Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్యాన కృషి

వికీసోర్స్ నుండి

ఉద్యానకృషి : నేత్రానందము కొరకును నీడకొరకును, ఫలముల కొరకును, వినోద విహారముల కొరకును, మన నివాసముల చుట్టునుగాని సర్వజనోపయోగముగ నుండుటకు తగిన బహిరంగ ప్రదేశములందుగాని, రమణీయములగు తరులతా గుల్మాదులను అందముగా సమర్చి పెంచిన తోటలను ఉద్యానవనములనియు, అట్టి కృషిని ఉద్యానకృషి యనియు అందురు. ఉద్యాన కృషియందు పండ్ల పెంపకము, కూరగాయల పెంపకము. పుష్పాదుల పెంపకము అను మూడు ముఖ్య విభాగములు కలవు.

1. పండ్లతోటల పెంపకము : పండ్లతోట నొకసారి పెంచిన తరువాత అది ఒక యింటివలె పెక్కు కాలము

1 వ పటము

గృహోనవనమునందు పూలతొట్ల అలంకరణ

మనునదిగా నుండును. అందుచే తోటలు పెంచుటకు ముందు వానికి అవసరమగు శీతోష్ణ పరిస్థితులు, నాటు ప్రదేశము యొక్క యోగ్యత అనగా దానియొక్క ఎత్తు పల్లములు, నేలలు, నీటిపారుదల సౌకర్యములు, మంచి విత్తనములు లేక మొక్కల సేకరణము, పంట యొక్క అమ్మకమునకు అనుకూలములగు పరిస్థితులు మొదలగు విషయములను అన్నిటిని పరిశీలింప వలయును.

తోటలు పెంచు ప్రదేశము, వడగండ్లు, గాలివానలు, వేడిగాడ్పులు, మంచు మొదలగు వానికి గురికాకుండ నుండుట అవసరము. 1200 నుండి 1500 అడుగుల ఎత్తు వరకుగల ప్రదేశములలో ఉష్ణమండలపు ఫలములు, సమశీతోష్ణ మండలపు ఫలములు బాగుగా ఫలించును.

తోటకు నిర్ణయింపబడిన నేల సారవంతమైనదిగానుండి 4 మొదలు 6 అడుగుల వరకు లోతుకలిగి యుండవలెను. నేల క్రింది భాగమున బండరాళ్ళు ఉండరాదు. నేల జిగురుగా నుండకూడదు. మంచిగాలి ప్రసారమునకు అవకాశము ఉండవలెను. అది నీరు వేగముగా ఇంకునదిగా నుండవలెను. భారతదేశమునగల ముఖ్యమైన రకముల నేలలు, వాని యునికి, ఫలముల కృషి విషయమున వాటి అనుకూల్య ప్రాతికూల్యములు ఈదిగువ వివరింపబడినవి.

వండలి నేలలు: ఇవి గంగ, సింధు, గోదావరి, కృష్ణ మొదలగు నదుల ప్రక్కలందును, సాగరసంగమ స్థానము లందును ఉన్నవి. ఇవి తోటల పెంపకమునకు అనుకూల మగు గుణములన్నియు కలిగియుండుటచే ఈ నేలలందు విరివిగా ఫలకృషి సాగుచున్నది.

ఎఱ్ఱ నేలలు: ఇవి దక్షిణ భారతదేశమున విరివిగా నున్నవి. వండలి నేలల తరువాత ఫలకృషికి అనుకూలమగు నేల లివియే. ఉత్తర, దక్షిణ కెనరా, సూరత్, బీదర్ వికారాబాదు, మొదలగు ప్రాంతములందుగల ఎఱ్ఱకంకర నేలలు (laterite Soils) కూడ కొన్ని ఫలజాతులను పండించుటకు అనుకూలముగా నుండును. ఎఱ్ఱ నేలల యందును, కంకర నేలలయందును, మామిడి, జామి, సపోటా, జీడిమామిడి, నేరేడు, పెద్ద ఉసిరిక, లక్ష్మణా ఫలము మొదలగునవి పెంచవచ్చును.

