగులుకూడ లోనికిపోయి దాని ప్రేగులలో గ్రుడ్లు పరిపక్వములై గ్రుడ్డులోనుండి వచ్చిన పిల్లలు ప్రేగులను పొడుచుకొని జంతువుల యొక్క కండరములను చేరును. అచట అవి గ్రుడ్లుగా మారును. దానినే 'సిస్టిసర్కస్ సెల్లిలో జె' యందురు. మానవులు క్రిమిభూయిష్ఠమగు పందిమాంసమును తినగనే అగ్రుడ్లు ప్రేగులలోనికివచ్చి మరల బల్లపరుపు అన్యాధార జీపు లగును. ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్యలు :
(1) క్రిమిభూయిష్టమగు మాంసము తినకుండుట.
(2) ఎకార్టు పెలిసిస్ ద్రావకముద్వారా బల్లపరుపు అన్యాధార జీవులను నశింపచేయుట.
(3) శిరస్సు బైటికి రానియెడల పురుగులు మరల పెరుగుట కవకాశమున్నది. తద్వారా పదేపదే చికిత్సచేయుట అవసరమగును.
టేవియా సజినేటా : ఇది మరియొక రకపు బల్లపరుపు అన్యాధారజీవి. దీని పొడవు 14 అడుగులు. కాని యిది వ్యాపించుటకు తోడ్పడు మధ్యస్థానము ఎద్దు. డైబాత్రో కెఫేలస్ లేటస్ ఫిన్లండు దేశమందు కానవచ్చు ఒక రకపు బల్లపరుపు అన్యాధారజీవి. ఒకరకపు పాండురోగ కారణమైన ఈజీవి చేపద్వారా వ్యాపించును.
ఒకప్పుడు పందికిమారుగా మనుష్యులే మధ్యస్థానము లగుట కలదు. ఈక్రిములు మెదడును పాడుచేసి మనుష్యులను మూర్ఛరోగమునకు గురిచేయవచ్చును.
హైడేటెడ్ తిత్తి (హైడేటెడ్ సిస్టు) : ఇది ఒక రకపు బల్లపరుపు అన్యాధారజీవి. దీని పేరు ఎథెనోకోకస్ గ్రాను లోసస్, దీనికి తల మరియు 4 ఖండములు ఉండును. ఇది కుక్క, తోడేలు, పెద్దనక్క యొక్క ప్రేగులలో "పెరుగును.
ఆ గ్రుడ్లు గడ్డిపై పడియుండును. గొజ్జెలు, పశువులు కలుషితమైన ఆ గడ్డిని మేయగనే ఆ గ్రుడ్లు ప్రేగులలోనికి పోయి అచట పగిలి లోననైస్టర్ కార్కప్ అను పరిస్థితి సంభవించుటకు కారణము లగును. కండరములకు మారుగా కాలేయము నందు హైడేటెరిస్టు సంభవించును. ఊపిరితిత్తులు, 'మెదడు మొదలగు అవయవములలో అది అరుదుగా జరుగును. జంతువు మరణించగనే కుక్కలు దాని శరీరమును తినును. తద్వారా అవి హైడ్రేటెడ్ సిస్టులనుకూడ తినగా, వాటి ప్రేగులలో ఈ బల్లపరుపు అన్యాధారజీవు లుద్భవించును. కుక్కల సమీపమున నుండుటవలన మానవులుకూడ దీనికి గురియై గొట్టెలస్థానము నాక్రమించుటయు కలదు. హైడేటెడ్ నిస్టు సాధారణముగ కాలేయములో సంభవించును.
అందుకు శస్త్రచికిత్స అవసరము,
పటము 11 నులిపురుగు'
- ఎ, ఆడు దీ
- బి. మగది
పటము 12 బోదవ్యాధి అన్యాధారజీవి
ఫైలేరియా సిస్ (బోదవ్యాధి): ఈవ్యాధి కేంద్రములు భారతదేశమున గలవు.
ఫైలేరియా బాంక్రా ఫ్లై : మగది 1¾ అంగుళములు. ఆడుది 2½ మొదలు 4 ఆంగుళములవరకు పొడవుండును. పురుగులు కడుపులో శోష వాహకములలో నివసించును. గర్భాశయమునందు గ్రుడ్లుండును. అవి లోపల పొదుగబడి చక్కని పిండతిత్తులు తయారగును. ఆ పిండతిత్తుల నుండి మైక్రో ఫైలేరియా యను చిన్ని పురుగులు వచ్చును. ఈ బోదవ్యాధి సూక్ష్మజీవులు రాత్రులందు మాత్రమే రక్తప్రవాహమునందు ప్రవేశించును. కావున రాత్రిపూట
పటము 13 కొంకి పురుగు
- ఎ. మగది
- బి. ఆడుది
రక్తమును మాత్రమే పరిశోధన కుపయోగించవలేను. కులిసిన్ దోమలు బోదవ్యాధి అన్యాధారజీపులను రక్తముతోపాటు పీల్చును. అవి వాటి శరీరమునందు వృద్ధి చెంది పిమ్మట మరియొకరికి అందచేయబడును. ఒకవ్యక్తిలో బోదవ్యాధి పురుగులుండియు అని బైటికి కానరాకపోవచ్చును. లేదా ఆవ్యక్తికి వరి బీజము, బోద కాళ్ళు, బోద చేతులు, బోద స్తనములు వగైరా వ్యాధులు అంకురించి వృద్ధిపొందవచ్చును. బోద జ్వరము పదేపదే వచ్చుట సామాన్యమగు విషయమే. ఒకప్పుడు శ్వేతమూత్రము, పిష్టమేహము (ఖై లూరియా), ధాతురస వ్యాధి మొదలగునవి కూడ అంకురించును.
ఇందులకు తీసికొనవలసిన ప్రధాన నిరోధక చర్య దోమలను నివారించుట, హెటరోజన్ గోలీల ఉపయోగము బోదవ్యాధి క్రిములను నశింపచేయును. కొన్ని పరిమిత ప్రాంతములలో దానిని చికిత్సకు ఉపయోగింప వచ్చును. దీనితోపాటు జ్వర మున్నప్పుడు పెనిసిల్లిన్ వాడవలెను. బోధవ్యాధి వచ్చినచో శస్త్రచికిత్స అవసరమగును. పై లేరియా మాలాయీ మలయా యందును, మాంసౌ నెల్లాదీ జార్డీ బ్రిటిష్ గినీలోను కలవు. లావాలావా ఆఫ్రికా యొక్క పడమరతీరమున గోచరించువ్యాధి. దీనివలన కెలబారు ఉబ్బుట సంభవించును. అట్లు ఉబ్బుట ధాతువులు, కణుపుసంధులు మొదలగు చోట్ల సంభవించును. నారిపురుగు (డ్రాకున్ కూలస్ మెడినింసిస్) : ఆడ పురుగు 5-6 అడుగులవరకు పొడ వుండును. అనగా సరాసరి 90 సెం. మీ. పొడ వుండును. మగ దానిని చూచినవారెవ్వరును లేరు. బహుశః అది సంభోగ క్రియ అయిన వెన్వెంటనే మృతినొందునేమో! శరీరమందు అనుదినము నీటితో సంపర్కము గల అవయవములే నారి పురుగు అంకురించుటకు గురియగును. కాళ్ళు కడుగుకొనుటకు రోగి దిగుడుబావిలోనికి దిగగానే ఆ పురుగు వ్యాధి క్రిములను నీటిలోనికి విసర్జించును. ఒక రకపు చిన్ని సై క్లోపులు ఈ జీవాణువులను మ్రింగును. అవి లోన వృద్ధిపొందుటకు 4 మొదలు 6 వారములవరకు పట్టును. ఆ నూతి నీటిని త్రాగెడువారు క్రిమి సహితమైన నీటినే త్రాగవలసి యుండును. మనుష్యుల గర్భములో గల హైడ్రోక్లోరిక్ ఆసిడ్ పైక్లోపులను సంహరించును. అప్పుడు వాటియందలి సూక్ష్మక్రిములకు ప్రకోపము కలుగును. అప్పు డా అంతర్గత సూక్ష్మక్రిములు ప్రేగులగోడను పొడుచుకొనివచ్చి అంతర్గత ధాతువులలోనికి చొచ్చి అచట వృద్ధిపొంద నారంభించును. అందులకు సుమారు ఒక సంవత్సరము పట్టును. ఆడుది ఆశ్చర్యకరమగు నైపుణ్యముతో ధాతువుగుండ ప్రయాణించి నీటితో సంపర్కముగల చోటికి వచ్చును. అచట అది శరీరము పొడుచుకొని బై టికివచ్చి తన సంతానమును ప్రసవించును. దిగుడు బావులు లేకుండ చేయుట, తప్పనిసరి యగుచో నీటిని వడగట్టి మరుగకాచి త్రాగుట, రక్షితజల సరఫరాను ఏర్పాటుచేయుట యిందులకై తీసికొనవలసిన నిరోధక చర్యలు. పురుగు బైటికి వచ్చుటకు పూర్వము చర్మమును తీవ్రముగా మండింపచేయును. ఆపురుగు ధాతువులలో చచ్చుటయే జరిగినయెడల నారికురుపు ప్రణము పుట్టును. దానిని ఛేదింపవలసియుండును. పురుగు బైటికి వచ్చునపుడు దాని నెన్నడును లాగుటకాని, తెంపుట కాని చేయకూడదు. అట్లు చేయుట తీవ్రవేదనకు కారణము కాగలదు. ప్రతిదినము ఆ పురుగులో బైటికి వచ్చిన భాగమును పుల్లకు చుట్టి అట్లే యుంచిన క్రమక్రమముగా పురుగంతయు బైటికి వచ్చును.