నల్లరేగడి నేలలు : ఇవి మధ్యప్రదేశము నందును, పర్భని, ఔరంగాబాదు, రాయచూరు, రాయలసీమ మొదలగు ప్రాంతములందును విస్తారముగనున్నవి. ఇవి వట్టి బంక నేల లగుటచేతను, వీనియందు చెట్ల వేళ్ళు బాగుగా లోతునకు దిగక పోవుట చేతను, పండ్లతోటల పెంపకమునకు అనుకూలింపవు. మరియు ఈ నేలలు ఎండినతరువాత బీటలుతీయు స్వభావము కలిగియుండుటచే చెట్లకు నష్టము కలుగును. తెల్లకంకర నేలలు లేక సున్నపు నేలలు, చవిటి నేలలు పండ్లతోటలకు అనుకూలములు గావు. కాని, నీరు బాగుగా ఇంకు, తేలికైన నల్లగరుప నేలలందు మోసంబి, సాత్కుడి, లేక బత్తాయి, నిమ్మ, జామి, లక్ష్మణాఫలము మొదలగు జాతులను పెంచదగును. ఫలవృక్షములను తోటలయందేగాక, భవనముల ఖాళీప్రదేశములందును, గోడల ప్రక్కలందును, రహదారుల యొక్కయు కాలువగట్ల యొక్కయు ప్రక్కలందును నాటవచ్చును. ఇట్లు నాటుటకు కొబ్బరి, బొప్పాయి, పనస, చింత, మామిడి, జీడిమామిడి, నేరేడు మొదలగు జాతులు అనుకూలములు.

2 వ పటము

గృహోపవనమునందలి పూలమడి నమూనా

తోట పెంచుటకు ఏర్పాట్లు: తోటను పెంచు స్థలము ఎత్తైన సమతల ప్రదేశము కలదిగా నుండవలెను. తీవ్రముగా వీచు గాలులనుండి రక్షణము నొనగుటకు, మొక్కలను నాటుటకుముందే తోటచుట్టును ఎత్తుగా పెరిగి చిరకాలముండు మామిడి, సరుగుడు మొదలగు చెట్లు నాటవలెను. తోటను పశువులు, మేకలు పొడుచేయకుండ కాపాడుటకు తోటచుట్టును మంచి కంచెను నాటుట అవసరము. ఇందులకు తెల్ల తుమ్మ, సీమచింత, కిత్తనార, నేపాళము, చిల్లకంప మొదలగు వానియొక్క విత్తనములనుగాని కొమ్మల యొక్క ఖండములనుగాని రెండు వరుసలలో నాటవలెను. తోటను పెంచు ప్రదేశమును ముందుగా కొలిచి, ఎత్తు పల్లములను చదును చేసినతరువాత అనుకూలమగు భాగములుగా విభజింపవలయును. తోటలోని బాటలు చక్కగా నుండుటయు, తోట చదరముగాను ఇమిడిక గాను ఉండుటయు ముఖ్యవిషయములు. బాటలు, నీటికాలువలు ఏర్పాటుచేయునపుడు నీరు సులభముగా ప్రతిభాగమునకును పారు నవకాశమును కలిగియుండునట్లు చూడవలెను. తోటలకు కావలసిన నీరు సరఫరాచేయుటకు తగిన మంచినీటి బావులుండవలెను. తొట యొక్క విస్తీర్ణము, నీటి సౌకర్య మున్నంతవరకే పరిమితము కావలెను. తోటయండు బావులకు దగ్గరగా నీరు ఎక్కువగా కోరు అరటి, బొప్పాయి, నారింజ, జాతులను, కొంచెము దూరముగా మామిడి, జామ, సపోటా మొదలగు జాతులను నాటవలెను.