బల్ల పరుపుపురుగులు (మాక్సు) : వీనిలో పెరాగోనియం రింగేరీ ముఖ్యమైనది. ఇది చైనా, కొరియా, జపాన్ దేశ ములలో గలదు. ఇందుకు మధ్యస్థానము చేప. ఈ బల్ల పరుపు పురుగులు శ్వాసనాళముల మధ్య అడ్డుపడి రక్త కఫరోగమునకు కారణము లగును.
జలసంక్రాప రోగము ( హైడ్రోఫోబియా లేక రేబీస్) : ఇది రసిద్వారా వచ్చును. మరణకారణము కూడ కాగల గడ్డువ్యాధి. ఇది కుక్క, నక్క మొదలగు పిచ్చి ఎక్కిస జంతువుల కాటువలన సంక్రమించును. అంకురించుకాలము 12 దినములు మొదలు ఆరు వారముల వరకు ఉండును. స్నాయువుల ఈడుపు, కండరముల స్తంభన దీని యొక్క లక్షణములు, రోగి మ్రింగుటకు, ఊపిరితీయుటకు అశక్తుడగుట ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణము. ఈ వ్యాధి వచ్చినట్లు స్థిరపడిన మరణము తప్పదు. నిరోధక చర్యలే ఇందులకు అత్యుత్తమచికిత్స. పిచ్చికుక్క ఒక వారము రోజులకన్న ఎక్కువకాలము జీవింపదు. అదీ తెలిసిన కుక్క అయినఎడల దానిని చంపక కట్టివేసి గమనించవలెను. కాని కుక్క తెలిసినది కానియెడల దానిని పిచ్చికుక్కగనే పరిగణించి అందులకు చికిత్స చేయవలెను. వరుసగా 8 మొదలు 10 వరకు సూదులు ఇయ్యవలెను.
కుష్ఠవ్యాధి (లెప్రొసీ): భారతదేశమందలి పెక్కు ప్రాంతములలోను ఆఫ్రికా మొదలగు చోట్లను ఇది దేశ ప్రాధాన్యమగువ్యాధి. మైకో చాక్టీరియం లెప్రొవలన సంభవించును. ఇది ఒకరినుండి మరియొకరికి వ్యాపించగలదు. పిల్లలు దీనికి గురియగు అవకాశ మెక్కువ. చెవిపై తమ్మినుండి చిన్న ముక్కను కత్తిరించి పరీక్ష చేసిన కుష్ఠవ్యాధి క్రిములు కానవచ్చును. అట్లు పరీక్షించి రోగనిర్ణయము చేయవచ్చును. ఈ వ్యాధిలో రెండురకములు తెలిసియున్నవి.
నరముల సంబంధమైనది : సర్సరహితములైన శరీర రంగు పోయిన మచ్చలుండును. ఆ భాగమునకు సంబం ధించిన నాడులు దశమెక్కును. ఆ పిదప కాళ్ళు చేతుల యందలి ఎముకలలో మార్పు వచ్చును. వ్రణములుపుట్టి చేతుల వేళ్ళ యొక్క, కాళ్ళ వ్రేళ్ళ యొక్క కొనలు రాలిపోయి అంగవైకల్య మేర్పడును.