చెట్లు నాటుదూరము : పండ్ల మొక్కలను చాల తక్కువ దూరముగ నాటిన యెడల చెట్లు పెద్దవైన తరువాత వానికి తగినంత సూర్యరశ్మి, నీరు లభించక పోవుటచే తగుఫలితము కలుగదు, భూమిలో చెట్ల వేళ్ళు, నీరుకొరకు, ఆహారము కొరకు చాల వేగముగా విస్తరించును. సాధారణముగా చెట్ల యొక్క కొమ్మలు బయట యెంతఎత్తునకు వ్యాపించి పెరుగునో వేళ్ళుగూడ భూమిలో అంత లోతునకుగాని అంతకంటే ఎక్కువ లోతునకుగాని వ్యాపించును. చెట్లు అనేక సంవత్సరములు మనవలసిన వగుటచే అవి 10-15 సంవత్సరములు పెరిగినతరువాత ఎంతవరకు వ్యాపింపగలవో దానికి తగినంత నీరు, వెలుతురు, ఆహారము లభించుటకు మధ్య ఎంతెంత దూరముండవలెనో, వానిని నాటునప్పుడే నిర్ణయింపవలెను. మొక్కలను చదరపు పద్ధతిలో నాటుటయే ఉత్తమము, వివిధ ఫలజాతులను చదరపు పద్ధతిని నాటదగిన దూరములు ఈ క్రింద నీయబడినవి.

1. మామిడి 40 అడుగులు
2. నిమ్మజాతులు 20-30 అడుగులు
3. సపోటా 30 అడుగులు
4. జామి 25 అడుగులు
5. ద్రాక్ష 24 అడుగులు
6. లక్ష్మణాఫలము 20 అడుగులు
7. బొప్పాయి 8-10 అడుగులు
8. అరటి 6-8 అడుగులు
9. ఫాల్సా 4-6 అడుగులు
10. కొబ్బరి 24 అడుగులు
11. అంజూర 8 అడుగులు
12. దానిమ్మ 15 అడుగులు

తోటయందు ప్రతివిభాగమునందును చెట్లునాటు స్థలము లను గుర్తించిన పదవ గోతులను త్రవ్వవలెను. మెత్తని భూములలో గోతులు త్రవ్వనవసరముండదు. విస్తరించి ఎదుగు మామిడి, జామ, నిమ్మజాతులు, సపోటా మొదలగు వానికి 3X3X3 అడుగులు లోతుకలిగిన గోతులుండ వలెను. అరటి, బొప్పాయి, ఫాల్సా మొదలగు జాతులకు 1½x1½x1½ అడుగుల గోతులు చాలును, గోతులలోని మీది సగముభాగమును మట్టితో బాగుగా చీకిన పశువులు యెరువు, వండలిమట్టి 10 గంపలు కలిపి నింపవలెను. వీనితో పాటు ఒకటి లేక రెండు శేర్ల ఆముదపుపిండిని కూడ కలిపినచో, చెదల బాధ తగ్గును. గోతులను భూమిపైకి 6 అంగుళముల ఎత్తువరకు నింపి మట్టి బాగుగా క్రుంగిన తరువాత మొక్కలను నాటి, వాటిని ప్రక్కలయందు పాతిన కఱ్ఱలకు త్రాళ్లతో కట్టవలెను.

ప్రవర్ధనము : విత్తనములను చల్లియు, కొమ్మల యొక్క ఖండములను నాటియు మొక్కలను ప్రవర్ధనము చేయవచ్చును. పనస, కొబ్బరి, జీడిమామిడి, నేరేడు, ఫాల్సా మొదలగు జాతులు విత్తనములవలన అభివృద్ధి చేయబడును. చెట్ల యొక్క కొమ్మలతో ప్రవర్ధనము వేర్వేరు పద్ధతులలో చేయబడును. అంజూర, ద్రాక్ష జాతులు కొమ్మల యొక్క ఖండముల వలనను, జామ నేలంట్లు వలనను, నిమ్మజాతులు మొగ్గంట్లు వలనను, మామిడి, సపోటా చేర్పు అంట్లు వలనను ప్రవర్ధనము చేయుట ఆచారము.