(2) గడ్డలరకము: ముఖముమీద, శరీరముమీద చిన్ని చిన్ని దద్దురులు ఏర్పడుట ఇందలి విశిష్ట లక్షణము. వికృతరూప మేర్పడును. ఈ గడ్డలనుండి కారు రసిలో క్రిము లుండును. '
మిశ్రమరకపు వ్యాధికూడ గలదు. కుష్ఠువ్యాధి దీర్ఘకాల వ్యాధి, అది విజృంభించకుండ అరిగట్టుట మాత్రమే మనము చేయగల చికిత్స, కుష్ఠరోగులను తక్కినవారినుండి వేరుచేయుటకై వారికి ప్రత్యేక నివాస ప్రదేశములు ఏర్పాటు చేసి అందు వారికి నేత మున్నగు వృత్తులను నేర్పవలెను. పిల్లలను వారినుండి వేరుచేయవలెను. వీలగుచో కుష్ఠురోగులకు సంతానము కలుగకుండ నిరోధక చర్యలు తీసికొనవలెను. ఇందులకు జరుగవలసిన చికిత్సలు :
(1) పుష్టికరమైన ఆహారము, కాడ్ లివర్ ఆయిల్ మున్నగు ఔషధములను ఇచ్చి మంచి ఆరోగ్యము లభించుసట్లు చేయుట.
(2) ఇదివరకు చాల కాలము చాల మూగ్రాన్ నూనెను సూదిమందుద్వారా యిచ్చెడివారు. ఇప్పుడా పద్ధతిని వదలి సలో ఫోన్ మాత్రలు నోటిద్వారాకాని, సల్ ఫోనును సూదిద్వారా కాని ఇచ్చుచున్నారు.
వీల్స వ్యాధి (Weils Disease): ఎలుకలు వ్యాధులు యొక్క వాహకములు, వాటి మూత్రమునుండి లెప్టో స్పయిరా, ఇక్టిరో హెమరాజికా, అను జీవాణువులు పడును. అది మురుగుకాలువలు మొదలగు చోట్ల క్రిములను చేర్చును. మానవుల శరీరముపై స్వల్పగాయ ముండి నను తద్వారా అది లోనికిపోవును. అంకురించెడు కాలము 6 మొదలు 12 దినముల వరకు ఉండును. హఠాత్తుగా జ్వరము, ఆయాసము, విషజన్య రక్తదోషము (టాక్సీ మియా) వచ్చును. వ్యాధి తీవ్రముగా నున్నపుడు కామెర్లు కూడ రావచ్చును. -సాధారణముగ గొంతునొప్పి యుండును జ్వరము 7 మొదలు, 14 దినముల వరకుఉండును. వ్యాధి ప్రారంభదళలో పెన్సిలిన్ ఇచ్చిన ఉపయోగకరము. అంటే లెప్టోసయిరల్ సీరం మిగుల ప్రయో జనకారి.
ఏడురోజుల జ్వరము (Seven days fever): ఈ జ్వరము హఠాత్తుగా రసివలన వచ్చును. శరీరమంతటను నొప్పి యుండును. ఏడవనాడు ఉష్ణోగ్రతతగ్గి సామాన్య స్థితికి వచ్చును.
స్పూ (Sprue): ఇందులకుగల కారణము తెలియదు. ఉష్ణమండలములందు మాత్రము ఇది వ్యాపించియున్నది. ఇందలి లక్షణము లన్నియు లేక ఈ వ్యాధి తేలికగావచ్చిన సందర్భములు పెక్కు గలవు. ఇందలి లక్షణము లేవియనగా (1) పాండురోగము, (2) నాలుక ఎరుపెక్కుట, (3) నీరసించుట, (4) ఉదయమున విరేచనములగుట, మలము ఎక్కువగాను, తెల్లగాను, దుర్వాసనగాను ఉండి పరీక్షించిన అందు క్రొవ్వు ఎక్కువగా కనబడును. (5) వీట మినులు లోపించుటకు సంబంధించిన ఇతర లక్షణములు కూడ ఇందు కాననగును.
ఈవ్యాధికి దీర్ఘకాలము, తీవ్రమగు చికిత్స జరుగవలెను. ఈ వ్యాధి సామాన్యముగ తిరుగబెట్టుచుండును. క్రొవ్వు తక్షువై నట్టియు, మాంసకృత్తులు అధిక ముగా నుండినట్టియు ఆహారమియ్యవలెను. వెన్న తీసిన పాలను ఇచ్చుట నిర పాయకరము, ఆసిడ్ హైడ్రోక్లోరిక్ డైల్యూటెడ్ నీళ్ళతో కలిపి నోటిద్వారా పుచ్చుకొనవలెను. లివర్ ఎక్స్ట్రాక్ట్సు, విటమిన్ బి కాంప్లెక్సు, మరియు ఫోలిక్ ఆసిడ్ ఇచ్చిన యెడల పాండురోగము సర్దుకొనును. తీవ్రపరిస్థితులలో రక్తమును ఎక్కించుట ప్రాణసంరక్షకము.