మేలైన జాతుల విత్తనములయొక్క. లేక, పండ్ల మొక్కల యొక్క సేకరణము : ఈ విషయమున ప్రత్యేక శ్రద్ధ వహించుట ఎంతేని అవసరము. తక్కువ రకపు మొక్కలను, దొరికినవాని నెల్ల నాటిన యెడల వానినుండి తగు ఫలసాయము లభింపక, చేసిన ప్రయత్నములన్నియు వృథయగును. పండ్ల చెట్లు ఎక్కువ కాలముండి, ఫలితము నిచ్చెడివగుటచే మేలైన జాతుల మొక్కలను నాటుటయే శ్రేష్ఠము.

సేకరించదగిన కొన్ని పండ్లజాతుల రకములు :

మామిడి : (1) అల్ఫాన్సొ, బెనిషన్, మల్హోబా, దసేరి (కోతరకములు); (2) పెద్దరసము, చిన్న రసము, నాగుల పల్లి యిర్సాలు, పంచదార కలసి, (రసపురకములు) ; (3) ఆధుని, అచార్, పసంద్ (ఆవకాయ రకములు).

జామి : అలహాబాద్ సుపేద. ద్రాక్ష: అనబేషాహి, పచ్చద్రాక్ష, కిస్మిస్. సీతాఫల జాతులలో : లక్ష్మణాఫలము. అంజూర : మైస్రమురకము. అరటి : బస్రాయ్, చక్కెరకేళి, అమృతపాణి. నిమ్మ: పుల్ల నిమ్మ, కాగజినిమ్మ. తియ్యనారింజ : సాత్కుడి, బత్తాయి, మొసాంబి. బొప్పాయి : హనీడ్యూ, వాషింగ్ టన్. సపోటా : పాలసపోటా, గుండ్రని రకము.

మొక్కలను నాటుట, భూమిపేద్యము, నీటి పారుదల: పండ్ల మొక్కలను వర్షాకాలము లోపలనే నాటుట మంచిది. ఎండగానుండు పగటి సమయములందు, వేసవి నెలలయందు చెట్లను నాటరాదు. మొక్కలను నాటుటకు ముందు క్రిందనుండు కొన్ని యాకులను త్రుంచివేసి, నాటిన తరువాత చుట్టునున్న మట్టిని గట్టిగా నొక్క వలయును. వెంటనే నీరుపోయుట అత్యవసరము. నాటిన తరువాత కొంతకాలము వరకును సూర్యరశ్మి తిన్నగా తగులకుండు నట్లును, పశువులనుండి, మేకలనుండి రక్షణము కొరకును మొక్కల చుట్టును కంపను నాటవలెను.

భూమియందు పదును ఆరకుండుటకు తోటలోని విభాగముల చుట్టును గట్ల నేర్పరచవలెను. వర్షాకాలా రంభమునను, శీతాకాలారంభము నను తోటభూమినిదున్నుట అవసరము. అవనరమునుబట్టి అప్పుడప్పుడు కలుపుగడ్డి లేకుండ అంతరకృషి చేయుటకూడ ముఖ్యము. ప్రతి సంవత్సరమును తొట

3 వ పటము

గృహూప వనమునందలి పూలమడి నమూనా

భూమిని తొలకరి సమయమున దున్నినవెంటనే జనుము, జీలుగు, పెసర, వెంపలి, మొదలగు పచ్చియెరువు పైరులను పెంచి, వర్షాకాలాంతమున వానిని భూమిలో కలియ దున్నవలెను. వేరుసెనగ లేక ఆముదపుపిండి, ఎముకల పొడి మొదలగు సేంద్రియపు టెరువులను, సూపరు ఫాస్పేటు, అమ్మోనియమ్ సల్ఫేటు మొదలగు రాసాయనికము లయిన ఎరువులను అవసరమునుబట్టి, పచ్చి యెరువులతో బాటు వర్షాకాలముననే భూమియందు జేర్చిన యెడల భూసారము వృద్ధియై, అధిక ఫలసాయము లభించును. పండ్ల చెట్లకు పాదు పద్ధతి ప్రకారమే నీరు కట్టుట ఉత్తమము. చెట్లకుకట్టిన నీరు వాటి బోదెలకు తగులుచుండరాదు.

2. శాక కృషి లేక కూరగాయల పెంపకము: కాయ గూరల పెంపకమునకు నిర్ణయింపబడిన నేలలు కనీసము ఒక ఆడుగు లోతువరకు ఒకే మాదిరిగా నుండవలయును. నేల బాగుగా నీరు వడియునట్టిదై యుండవలెను. బంక నేలలు, చవిటి భూములు కూరగాయల పెంపకమునకు అనుకూలములు కావు. శాకకృషి సందర్భమున ఈ క్రింది విషయములను గమనించవలెను.

1. పెంచదగు కాయ గూరలు.
2. విత్తనముల సేకరణము,
3. కాయగూరల తోటలు వేయు ఏర్పాట్లు.
4. నీటి సౌకర్యములు - ఎరువులు.
5. చీడలు, తెగుళ్ళు - వాటి నివారణము.
6. అమ్మకమునకు తగు సౌకర్యములు.

1. పెంచదగు కాయగూరలు: ప్రతి మాసమునందును పెంచవీలగు కాయగూర లనేకములు గలవు. ఎక్కువ ధరలకు అమ్ము కాయగూరలను పండించుటే లాభదాయకము. వివిధ రకములను పండించు సందర్భమున, వాటికి భూమి యొక్క ఆనుకూల్యమును, కొనుబడిదారుల యిష్టానిష్టములను దృష్టియందుంచుకొన వలయును.

2. విత్తనములను సేకరించుట: కాయగూరల విత్తనములు త్వరితముగా తమ చైతన్యమును కోల్పోవును. అందుచే ఎక్కువ కాలము వాటిని నిలువయుంచక, వెంటనే నాటవలయును. విత్తనములను నమ్మకమైనట్టి వ్యాపారస్థులనుండి కాని, ప్రభుత్వ వ్యవసాయశాఖనుండి కాని సేకరించుట మేలు.

3. కాయగూరలతోటల యేర్పాటులు: కాయగూరలను పెంచు విధానము, భూమి యొక్క మిట్ట పల్లములను బట్టియు, విస్తీర్ణమును బట్టియు నుండును. వివిధరకముల కాయగూరలు వివిధ కాలములలో పెంచబడునవి యగు టచే భూమిని సరియగు మళ్ళుగా విభజింపవలసియుండును. ఎరువు వేయుటకు, సాగు పనులకు ఫలితమును తీసికొను టకు, పర్యవేక్షణమునకు వీలగునట్లుగా బాటలు కూడ వేయవలెను.

4. నీటి సౌకర్యములు, ఎరువులు: వర్షాకాలమున నీరు పెట్టుట అనవసరము. ఇతర కాలములయందు మాత్రము మంచినీటి వసతి మిక్కిలి అవసరము. కాయగూరలు పండించు భూమికి మంచి ఎరువును అధికముగా వాడవలయును. భూమిని 2 లేక 3 సార్లు బాగుగా మెత్తగా దున్ని ఎకరమునకు 50 బండ్ల చొప్పున పశువుల యెరువు వేసి, మరల బాగుగా కలియ దున్నవలెను. పశువుల యెరువు లభింపనిచోట్ల పచ్చిరొట్ట పైర్లను పండించి, వానిని భూమిలో కలియదున్న వచ్చును.