కొండనీళ్ళ విరేచనములు (హిల్ డయేరియా): వేసవికాలములో కొందరు పర్వత ప్రాంతములకు పోవుదురు. అక్కడ వారికి ఉదయము రెండుమూడు విరేచనము లగును. ఆ ప్రదేశమును వడలిరాగానే ఆవ్యాధి తగ్గిపోవును.
జంతువులకాట్లు :
(1) తేలుకుట్టుట : ఇది మిగులు బాధాకరము. ఇందు శరీరజన్య విషముండి అది నాడులపై పనిచేయును. ప్రొకేనును సూదిద్వారా కుట్టినచోట ఎక్కించిన ఎడల నొప్పి తాత్కాలికముగ తగ్గును కాని, ఆ ఉపశాంతి ఎంత కాలమే ఉండదు. ఎమిటిన్ ½ గ్రయిను సూది ద్వారా యిచ్చుటవలన మంచి గుణము కనబడుచున్నది. తేలు కుట్టుటవలన పిల్లలు సొమ్మసిల్లుట కలదు. కాని మరణించుట తరచుగా సంభవింపదు. ఈబాధకు గురియైనవారికి ఉత్తేజకరమైన చికిత్స అవసరము.
(2) పాముకాటు : భారతదేశములో పాముకాటువలన కలిగిన చావులలో సగము కేవలము భయముమూలమున కలిగినవే యని అంచనా వేయబడినది. విషముగల పాములకు, విషము లేని పాములకు మధ్యగల తేడా ప్రజలు గ్రహించిన యెడల ఈ మరణముల సంఖ్య ఎంతయో తగ్గును. భారతదేశమందలి పాములలో విషమ గలవి (1) కట్లపాము (viper) (2) త్రాచుపాము (cobra) (3) తుట్టె పురుగు (క్రయిట్). పామును వెల్లకిల పడవేసి
విషముగల పాములు/ విషములేని పాములు
పటము 14
- 1. విషములేని పామ యొక్క కడుపుమీది పొలుసులు (టైఫ్లాప్సు)
- 2. విషముగల పాముయొక్క పొలుసులు/మద్యభాగము పొలుసులు వెడల్పుగా నుండును
- 3. రస్సెల్పు కట్లపాము యొక్క కడుపు/మద్యభాగము పొలుసులు వెడల్పుగా నుండును
- 4. తుట్లపాము మధ్యభాగము పొలుసులు/మద్యభాగము పొలుసులు వెడల్పుగా నుండును
- 5. కట్లపాము తల
- 6. త్రాచుపాము తల (ఇచట తల ప్రక్కను 3 వ పొలుసు కంటికి ముక్కుకు ఆనుకొనియున్నది.)
దాని పొట్టపై పొలుసులను పరిశీలించిన మధ్య పొలుసు అన్నియు వెడల్పుగానున్న ఆ పాము విషముగలది. పొలుసు లన్నియు ఒకేవిధముగానున్న యెడల అది విషము కలది కాదు. సముద్రపుపాము లన్నియు విషముగలవియే. పాము తలను పరిశీలింపగా దాని తలపైన నల్లటి గుర్తు ఉన్నచో అది త్రాచుపాము. అన్ని పాముల కాట్లును ప్రాణాపాయ కరమైనవి కావు. విషసర్పములకు ముఖ భాగమున కోరలు గలవు. అవి కాటు వేయునప్పుడు ఆ కోరలనుండి గాయములోనికి విషము దిగును. ఇది, పాము విషము లోని కెక్కుటకు వ్యవధియుండెనా యను విషయము పైనను, విషము విషమయ మాంస గ్రంధులలో నిలిచియున్నదా లేక అంతకు పూర్వమే ఆహారముపై వెచ్చింపబడినదాయను విషయముపైనను ఆధారపడును. ఇందులకు జరుగవలసిన చికిత్స:
- (అ) కరిచిన చోటుపైన ఏదైనా గుడ్డతో కాని, రబ్బరుతో కాని కట్టవలెను.
- (ఆ) గాయమును కోసి రక్తము బైటికి పారునట్లు చేయవలెను.
- (ఇ) పాలివావెంటుసీరం సాధ్యమైనంత త్వరలోను, పెద్ద మోతాదులోను సూదిమందుగ ఇచ్చుట.
- (3) కందిరీగ కుట్టుట : పొకెన్ సూదిమందుగ నిచ్చిన నొప్పి తగ్గును.
- (4) మనుష్యుని కాటు : సనుష్యుని కాటు సాధారణముగ క్రిమీజన్య విషదోషమును కలిగించును. దానినికడిగి కట్టుకట్టవలెను. అవసరమైనయెడల పెన్సిలిన్ ఇయ్యవలెను.
వెం. రా.