5. చీడల యొక్కయు, తెగుళ్ళయొక్కయు నివారణము: కొత్తగా దున్నిన భూమియందు సాధారణముగా ఎఱ్ఱ చీమలుండుట సంభవించును. ఇవి విత్తనములను, మొలకలను నాశనము చేయును. అందువలన విత్తనములను నాటుటకు ముందు ఆముదపు పిండి వాడుట మంచిది.కాయగూరలను పండించునపుడు వానిని బాధించి నష్ట వరచు పురుగులను, తెగుళ్ళను నివారించుటకు తగుచర్యలను సకాలములో తీసికొనవలెను.

6. అమ్మకమునకు సౌకర్యములు : కూర గాయల పెంపకము పట్టణములకు సమీపమున సాగించుట లాభ చాయకము. ప్రతి యింటి ఆవరణమునందును అయింటి లోనివారికి కావలసిన కూరగాయలను అన్ని కాలముల యందును పండించవచ్చును. పెరటితోటల పద్ధతి ప్రకారము కాయగూరలను పండించుట మిక్కిలి లాభకరముగా నుండును.

7. కాయగూరల పెంపకమునకు అవసరమగు కొన్ని ముఖ్య విషయములు : విజ్ఞానకోశము . ౨ "పేరు. ఉద్యాన కృషి నాటు విధానము కాలము మొక్కల మధ్య దూరము. (ఆ) వరుసల మధ్యదూరము. (ఆ) 1. వంగ 2. టమేటో నారు నాటవలెను సంవత్సరము పొడుగునను 1 3 2 2 33 " 11 33 2 3 3. బెండ 4. గోరుచిక్కుడు 5. ఫ్రెంచి చిక్కుడు 6. బొబ్బర 7. ముల్లంగి 8. ఆకుకూరలు 9. కూర మిరప వి త్తనములు ララ ,, విత్తనములు వెదజల్ల వలెను. నారు పెట్టవలెను. 12 17 1 1 $1 1 2 1 55 > వర్షాకాలమున 1 మరియు శీతాకాలమున I వరుసలలో విత్తవలయును. శీతాకాలమున 17 2 10. మిరప 1+ 11. గాజరగడ్డ 12. టర్నిప్ 13. పూగోబి 14. క్యాబేజీ 15. లెట్యూస్ 1 + 14 25 93 నారు పెట్టవలెను. 11 11 +9 11 14 P 3 1 1+ ני 16. ఉల్లి 17. బటాణి వి త్తనములు నాటవలెను. తీగలుగ పెరుగు ఆనప, బీర, గుమ్మడి, పొట్ల, కాకర, బూడిదగుమ్మడి, చిక్కుడు మొదలగు కూరజాతులకు, 6.10 అడుగుల దూరమున 2 అడుగులు పొడవు, వెడల్పు, లోతు కలిగిన గోతులను త్రవ్వి, వాటిని మట్టి ఎరువులతో నింపి, ఒక్కొక్క గోతియందు 4, 5 విత్తనముల చొప్పున నాటవలెను. దొండపాదులకు మాత్రము, 8 అంగుళముల పొడవుకలిగిన కొమ్మలయొక్క ముక్కలను నాటవలెను. 4 వ పటము తరులకాగుల్మ పుష్పాదికముల కృషి:తరులతాగుల పుష్పాదికములతో గూడిన ఉద్యానవన ముల యందు, పౌరో ద్యాన వనములు, మందిరారామము లు, గృహోపవన గృహోపవనమునందలి పూలముడి నమూనా ములు, ఆలయవన 213

  • 4

1 ములు, బడితోటలు అను వివిధ తరగతులు కలవు. ఆయా జాతుల స్వభావభేదము ననుసరించి తరు ల తా గుల పుష్పాదులను ఈ క్రింది ఉపతరగతులుగా విభజింప వచ్చును. 1. మళ్ళలోను, గోలెములలోను పెంచదగు రమ్యమైన మొక్కలు : వర్షాకాలపు పుష్పజాతులు : నీలిగోరింట; (Balsm) బంగాళాబంతి (zinnia); బంతి, నిత్యబంతి (calliopes) సూర్యకాంతము ; పొగడబంతి (Gomphrena). శీతకాలపు పుష్పజాతులు: చేమంతి, చీనా చేమంతి (Ater) గుత్తిచేమంతి (Ageratum): శిఖర తిలకము (Antirrhinum); డయాంతము (Dianthus); పూ బెండ (Hollyhock) సాల్వియము (salvia); ఫ్లాక్సము (Phtox) నా స్తర్షియము (Nasturtium). దుంపజాతులు : చెంగల్వ (Amaryllis); గడ్డిచెంగల్వ (Zephyranthue); గుల్ సబ్ (Tuberose); మెట్ట తామర (Canna); డాహ్లియము (Dahlia). 'పరిమళించు పర్జజాతులు : దవనము (Artemesia) పుష్పదవనము (Angelonia); మరువము (Marjoram).

2. ఒత్తుగ నాటి కత్తిరించదగు రమ్యమైన జాతులు:

మళ్ళఅంచుల నాటుటకు తగినవి: రంగుల పొన్నగంటి (Alternanthera) నల్లవావిలి (Justicia) ; యూపటోరియమ్ (Eupatorium) ;పాషాణ భేది (coleus).

త్రోవల ప్రక్కలను నాటదగిన జాతులు: పూతిక (Mulberry) ; మందార; సరుగుడు ; దురంత (Duranta) అరేలియమ్ (Aralia).

చుట్టు కంచెలుగ పెంచదగిన జాతులు : సీమచింత; గోరింట ; సీకాయ ; కిత్తనార; వెదురు,

3. దిబ్బలపై లేక రాళ్ళగుట్టలపై పెరుగునవి : బ్రహ్మ జెముడు (Cactus); జెముడు (Euphorbia); కంచె పాల (Pedilauthus); కిత్తనార (Agave); కలబంద (Aloe); ఈటెకలబంద (Yucca); చాగ (Sansivieria) ద్వివర్ణపర్ణి (Tradescantia)

4. నీడను లేక చలువగృహములలోపెంచదగు జాతులు :

ఫెరనులు (Ferns); ఆర్కిడములు (Orchids); బిగోనియా (Begonia); క లేడియములు (Caladium).

5. నీటిలో పెరుగు జాతులు: కలువ, పద్మము.

6. రమ్యములగు గుల్మములు (పుష్పజాతులు) : గులాబి; మల్లె కనకాంబరము, నీలాంబరము, ములు గోరింట (Barleria), రేగంధి (Night queen) దీవాగంధి (Day king) నందివర్ధనము, మందార, అంటానా;

పర్ణజాతులు : పాషాణభేది (Coleus); క్రోటనులు; ఎరాంతిమము (Eranthemum), అరేలియా (Aralia) మొగలి (Pandanus), తాలములు (Palms); అకాలీఫము (Acalypha.)

7. తీగజాతులు: తీగమల్లి, జాజి, సన్నజాజి, తీగ గులాబీ, సంపంగి, పొగగన్నేరు, (Allamanda); కాళీ రత్నము (Ipomed); అంటిగోనన్ (Antigonon) ; రాధామనోహరము (duis calis); తంబర్జియా (Thumbergia); బొగినిపల్లి (Bouganvillia).

8. రమ్యములగు వృక్షములు: పుష్పజాతులు: పారిజాతము, సంపంగి, పెద్దతురాయి, గన్నేరు, కాండమల్లె (Milling toria), నాగలింగము (Couroupita).

పర్ణజారులు : తాలములు (Palms), అరరియము(Araucaria), శూజా (Thuja), అశోకము, పొన్న, పొగడ.

9. నీడకొరకు పెంచదగు వృక్షజాతులు: గంగరావి, కానుగ, వేప, రావి, చెట్టు సొర (Kigelia). ఎల్. వేం. ర.